
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయ తాండవం సృష్టిస్తోంది. మహమ్మారి ఉధృతికి అడ్డుకట్ట పడడం లేదు. కరోనా సంబంధిత మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు.. 24 గంటల్లో కరోనాతో 71 మంది కన్నుమూశారు. కొత్తగా 2,411 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో ఇప్పటిదాకా మొత్తం మరణాలు 1,223కు, పాజిటివ్ కేసులు 37,776కు ఎగబాకాయని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 26,565 కాగా, 10,017 మంది బాధితులు చికిత్సతో కోలుకొని ఇళ్లకు చేరారు. అంటే రికవరీ రేటు 26.52 శాతానికి పెరిగినట్లు స్పష్టమవుతోంది. దేశంలో కరోనా వైరస్ నిర్ధారణ కోసం ఇప్పటిదాకా 10.40 లక్షల ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది.
మే 17 వరకు విమానాల నిలిపివేత: డీజీసీఏ
లాక్‌డౌన్ పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు వాణిజ్య ప్రయాణికుల విమా నాలను మే 17వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment