
న్యూఢిల్లీ/ముంబై: దేశంలో ఒక్క రోజులో 10,667 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 380 మంది బాధితులు కన్నుమూశారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసులు 3,43,091కు, మరణాలు 9,900కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. ఇండియాలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 1,53,178. బాధితుల్లో 1,80,012 మంది(52.46 శాతం) చికిత్సతో కోలుకున్నారు. కరోనా సంబంధిత మరణాల విషయంలో భారత్ ప్రపంచంలో ఎనిమిదో స్థానానికి చేరింది. మహారాష్ట్రలో ఇప్పటిదాకా 3,661 మంది పోలీసులు కరోనా బారినపడ్డారని, వీరిలో 42 మంది మృతి చెందారని రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment