కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం | six dies of road accident in bagalkot | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

Published Fri, Sep 8 2017 10:33 PM | Last Updated on Tue, Nov 6 2018 4:38 PM

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - Sakshi

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

క్రూజర్‌ వాహనాన్ని ఢీకొన్న కేఎస్‌ఆర్టీసీ బస్సు
మహారాష్ట్రకు చెందిన ఆరుగురు దుర్మరణం
బాగల్‌కోట జిల్లాలో ఘటన


బనశంకరి(కర్ణాటక): కర్ణాటకలోని బాగల్‌కోట జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురిని బలిగొంది. కేఎస్‌ఆర్టీసీ బస్సు క్రూజర్‌ వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  మృతులను మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లా, దారపాళ గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వివరాలు.. దారపాళ గ్రామానికి చెందిన 12 మంది వ్యక్తులు కేన్సర్‌ ఔషధం కోసం క్రూజర్‌ వాహనంలో గురువారం సాయంత్రం శివమొగ్గకు చేరుకున్నారు. అక్కడ  ఔషధం తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. బాగల్‌కోటే జిల్లా బీళగి తాలూకా, కూర్తి క్రాస్‌ వద్ద శుక్రవారం ఉదయం విజయపుర నుంచి హుబ్లీ వెళ్తున్న కేఎస్‌ఆర్‌టీసీ బస్సు క్రూజర్‌ను  అతివేగంగా ఢీకొంది.

ప్రమాదంలో క్రూజర్‌లో ప్రయాణిస్తున్న నాగేశమాళే, పాండురంగసాళుంకె, విజయాసిందతో పాటు మరో ముగ్గురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ప్రమాద తీవ్రతకు క్రూజర్‌ వాహనం నుజ్జునుజ్జుకావడంతో కొన్ని మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి. ప్రమాదం సమయంలో భారీ శబ్ధం రాగా ఏదో జరిగిందని భావించి చుట్టుపక్క గ్రామస్తులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ నెలకొన్న భీతావహ పరిస్థితి చూసి చలించిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి  వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను అతికష్టం మీద బయటికి తీశారు. తీవ్రంగాగాయపడిన ఆరుగురితోపాటు మృతదేహాలను బీళగి ప్రభుత్వ ఆస్పత్రి కితరలించారు. కాగా ప్రమాదానికి కారణమైన బస్సులో ఉన్న కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement