
శ్రీమఠం పూర్వ పీఠాధిపతి కళాకర్షణ
కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీమఠం పూర్వ పీఠాధిపతి శ్రీ సుయతీంద్ర తీర్థుల కళాకర్షణ ఆదివారం నిర్వహించారు.
45రోజుల తర్వాత పార్థివదేహం వెలికితీత 6 నుంచి 11గంటల వరకు ముఖదర్శనం
మంత్రాలయం, : కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీమఠం పూర్వ పీఠాధిపతి శ్రీ సుయతీంద్ర తీర్థుల కళాకర్షణ ఆదివారం నిర్వహించారు. స్వామి ముఖ దర్శనంతో భక్తులు పరవశించారు. పీఠాధిపతి శ్రీ సుభుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గత మార్చి 8న పూర్వ పీఠాధిపతి పరమపదించిన విషయం తెలిసిందే. మధ్వమత ఆచారంలో భాగంగా పరమపదించిన పీఠాధిపతుల పార్థివ దేహాన్ని ముఖ దర్శనార్థం బృందావనం నుంచి వెలికితీశారు.
ఆదివారం ఉదయం 6 నుంచి 11 గంటల వరకు స్వామి ముఖ దర్శనంతో భక్తులు తరించారు. పార్థివదేహానికి ముందుగా ఆయన కుమారుడు, మఠం ఆప్త కార్యదర్శి సుయమీంద్రాచార్ మంగళహారతినిచ్చారు. 45 రోజుల తర్వాత వెలికి తీసిన పార్థివదేహం చెక్కుచెదరకపోవడం విశేషం. దర్శనార్థం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చివరగా స్వామి కుమారుడు మరోసారి హారతినిచ్చిన అనంతరం బృందావనం చేశారు.