తేనెటీగల దాడి: ఇద్దరికి తీవ్ర గాయాలు
Published Mon, May 8 2017 1:06 PM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM
కురవి: తేనెటీగల దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో సోమవారం వెలుగుచూసింది. స్థానిక మామిడి తోటలో కాయలు కోయడానికి వచ్చిన కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది.
Advertisement
Advertisement