న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. వరుసగా నాలుగో రోజు 45 వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గత 24 గంటల్లో కొత్తగా 48,661 కేసులు నమోదయ్యాయి. 705 మంది బాధితులు తుదిశ్వాస విడిచారు. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కేసులు 13,85,522కు, మరణాలు 32,063కు చేరుకున్నాయి.
తాజాగా ఒకేరోజు రికార్డు స్థాయిలో 36,145 మంది కోలుకున్నారు. మొత్తం బాధితుల్లో8,85,576 మంది చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,67,882. రికవరీ రేటు 63.92 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచుతున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. ఇప్పటివరకు 1,62,91,331 టెస్టులు చేసినట్లు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment