కడప: వైఎస్ఆర్ కడప జిల్లా నందలూరు సమీపంలో ఆల్విన్ ఫ్యాక్టరీ వద్ద ఆగి ఉన్న లారీని ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కె.శ్రీనివాస్ (46) అక్కడికక్కడే మరణించారు. కారులో ప్రయాణిస్తున్న సతీష్, వెంకటేశ్, శ్రీనివాస్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కె.శ్రీనివాస్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం కడప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.