బాణసంచా.. తేనెతుట్టెను కదిపింది! | honey bees attack.. 40 persons injured | Sakshi
Sakshi News home page

బాణసంచా.. తేనెతుట్టెను కదిపింది!

Published Sun, Jan 21 2018 7:36 PM | Last Updated on Sun, Jan 21 2018 7:36 PM

సాక్షి, మోత్కూరు: అంతిమ యాత్రలో కాల్చిన బాణసంచా వారికి ప్రాణసంకతమైంది. అంతిమయాత్ర నిర్వహించే సమయంలో తేనెటీగలు దాడి చేసి పలువురిని గాయపరిచాయి. ఈ సంఘటన యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురంలో జరిగింది. గ్రామంలో ఓ వ్యక్తి చనిపోతే ఆయన అంత్యక్రియల్లో భాగంగా బంధువులు, గ్రామస్తులు బాణసంచా కాల్చారు. బాణసంచా అక్కడి వేపచెట్టు పై ఉన్న తేనె తుట్టెకు తగిలింది. దీంతో తేనెటీగలు ఒక్కుమ్మడిగా దాడి చేయడంతో సుమారు 40మంది గాయపడ్డారు. వీరందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement