Bagalkot
-
Ankita Basappa: ఒక్క మార్కూ వదల్లేదు!
నూటికి నూరు శాతం అంకితం చదువుల తల్లి సరస్వతే అయినా ఆడపిల్ల చదువుకు వెనుకా ముందు ఆలోచించేవారు ఇంకా ఉన్నారు. అలాంటి వారందరూ అంకితను చూసి ఆలోచన మార్చుకోవాలి. ఎందుకంటే కర్నాటక రైతు బిడ్డ అంకిత పదవ తరగతి ఫలితాల్లో 625కు 625 మార్కులు తెచ్చుకుంది. రాష్ట్రం మొత్తం మీద సెంట్ పర్సెంట్ వచ్చింది అంకితకే. ఇలాంటి అంకితలు ఎందరో ఉంటారు చదువులో ్ర΄ోత్సహిస్తే.మే 9 వ తేదీ. ఆ ఫోన్ వచ్చేసరికి బసప్ప పొలంలో ఉన్నాడు. అవతలి వైపు ఉన్నది స్కూల్ టీచరు.‘బసప్ప గారు మీ అమ్మాయికి పదవ తరగతిలో స్టేట్ ఫస్ట్ మార్కులు వచ్చాయి’ ‘ఓ.. ఎన్ని మార్కులు వచ్చాయి సార్?’‘ఎన్ని వచ్చాయి ఏంటి బసప్ప గారు. అంతకు మించి వేయలేక 625కు 625 వేశారు. అంత బాగా చదివింది మీ అమ్మాయి. ఇన్ని మార్కులు ఇంకెవరికీ రాలేదు’...కర్నాటకలోని బాగల్కోట్కు దాదాపు గంట దూరంలో ఉండే చిన్న పల్లె వజ్రమట్టి. ఆ ఊరే బసప్పది. ఆరెకరాల రైతు. పెద్దమ్మాయి అంకిత. ఇంకా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వార్త తెలిశాక ఇంటికి ఆఘమేఘాల మీద చేరుకున్నాడు. మరి కాసేపటిలో ఊరు ఊరంతా ఆ ఇంటి ముందే ఉంది. సందడి చేసింది. కోలాహాలం సృష్టించింది. పులకరించింది. మరి ఒక చిన్న పల్లెటూరి నుంచి అంత బాగా చదివితే ఆ అమ్మాయిని ఆశీర్వదించకుండా ఎలా? అంకితను చూసి ప్రతి ఒక్కరూ మెటికలువిరవడమే.హాస్టల్లో ఉండిఅంకిత తన ఊరికి నలభై నిమిషాల దూరంలో ఉన్న ముధోల్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంది. స్కూల్ హాస్టల్లో ఉండి చదువుకుంటూనే సెలవుల్లో ఇంటికి వచ్చేది. ‘నేను సెల్‌ఫోన్ వాడను. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకుంటాను. డిజిటల్ లైబ్రరీలో అదనపు మెటీరియల్ చదివాను. ఉదయం ఐదుకు లేస్తాను. మళ్లీ రాత్రి చదువుతూనే నిద్ర΄ోతాను. ఇంట్లో ఉంటే ఇంటి పనులు ఏవో ఒకటి చేయాల్సి వస్తుంది. కాని హాస్టల్లో ఉంటే చదువు తప్ప వేరే పనేముంది. నా పాఠాలు అయ్యాక ఆడుకోవడం కూడా నేను మానలేదు. మా స్కూల్ టీచర్లు ముందు నుంచి నాకు మంచి మార్కులు వస్తాయని ఊహించారు. వారు నాకు అన్ని విధాల స΄ోర్ట్ చేస్తూ వచ్చారు. నాకు సెంట్ పర్సెంట్ వచ్చినందుకు ఆనందమే. కాని నా కంటే మా అమ్మా నాన్నలు, స్కూల్ టీచర్లు ఎక్కువ సంతోషపడటం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. మా స్కూల్లో మంచి క్రమశిక్షణ ఉంటుంది. అందువల్లే నేను బాగా చదివాను‘ అని చెప్పింది అంకిత.ఐ.ఏ.ఎస్. కావాలని‘మా అమ్మాయి బాగా చదువుతుందనుకున్నాము గాని ఇంత బాగా చదువుతుందని అనుకోలేదు. మేము ఇక ఆమె ఎంత చదవాలంటే అంత చదివిస్తాము. ఏది చదవాలన్నా ఎంత కష్టమైనా చదివిస్తాము’ అన్నారు బసప్ప, అతని భార్య గీత. భర్తతో పాటు పొలానికి వెళ్లి పని చేసే గీత కూతురిని చూసి మురిసి΄ోతోంది. ‘నేను ఇంటర్లో సైన్స్ చదివి ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత ఐ.ఏ.ఎస్. చేస్తాను’ అంది అంకిత.ముఖ్యమంత్రి ప్రశంసఅంకితకు వచ్చిన మార్కుల గురించి విని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభినందనలు తెలియచేశారు. ఇంకా బాగల్కోట్ ప్రభుత్వ అధికారులు ప్రశంసలు తెలియచేశారు. ఇక కర్నాటక డెప్యూటీ చీఫ్ మినిస్టర్ డి.కె.శివకుమార్ తానే స్వయంగా ఇంటికి వచ్చి అభినందిస్తానని కబురు పంపారు. అంకిత విజయం బాగా చదివే అమ్మాయిలందరికీ అంకితం. -
శ్రద్ధ వాకర్ తరహా ఘటన..తండ్రిని చంపి 32 ముక్కలు చేసిన కుమారుడు
బెంగళూరు: కర్ణాటక బాగల్కోట్లో శ్రద్ద వాకర్ హత్య తరహా ఘటన వెలుగుచూసింది. సొంత కుమారుడే తండ్రిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం శవాన్ని 32 ముక్కలు చేశాడు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకొద్దని వాటిని తమ వ్యవసాయ క్షేత్రంలోని బోరుబావిలో పడేశాడు. డిసెంబర్ 6న జరిగిన ఈ ఘటనలో నిందితుడ్ని విఠల కులాలి(20)గా గుర్తించారు పోలీసులు. అతని తండ్రి పేరు పరశురామ్ కులాలి(53). అయితే పరశురామ్ తాగుబోతు. రోజు ఫుల్లుగా మద్యం సేవించి కుమారుడ్ని తిట్టేవాడు. ఇతని బాధ భరించలేక భార్య, పెద్ద కుమారుడు వేరే ఇంట్లో నివసిస్తున్నారు. చిన్నకుమారుడు విఠల తండ్రితో పాటు ఉంటున్నాడు. పరశురామ్ రోజు తాగొచ్చి విఠల్‌ను దుర్భాషలాడేవాడు. కానీ, గత మంగళవారం తండ్రి తిట్లను భరించలేకపోయిన విఠల.. ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. దీంతో పరశురామ్ చనిపోయాడు. అనంతరం శవాన్ని 32 ముక్కలు చేశాడు విఠల. ఈ శరీర భాగాలను తీసుకెళ్లి మంతూర్ బైపాస్ వద్ద తమ వ్యవసాయ క్షేత్రంలోని బోరుబావిలో పడేశాడు. విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే రంగంలోకి దిగి విఠలను అరెస్టు చేశారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బోరుబావి నుంచి పరశురామ్ శరీర భాగాలు స్వాధీనం చేసుకునేందుకు ప్రొక్లేన్లతో తవ్వారు. చదవండి: మిస్డ్ కాల్స్ ఇచ్చి రూ.50 లక్షలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు -
బాగల్కోట్లో చెలరేగిన హింస..ముగ్గురికి కత్తిపోట్లు
సాక్షి,బెంగళూరు: కర్ణాటక బాగల్‌కోట్‌లోని కెరూర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ అల్లర్లలో ఓ వర్గానికి చెందిన ముగ్గురిని కత్తులతో పొడిచారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణ సమయంలో ఇరువర్గాల వారు ఆగ్రహంతో అక్కడున్న దుకాణాలు, ద్విచక్ర వాహనాలకు నిప్పంటించారు. పండ్లు, కూరగాయల బండ్లను కూడా తగలబెట్టారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కత్తిపోట్లతో గాయపడిన ముగ్గురూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలకు చెందిన 18 మందిని అరెస్టు చేశారు. నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా కెరూర్ ప్రాంతంలో గురువారం ఉదయం 8గంటల వరకు 144 సెక్షన్ విధించారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అయితే కొంతమంది యువకులు బస్టాండ్‌లో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడమే ఘర్షణకు కారణమని తెలుస్తోంది. వారిని చూసిన మరో వర్గం వారు ఆగ్రహించడం గొడవకు దారితీసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో హిందూ జాగరణ్ వేదికకు చెందిన ముగ్గురిని మరో వర్గం వారు పొడిచినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం అల్లర్లకు గల అసలు కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. దీనిపై విచారణ చేపట్టినట్ల పేర్కొన్నారు. -
చక్కెర ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి
సాక్షి, బళ్లారి: కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట జిల్లా కుళలి సమీపంలోని ఒక చక్కెర ఫ్యాక్టరీలో ఆదివారం సంభవించిన పేలుడులో ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ నేత, మాజీ మంత్రి మురుగేష్ నిరాణికి చెందిన ఈ ఫ్యాక్టరీలో వృథా నీటిని ఫిల్టర్ చేసే బాయిలర్ సేఫ్టీ వాల్వ్ మూసుకుపోవడంతో ఒత్తిడికి బాయిలర్ పెద్ద శబ్ధంతో పేలిపోయింది. బాయిలర్ ఉన్న కట్టడం నామరూపాల్లేకుండా ధ్వంసమయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఒక ఇంజినీరు, ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు గాయపడ్డారు. ఘటనాస్థలిని ఉన్నతాధికారులు పరిశీలించి, సహాయక చర్యలు చేపట్టారు. -
కర్ణాటకలో బాయిలర్ పేలి ఆరుగురు మృతి
బెంగళూరు: కర్ణాటకలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. బాగల్కోట్ జిల్లా కులాలి గ్రామంలోని ఓ షుగర్ ప్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనలో ఆరుగురు కార్మికులు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ప్యాక్టరీలో 20 మంది కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. పేలుడు దాటికి మూడంతస్తుల భవనం కుప్పకూలింది. సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది శిథిలాల నుంచి ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. అధికారులు ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. పేలుడు జరిగిన సమయంలో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో చుట్టుపక్కల ఉన్నవారు భయబ్రాంతులకు గురయ్యారు. ప్యాక్టరీలో వాటర్ ఫిల్టర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ కంపెనీ బీజేపీకి చెందిన మాజీ మంత్రి మురుగేశ్ నిరాని సోదరులకు చెందినదిగా గుర్తించారు. -
బాదామిలో సిద్ధరామయ్యను ఓడిస్తాం
-
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
క్రూజర్ వాహనాన్ని ఢీకొన్న కేఎస్ఆర్టీసీ బస్సు మహారాష్ట్రకు చెందిన ఆరుగురు దుర్మరణం బాగల్‌కోట జిల్లాలో ఘటన బనశంకరి(కర్ణాటక): కర్ణాటకలోని బాగల్‌కోట జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురిని బలిగొంది. కేఎస్ఆర్టీసీ బస్సు క్రూజర్ వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా, దారపాళ గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వివరాలు.. దారపాళ గ్రామానికి చెందిన 12 మంది వ్యక్తులు కేన్సర్ ఔషధం కోసం క్రూజర్ వాహనంలో గురువారం సాయంత్రం శివమొగ్గకు చేరుకున్నారు. అక్కడ ఔషధం తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. బాగల్‌కోటే జిల్లా బీళగి తాలూకా, కూర్తి క్రాస్ వద్ద శుక్రవారం ఉదయం విజయపుర నుంచి హుబ్లీ వెళ్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు క్రూజర్‌ను అతివేగంగా ఢీకొంది. ప్రమాదంలో క్రూజర్‌లో ప్రయాణిస్తున్న నాగేశమాళే, పాండురంగసాళుంకె, విజయాసిందతో పాటు మరో ముగ్గురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ప్రమాద తీవ్రతకు క్రూజర్ వాహనం నుజ్జునుజ్జుకావడంతో కొన్ని మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి. ప్రమాదం సమయంలో భారీ శబ్ధం రాగా ఏదో జరిగిందని భావించి చుట్టుపక్క గ్రామస్తులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ నెలకొన్న భీతావహ పరిస్థితి చూసి చలించిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను అతికష్టం మీద బయటికి తీశారు. తీవ్రంగాగాయపడిన ఆరుగురితోపాటు మృతదేహాలను బీళగి ప్రభుత్వ ఆస్పత్రి కితరలించారు. కాగా ప్రమాదానికి కారణమైన బస్సులో ఉన్న కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. కేసు దర్యాప్తులో ఉంది. -
మిస్డ్ కాల్ తెచ్చిన తిప్పలు....
న్యూఢిల్లీ: కర్ణాటక, ఢిల్లీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో నయవంచకుడి వలలోనుంచి ఓ యువతి క్షేమంగా బయటపడింది. మోసానికి పాల్పడిన యువకుడిని పోలీసులు కటకటాల వెనక్కు పంపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళ్తే... ఆరేడు నెలల క్రితం కర్ణాటకలోని బాగల్కోట్కు చెందిన యువతికి ఓ మిస్డ్ కాల్ వచ్చింది. దీంతో ఆమె తిరిగి ఫోన్ చేసింది. పశ్చిమబెంగాల్లోని 24 పరగణాల జిల్లాకు చెందిన సుజోయ్దేయ్ ఫోన్ ఎత్తి తనను తాను వ్యాపారవేత్తగా చెప్పుకుంటూ పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత పరిచయాన్ని కొనసాగిస్తూ నెమ్మదిగా సదరు యువతికి మాయమాటలు చెప్పి ప్రేమలోకి దింపాడు. కొన్నిరోజులపాటు ఈ వ్యవహారం నడిచిన తర్వాత ఓ రోజు తనకు పెళ్లి చేయాలనుకుంటున్నారని, పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారని యువతి చెప్పడంతో ఇంట్లోనుంచి పారిపోయి రావాలంటూ సుజోయ్ చెప్పాడు. దీంతో చెప్పినట్లుగానే ఆమె రూ.3 లక్షల నగదు, పది తులాల బంగారంతో ఇంట్లోనుంచి పారిపోయి బెంగళూరుకు వచ్చింది. సుజోయ్ కూడా బెంగళూరుకు చేరుకొని ఇద్దరు అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చారు. అక్కడ ఓ గెస్ట్‌హౌస్‌లో ఆమెతో రాత్రంతా గడిపిన సుజోయ్ మరుసటి రోజే యువతి తండ్రికి ఫోన్ చేశాడు. రూ. 10 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో ఫోన్ నంబర్ ఆధారంగా కర్ణాటక, ఢిల్లీ పోలీసులు దర్యాప్తు నిర్వహించి ఎట్టకేలకు యువతిని కాపాడారు. కాగా సుజోయ్ 12వ తరగతి వరకు చదువుకొని, ఓ టీ షర్టులు తయారయ్యే కంపెనీలో పనిచేస్తున్నాడని, బాధితురాలు సెకండ్ ఇయర్ చదువుతోందని పోలీసులు తెలిపారు.