చక్కెర ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి | Six dead, five critically injured after sugar factory boiler explodes | Sakshi
Sakshi News home page

చక్కెర ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి

Published Mon, Dec 17 2018 5:02 AM | Last Updated on Mon, Dec 17 2018 5:07 AM

Six dead, five critically injured after sugar factory boiler explodes - Sakshi

సాక్షి, బళ్లారి: కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట జిల్లా కుళలి సమీపంలోని ఒక చక్కెర ఫ్యాక్టరీలో ఆదివారం సంభవించిన పేలుడులో ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ నేత, మాజీ మంత్రి మురుగేష్‌ నిరాణికి చెందిన ఈ ఫ్యాక్టరీలో వృథా నీటిని ఫిల్టర్‌ చేసే బాయిలర్‌ సేఫ్టీ వాల్వ్‌ మూసుకుపోవడంతో ఒత్తిడికి బాయిలర్‌ పెద్ద శబ్ధంతో పేలిపోయింది. బాయిలర్‌ ఉన్న కట్టడం నామరూపాల్లేకుండా ధ్వంసమయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఒక ఇంజినీరు, ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు గాయపడ్డారు. ఘటనాస్థలిని  ఉన్నతాధికారులు పరిశీలించి, సహాయక చర్యలు చేపట్టారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement