రోడ్డు ప్రమాదం: బస్సును ఢీ కొట్టిన డంపర్‌ | 14 Injured After Dumper Collision Bus In Greater Noida | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం: బస్సును ఢీ కొట్టిన డంపర్‌

Published Sat, Dec 19 2020 3:08 PM | Last Updated on Sat, Dec 19 2020 4:51 PM

14 Injured After Dumper Collision Bus In Greater Noida - Sakshi

నోయిడా: గ్రేటర్‌ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జమున ఎక్స్‌ప్రెస్‌ హైవేపై డంపర్‌‌, బస్సును ఢీకొట్టడంతో 14 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు దన్‌కూర్‌ పోలీసులు తెలిపారు. కాగా ఈ బస్సులో మొత్తం 44 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమ్‌ బుద్దానగర్‌కు చెందిన డంపర్‌ నోయిడా నుంచి జేవర్‌కు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో జమున ఎక్స్‌ప్రెస్‌వేకు 13 కిమీ దూరంలో ఉండగా డంపర్‌ అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్‌ పైకి దూసుకేళ్లి అటూగా వెళుతున్న యూపీ రోడ్‌వే బస్సును ఢీకొట్టింది.

ఆ సమయంలో బస్సులో 44 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ బస్సు ఆగ్రా నుంచి వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఘటనపై దన్‌కూర్‌ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన 14 మందిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. అయితే వారిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఆయన చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement