honey bees attack
-
కోనసీమ జిల్లా: అంకంపాలెంలో మహిళలపై తేనెటీగల దాడి
-
కోనసీమ జిల్లాలో మహిళలపై తేనెటీగల దాడి
సాక్షి, కోనసీమ జిల్లా: ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో తేనెటీగల దాడిలో 25 మంది గాయపడ్డారు. అందులో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం. వన భోజనాలు కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని రావులపాలెం ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. చదవండి: రూమ్‌కు తీసుకెళ్లి రోల్డ్‌గోల్డ్ ఉంగరం తొడిగి.. పెళ్లయిపోయిందని నమ్మించి.. -
మ్యాచ్ మధ్యలో గ్రౌండ్లో ఉన్న వారంతా పడుకున్నారు..
ఆంటిగ్వా: విండీస్, శ్రీలంక జట్ల మధ్య సోమవారం జరిగిన మూడో వన్డేలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో హఠాత్తుగా తేనెటీగలు రంగప్రవేశం చేయడంతో గ్రౌండ్లో ఉన్న వారంతా నేలపై బోర్లా పడుకున్నారు. ఈ సంఘటన శ్రీలంక ఇన్నింగ్స్38వ ఓవర్లో చోటు చేసుకుంది. విండీస్ బౌలర్ అండర్సన్ ఫిలిప్ బౌలింగ్ చేస్తుండగా, ఒక్కసారిగా తేనెటీగల గుంపు మైదానాన్ని చుట్టుముట్టింది. ఇది గమనించిన ఆటగాళ్లు, అంపైర్లు వాటి నుంచి రక్షణ కోసం ఫీల్డ్‌పై పడుకున్నారు. కాసేపటికి తేనెటీగల గుంపు ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా వెళ్లిపోవడంతో గ్రౌండ్లో ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. అనుకోని ఈ పరిణామానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. Bee 🐝 attack in #WIvSri#INDvENGt20 #Cricket pic.twitter.com/KgA5as5myR — Cricket Scorecards (@MittiDaPutla) March 14, 2021 కాగా, మ్యాచ్ మధ్యలో తేనెటీగలు అంతరాయం కలిగించడం ఇదే తొలిసారేమీ కాదు. 2019 ప్రపంచకప్సందర్భంగా దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా శ్రీలంక, విండీస్ జట్ల మధ్య తాజాగా జరిగిన ఈ వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య విండీస్ జట్టు 5 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. -
తేనెటీగల దాడిలో శ్రీశైలం డీఈ మృతి
సాక్షి, కర్నూలు: శ్రీశైలం రిజర్వాయర్ వద్ద మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. తేనెటీగల దాడిలో శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ కెనాల్ డివిజనల్ ఇంజనీర్ భానుప్రకాశ్ మృతి చెందారు. కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్ వద్ద విధుల్లో ఉండగా ఆయనపై ఒక్కసారిగా తేనెటీగల గుంపు దాడి చేసింది. పెద్ద ఎత్తున తేనెటీగలు దాడి చేయడంతో భానుప్రకాశ్ ప్రాణాలు విడిచారు. ఇదిలాఉండగా.. గత నెలలో శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో 9 మంది ఉద్యోగులు మరణించిన సంగతి తెలిసిందే. (చదవండి: విషాదం: లోపలున్న 9 మందీ మృతి) -
శవయాత్రలో విషాదం..!
సాక్షి, కరీంనగర్ : జిల్లాలోని గంగాధర మండలం గర్శకుర్తిలో బుధవారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మరణించడంతో శవయాత్ర చేస్తున్న బంధువులు, గ్రామ ప్రజలపై తేనెటీగలు మూకుమ్మడి దాడి చేశాయి. దీంతో శవాన్ని వదిలేసి జనం పరుగులు తీశారు. అయితే, తేనెటీగలు పెద్ద ఎత్తున కుట్టడంతో లచ్చయ్య అనే వృద్ధుడు ప్రాణాలు విడిచాడు. 35 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బాధితులు కరీంగనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ముసుగు తీస్తే.. ముట్టడే
విశాఖపట్నం, పెదబయలు(అరకులోయ): ఒళ్లంతా రగ్గుకప్పుకుని పెట్రోల్ పోస్తున్నది చలికి వణికిపోతూ కాదు..ముఖానికి గుడ్డలు కట్టుకుని వచ్చి బంకులో పెట్రోల్ పోయించుకుంటున్నదీ చెవులకు చలిగాలి సోకుతుందనీ కాదు.. పరిసరాల్లోని చెట్లకు ఉన్న తుట్టెల నుంచి తేనెటీగలు దాడి చేస్తాయన్న భయంతోనే..పెదబయలులోని జీసీసీ పెట్రోల్ బంక్ వద్ద ఈ దుస్థితి నెలకొంది. రోజుల తరబడి ఇదే దుస్థితి కొనసాగుతోంది. జీసీసీ, ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈ పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నారు. వాహనాల్లోకి పెట్రలో పోస్తున్నప్పుడల్లా ఆ వాసనకు తేనెటీగలు చెలరేగిపోతున్నాయి. వడగాడ్పులకు దూసుకొస్తున్నాయి. బంకు సిబ్బంది, వినియోగదారులపై దాడి చేస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇదే దుస్థితి అని, ఇప్పటికి పది పదిహేనుసార్లు వాటి దాడికి గురయ్యామని సిబ్బంది చెబుతున్నారు. ప్రారంభంలో అటవీశాఖ, జీసీసీ అధికారులకు వివరించామని, నెలన్నరగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా..ఎవ్వరూ పట్టించుకోలేదని అంటున్నారు. చెట్లకు ఉన్న తేనె తుట్టెలను తీయించే ప్రయత్నం చేయలేదంటున్నారు. రోజూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నామంటున్నారు. తేనెటీగల దాడికి గురికాకుండా ప్రత్యేకంగా దుస్తులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే విధులు బహిష్కరిస్తామని పేర్కొంటున్నారు. -
తేనెటీగల దాడిలో మాజీ సర్పంచ్ మృతి
జయపురం: నవరంగ్‌పూర్ జిల్లాలోని చందా హండి సమితి పాటఖలియ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పురుషోత్తమ పూజారి(56) తేనెటీగలు దాడి చేయడంతో మృతి చెందారు. తేనెటీగల దాడిలో మరో మగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పటఖలియ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పురుషోత్తమ పూజారి తన పొలంలో పని చేసేందుకు గ్రామానికి చెందిన రాధే గొహిరో, అఖిల పోర్టి, భరత్ పూజారిలను తోడ్కొని వెళ్తుం డగా ఆ ప్రాంతంలో చెట్టుకు ఉన్న తేనె పట్టునుంచి దాదాపు 50 తేనె టీగలు ఒకేసారి వారిని చుట్టుముట్టి దాడి చేశాయి. అవి తీవ్రంగా దాడి చేయడంతో ప్రాణ భయంతో వాటి నుంచి తప్పించుకునేందుకు రధే గొహిరొ, అఖిల పోర్ట్ భరత్ పూజారిలు గ్రామంలోకి పరుగులు తీయగా తేనెటీగలు వారిని వెంటాడి తరిమాయి. అయితే పురుషోత్తమ పూజారి పరుగెత్తలేక కింద పడిపోయాడు. దీంతో అన్ని తేనెటీగలు అతనిపై మూకుమ్మడిగా దాడిచేశాయి. గ్రామానికి పారి పోయిన మిగిలిన ముగ్గురు ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలపగా వెంటనే పురుషోత్తమ పూజారి కుమారుడు, గ్రామ సర్పంచ్ హర పూజారి వెంటనే చందాహండి అగ్ని మాపక విభాగానికి ఫోన్లో తెలియజేయడంతో అగ్నిమాపక సిబ్బంది తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడిన పురుషోత్తమ పూజారిని కాపాడి చందా హండి సామాజిక వైద్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పురుషోత్తమ పూజారి మరణించాడు. గాయపడిన మిగిలిన ముగ్గురు వైద్యకేంద్రంలో చికిత్స పొందుతున్నారు. పలువురి సంతాపం ఈ విషయం తెలిసిన పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు, ప్రజలు ఆశ్చర్యపోయారు. పురుషోత్తమ్ పూజారి మరణానికి మంత్రి రమేష్ మఝి, పార్లమెంట్‌సభ్యుడు బలభద్ర మఝి, మాజీ ఎంపీ ప్రదీప్ మఝి, నవరంగ్‌పూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గోవింద జైన్ తదితరులు విచారం వ్యక్తం చేసి ప్రగాఢ సంతాపం తెలిపారు. -
బాణసంచా.. తేనెతుట్టెను కదిపింది!
సాక్షి, మోత్కూరు: అంతిమ యాత్రలో కాల్చిన బాణసంచా వారికి ప్రాణసంకతమైంది. అంతిమయాత్ర నిర్వహించే సమయంలో తేనెటీగలు దాడి చేసి పలువురిని గాయపరిచాయి. ఈ సంఘటన యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురంలో జరిగింది. గ్రామంలో ఓ వ్యక్తి చనిపోతే ఆయన అంత్యక్రియల్లో భాగంగా బంధువులు, గ్రామస్తులు బాణసంచా కాల్చారు. బాణసంచా అక్కడి వేపచెట్టు పై ఉన్న తేనె తుట్టెకు తగిలింది. దీంతో తేనెటీగలు ఒక్కుమ్మడిగా దాడి చేయడంతో సుమారు 40మంది గాయపడ్డారు. వీరందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. -
తేనేటీగల దాడి: ఒకరి మృతి
సాక్షి, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అశ్వరావుపేట వద్ద పామాయిల్ తోటలో కూలీలపై తేనేటీగలు దాడి చేశాయి. తేనేటీగల దాడిలో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తేనేటీగల దాడిలో కూలీ మృతిచెందడంతో అతని స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
తేనెటీగల దాడి: ఇద్దరికి తీవ్ర గాయాలు
కురవి: తేనెటీగల దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో సోమవారం వెలుగుచూసింది. స్థానిక మామిడి తోటలో కాయలు కోయడానికి వచ్చిన కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది. -
అటవీ సిబ్బందిపై తేనెటీగల దాడి
నిర్మల్: హైదరాబాద్ దూలపల్లి అటవీశాఖ సిబ్బందిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన నిర్మల్ జిల్లాలోని కడెం మండలం లక్ష్మీపూర్ అటవీప్రాంతంలో చోటుచేసుకుంది. శిక్షణలో ఉన్న 60 మంది బృందంపై తేనెటీగలు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో ఆరుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. 54మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారందరినీ చికిత్స నిమిత్తం నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. -
తేనెటీగల దాడిలో 26 మందికి గాయాలు
నెల్లూరు (తడ) : నెల్లూరు జిల్లా తడ మండలం మాంబట్టు సెజ్‌లోని అపాచీ కంపెనీ ఉద్యోగులపై సోమవారం మధ్యాహ్నం సమయంలో తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 26 మంది ఉద్యోగులు గాయపడ్డారు. గాయపడిన వారిని సూళ్లూరుపేట గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. -
భక్తులపై తేనెటీలు దాడి,ఒకరు మృతి
-
భక్తులపై తేనెటీలు దాడి: ఒకరు మృతి
కడప: వైఎస్ఆర్ కడప జిల్లా సీకే దిన్నె మండలంలోని బుగ్గా వెంకన్న ప్రాజెక్ట్ సమీపంలో మంగళవారం తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.... క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మల్లేశ్వరస్వామి దర్శనం కోసం వెళ్తున్న తమపై తేనెటీగలు దాడి చేశాయని క్షతగాత్రులు తెలిపారు. -
తేనెటీగల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వృద్ధుడు మృతి
గుంటూరు: మాచర్ల మండలం అలగరాజుపల్లిలో తేనెటీగల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఒక వృద్ధుడు నీళ్లట్యాంకులోకి దిగి ఊపిరాడక మృతిచెందాడు. వివరాలు..కృష్ణయ్య అనే వృద్ధుడు తేనెటీగల బారినుంచి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో వాటర్ ట్యాంక్ లోకి దిగాడు. నీళ్లు ఎక్కువగా ఉండటంతో ఊపిరాడక మృతిచెందాడు. -
అనంత జన్మభూమిలో తేనెటీగల దాడి
జన్మభూమి-మాఊరు కార్యక్రమం కాస్తా అనంతపురం జిల్లాలో రసాభాసగా మిగిలింది. మడకశిర మండలం గుండుముల గ్రామంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో అనుకోని అతిథులుగా.. తేనెటీగలు వచ్చిపడ్డాయి. మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యేలు పార్థసారథి, ఈరన్న, ఎమ్మెల్సీ తిప్పేస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే కార్యక్రమం ఇంకా పూర్తి కాకముందే ఉన్నట్టుండి తేనెటీగలు వచ్చి మీదపడ్డాయి. దాంతో జనం కాస్తా ఒక్కసారిగా అక్కడినుంచి పరుగులు తీశారు. ఎవరో తేనెపట్టు మీద రాయి వేసి ఉంటారని, అందుకే తేనెటీగలు ముసిరాయని అంటున్నారు. మొత్తానికి అనుకోని అతిథుల కారణంగా జన్మభూమి కార్యక్రమం మాత్రం సగంలోనే ఆగిపోయింది. -
శవాన్ని వదిలి పరిగెత్తారు
కరీంనగర్: తేనెటీగలు తరచూ మనుషులపై దాడి చేసి తమ సత్తా చూపుతున్నాయి. అవి ఊరకనే ఎందుకు దాడి చేస్తాయి? వాటిని కదిలిస్తేనో, వాటికి ఇబ్బంది కలిగిస్తేనో దాడి చేస్తుంటాయి. తేనెటీగల దాడి వల్ల కొన్ని సందర్భాలలో ఆస్పత్రిపాలుకావలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఈ రోజు బోయిన్పల్లి మండలంలో శవాన్ని శ్మశానానికి తీసుకువెళుతున్నవారిపై తేనెటీగలు దాడి చేయడంతో వారు శవాన్ని అక్కడే వదిలి దౌడు తీశారు. విలాసాగర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. శవయాత్ర నిర్వహిస్తున్న వారిపై అవి దాడి చేయడంతో జనం ఒక్కసారిగా తోచుకుంటూ పరుగులు తీశారు. ఆ తోపులాటలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. శవయాత్ర సందర్భంగా సాంబ్రాణి కడ్డీలు వెలిగించారు. ఆ కడ్డీల నుంచి వచ్చిన పొగ సమీపంలో ఉన్న తేనె తుట్టిపై సోకడంతో అవి దాడి చేసినట్లు భావిస్తున్నారు. గత నెలలో వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరు మండలం చింతకుంట గ్రామ సమీపంలో ఆదిమానవులు గీచిన చిత్రాలు చూసేందుకు వెళ్లిన విద్యార్థులు, ఉపాధ్యాయులపైన తేనెటీగలు దాడి చేయడంతో 24 మంది ఆస్పత్రి పాలయ్యారు. తేనెతుట్టెపై కొందరు విద్యార్థులు సరదాగా రాళ్లు విసరడంతో అవి ఒక్కసారిగా వారిపై దాడి చేశాయి. ఇష్టమొచ్చినట్లు విద్యార్థులను, ఉపాధ్యాయులను కుట్టివదిలిపెట్టాయి. వారికి ముద్దనూరు, జమ్మలమడుతు ఆస్పత్రులలో చికిత్స చేశారు. అందు వల్ల తేనెటీగల విషయంలో జాగ్రత్తగా ఉండాలి సుమా!