
మాజీ సర్పంచ్ పురుషోత్తమ పూజారి
జయపురం: నవరంగ్‌పూర్ జిల్లాలోని చందా హండి సమితి పాటఖలియ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పురుషోత్తమ పూజారి(56) తేనెటీగలు దాడి చేయడంతో మృతి చెందారు. తేనెటీగల దాడిలో మరో మగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పటఖలియ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పురుషోత్తమ పూజారి తన పొలంలో పని చేసేందుకు గ్రామానికి చెందిన రాధే గొహిరో, అఖిల పోర్టి, భరత్ పూజారిలను తోడ్కొని వెళ్తుం డగా ఆ ప్రాంతంలో చెట్టుకు ఉన్న తేనె పట్టునుంచి దాదాపు 50 తేనె టీగలు ఒకేసారి వారిని చుట్టుముట్టి దాడి చేశాయి.
అవి తీవ్రంగా దాడి చేయడంతో ప్రాణ భయంతో వాటి నుంచి తప్పించుకునేందుకు రధే గొహిరొ, అఖిల పోర్ట్ భరత్ పూజారిలు గ్రామంలోకి పరుగులు తీయగా తేనెటీగలు వారిని వెంటాడి తరిమాయి. అయితే పురుషోత్తమ పూజారి పరుగెత్తలేక కింద పడిపోయాడు. దీంతో అన్ని తేనెటీగలు అతనిపై మూకుమ్మడిగా దాడిచేశాయి.
గ్రామానికి పారి పోయిన మిగిలిన ముగ్గురు ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలపగా వెంటనే పురుషోత్తమ పూజారి కుమారుడు, గ్రామ సర్పంచ్ హర పూజారి వెంటనే చందాహండి అగ్ని మాపక విభాగానికి ఫోన్‌లో తెలియజేయడంతో అగ్నిమాపక సిబ్బంది తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడిన పురుషోత్తమ పూజారిని కాపాడి చందా హండి సామాజిక వైద్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పురుషోత్తమ పూజారి మరణించాడు. గాయపడిన మిగిలిన ముగ్గురు వైద్యకేంద్రంలో చికిత్స పొందుతున్నారు.
పలువురి సంతాపం
ఈ విషయం తెలిసిన పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు, ప్రజలు ఆశ్చర్యపోయారు. పురుషోత్తమ్ పూజారి మరణానికి మంత్రి రమేష్ మఝి, పార్లమెంట్‌సభ్యుడు బలభద్ర మఝి, మాజీ ఎంపీ ప్రదీప్ మఝి, నవరంగ్‌పూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గోవింద జైన్ తదితరులు విచారం వ్యక్తం చేసి ప్రగాఢ సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment