రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి | 13 people lifeless in a Road accident in Karnataka | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి

Mar 7 2020 6:11 AM | Updated on Mar 7 2020 6:11 AM

13 people lifeless in a Road accident in Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం తెల్లవారుజామున తుమకూరు జిల్లాలోని కుణిగల్‌ తాలూకా బ్యాలదకెరె గేట్‌ వద్ద బెంగళూరు – మంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–75)పై ఈ ఘటన జరిగింది. రోడ్డు డివైడర్‌ను ఢీకొన్న ఎస్‌యూవీ అనంతరం కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడిన మరో నలుగురికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని హోసూరుకు చెందిన మంజునాథ్‌ కుటుంబం ధర్మస్థలానికి వెళ్లింది. అనంతరం టవేరా వాహనంలో తిరుగు పయనమయ్యారు. ఇదే సమయంలో బెంగళూరు నుంచి బ్రిజా కారులో నలుగురు స్నేహితులు ధర్మస్థల వైపు వెళుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కుణిగల్‌ వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీలు కొడుతూ రోడ్డుకు అటువైపుగా దూసుకెళ్లి, అటునుంచి వస్తున్న టవేరా వాహనాన్ని ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇరు వాహనాల్లో ప్రయాణిస్తున్నవారిలో 13 మంది అక్కడికక్కడే మరణించారు. అమృతూరు పోలీసులు రెండు కార్లలో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement