
బెంగళూరు: కర్ణాటకలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. బాగల్కోట్ జిల్లా కులాలి గ్రామంలోని ఓ షుగర్ ప్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనలో ఆరుగురు కార్మికులు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రమాద సమయంలో ప్యాక్టరీలో 20 మంది కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. పేలుడు దాటికి మూడంతస్తుల భవనం కుప్పకూలింది. సహాయక చర్యలు చేపట్టిన సిబ‍్బంది శిథిలాల నుంచి ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. అధికారులు ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. పేలుడు జరిగిన సమయంలో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో చుట్టుపక్కల ఉన్నవారు భయబ్రాంతులకు గురయ్యారు. ప్యాక్టరీలో వాటర్ ఫిల్టర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ కంపెనీ బీజేపీకి చెందిన మాజీ మంత్రి మురుగేశ్ నిరాని సోదరులకు చెందినదిగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment