
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం విషాదం చోటు చేసుకుంది.
సాక్షి, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అశ్వరావుపేట వద్ద పామాయిల్ తోటలో కూలీలపై తేనేటీగలు దాడి చేశాయి. తేనేటీగల దాడిలో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తేనేటీగల దాడిలో కూలీ మృతిచెందడంతో అతని స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.