కడప: వైఎస్ఆర్ కడప జిల్లా సీకే దిన్నె మండలంలోని బుగ్గా వెంకన్న ప్రాజెక్ట్ సమీపంలో మంగళవారం తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.... క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మల్లేశ్వరస్వామి దర్శనం కోసం వెళ్తున్న తమపై తేనెటీగలు దాడి చేశాయని క్షతగాత్రులు తెలిపారు.