Mothkur
-
బతికుండగానే తల్లిని సమాధి చేస్తానంటూ..
మోత్కూరు: వృద్ధాప్యంలో తనకు జీవనభృతి ఇవ్వాలన్న తల్లిని బతికుండగానే బొంద పెడతానంటూ ఓ కొడుకు గొయ్యి తవ్విన దారుణ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. మోత్కూరు మండలం అనాజిపురం గ్రామానికి చెందిన బుచ్చిమల్లయ్య, సాలమ్మ, దంపతులకు ముగ్గురు కుమారులు నర్సింహ, ఐలయ్య, వెంకటయ్యతోపాటు నలుగురు కూతుళ్లు ఉన్నారు. అందరి పెళ్లిళ్లు అయ్యాయి. 20 ఏళ్ల క్రితం బుచ్చిమల్లయ్య మృతి చెందాడు. ముగ్గురు కుమారులు కలిపి నెలకు రూ.600 చొప్పున ఆరు నెలలకోసారి 3,600 రూపాయలను జీవనభృతి కింద తల్లికి ఇస్తున్నారు. చిన్నకుమారుడు వెంకటయ్య నాలుగైదేళ్లుగా తన వాటా డబ్బులు ఇవ్వకపోవడంతో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బతికుండగానే తల్లిని సమాధి చేస్తానంటూ గత నెల 16న వెంకటయ్య తన భార్యతో కలసి పొలం వద్ద ఉన్న తండ్రి సమాధి పక్కనే బొంద తీశాడు. ఈ విషయమై గ్రామపెద్దలు వెంకటయ్యను తీవ్రంగా మందలించడంతో బొందను పూడ్చివేశాడు. జీవనభృతి ఇవ్వడంలేదని వెంకటయ్యపై తల్లి గత నెల 30న యాదాద్రి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. -
లంచాలివ్వలేం.. తాళిబొట్లు తీసుకోండి
మోత్కూరు: ‘మీకు లంచాలిచ్చేందుకు మా దగ్గర పైసల్లేవు. బండలు కొట్టి బతుకుతున్నం. మా తాళిబొట్లు, చెవికమ్మలు అన్నీ తీసుకొని మా భూమి మాకు ఇప్పించండి’ అంటూ పలువురు బాధితులు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు తహసీల్దార్ కార్యాలయం ముందు గురువారం ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం వారికి కేటాయించిన ఇళ్లస్థలాలను అక్రమార్కుల చెర నుంచి విడిపించి అప్పగించాలంటూ రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఇలా వినూత్న రీతిలో నిరసనకు దిగారు. విసిగిపోయి చివరికిలా...: 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వం మోత్కూరు వడ్డెర కాలనీలోనిసర్వే నెంబర్ 610లో 3.39 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయించి కొన్ని ఇళ్లు నిర్మించింది. ప్రస్తుతం ఆ కాలనీ 2.39 ఎకరాలకు విస్తరించింది. మిగిలిన ఎకరం స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. ఈ నేపథ్యంలో ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని తమ స్థలాన్ని తమకు అప్పగించాలని కోరుతూ పలుమార్లు బాధితులు రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి తమ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎంతగా పోరాడినా ఫలితం లేకపోవడంతో విసిగిపోయారు. దీంతో గురువారం వారంతా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. తహశీల్దార్ షేక్ అహ్మద్‌ను, ఇతర సిబ్బందిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్వేగానికి గురైన మహిళలు.. లంచాలు ఇవ్వడానికి తమ దగ్గర డబ్బుల్లేవంటూ మెడలో ఉన్న తాళిబొట్లు, చెవికమ్మలు తీసి ఇవ్వగా, పురుషులు తమ ఉంగరాలు, వాచీలు, సెల్ఫోన్లు తీసి ఓ టవల్లో వేశారు. అవన్నీ తీసుకుని తమ భూమి తమకు ఇప్పించాలని తహశీల్దార్‌ను వేడుకున్నారు. సమస్య పరిష్కరిస్తానని, ఆందోళన విరమించాలని తహసీల్దార్ హామీ ఇచ్చినప్పటికీ.. వెంటనే పరిష్కరిస్తేనే ఆందోళన విరమిస్తామంటూ వారు భీష్మించుకుని కూర్చున్నారు. 10 గుంటల్లో అక్రమ నిర్మాణాలు... కాలనీవాసుల ఆందోళనతో ఎట్టకేలకు స్పందించిన తహసీల్దార్ షేక్ అహ్మద్.. సర్వేయర్ శ్రీనివాస్‌రాజు, ఆర్ఐ నజీర్, వీఆర్వోలతో కలిసి ఆ కాలనీకి వెళ్లారు. ఆక్రమించిన స్థలాన్ని పరిశీలించి సర్వే చేయించారు. మొత్తం 3.39 ఎకరాల భూమిలో 2.39 ఎకరాల్లో కాలనీవాసులు ఇళ్లు నిర్మించుకున్నారని, ఆక్రమణకు గురైన ఎకరం భూమిలో పది గుంటలు రోడ్డులో పోగా 30 గుంటల భూమి మిగిలి ఉందని నిర్ధారించారు. అందులో 10 గుంటల స్థలంలో ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారని తహశీల్దార్ తెలిపారు. ఆక్రమణదారులకు ఇదివరకే ఒకసారి నోటీసులు ఇచ్చామని, ఇప్పుడు మరోసారి నోటీసులు ఇచ్చి నిర్మాణాలు తొలగించి కాలనీవాసులు అప్పగిస్తామని చెప్పారు. దీంతో కాలనీవాసులు ఆందోళన విరమించారు. -
ఓడిన సర్పంచ్‌లు, సర్పంచ్ల భర్తలు
సాక్షి, చౌటుప్పల్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకులు సైతం ఓటమి పాలయ్యారు. నామమాత్రపు రాజకీయ అనుభవం ఉన్న అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. మున్సిపాలిటీ ఏర్పాటుకు ముందు చౌటుప్పల్, తంగడపల్లి, లింగోజిగూడెం, లక్కారం, గ్రామాలకు సర్పంచ్‌లుగా, సర్పంచ్ల భర్తలుగా రాజకీయ తిప్పిన వ్యక్తులు సైతం ఓడిపోవాల్సి వచ్చింది. చౌటుప్పల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పని చేసిన బొంగు లావణ్య భర్త మాజీ వైస్ ఎంపీపీ బొంగు జంగయ్య(టీఆర్ఎస్) 19వ వార్డు నుంచి, లింగోజిగూడెం తాజా మాజీ సర్పంచ్ రమనగోని దీపిక భర్త అదే గ్రామ మాజీ సర్పంచ్ రమనగోని శంకర్(బీజేపీ), తంగడపల్లి తాజా మాజీ సర్పంచ్ ముటుకుల్లోజు దయాకరాచారి(టీఆర్ఎస్), లక్కారం తాజా మాజీ సర్పంచ్ కానుగు యాదమ్మ భర్త కానుగు బాలరాజు(టీఆర్ఎస్), లింగోజిగూడెం మాజీ సర్పంచ్ ఊదరి నర్సింహ్మ(టీఆర్ఎస్) పరాజయం పాలయ్యారు. ఎన్నికల ప్రచార సమయంలోనే కాకుండా ఎంతో కాలంగా వీరు గెలుస్తారన్న ప్రచారం ఉన్నప్పటికీ అనూహ్య పరిణామాల కారణంగా ఓడిపోయారు. విశేష రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఓటరు తీర్పును అంగీకరించాల్సి వచ్చింది. మోత్కూరు: మోత్కూరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయి బొల్లెపల్లి వెంకటయ్య నూతనంగా ఏర్పడిన మోత్కూరు మున్సిపాలిటీలో అదే పార్టీనుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసిన గెలుపొందాడు. 8వ వార్డునుంచి అవిశెట్టి అవిలిమల్లు (కాంగ్రెస్)పై వెంకటయ్య 39 ఓట్లతో విజయం సాధించారు. ఈసారి సానుభూతి ఆయనకు కలిసొచ్చిందంటున్నారు. నాడు ఎంపీటీసీగా ఓడి.. మండల పరిషత్ ఎన్నికల్లో మోత్కూరు –2 ఎంపీటీసీ సభ్యుడిగా పోటీ చేసిన గుర్రం కవిత ఓటమి పాలయ్యారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి పసల విజ యపై 19 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ కవితను ప్రకటించగా ఫలితాల్లో టీఆర్ఎస్ అధిక స్థానాలు గెలువడంతో కవిత కౌన్సిలర్‌గా గెలిచినా ఫలితం లేకుండా పోయింది. నాడు వార్డు మెంబర్‌గా.. నేడు కౌన్సిలర్‌గా విజయం మోత్కూరు గ్రామ పంచాయతీ 1వ వార్డు సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహించి నేడు మున్సిపల్ ఎన్నికల్లో 2వ వార్డు కౌన్సిలర్‌గా కారుపోతుల శిరీష (కాంగ్రెస్) గెలుపొందారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో కూడా విజయం సాధించడంతో ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. అన్న గెలుపు.. తమ్ముళ్ల ఓటమి చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కౌన్సిలర్లుగా పోటీ చేశారు. వారిలో ఇద్దరు ఓటమి పాలవ్వగా ఒకరు విజయం సాధించారు. పట్టణ కేంద్రానికి చెందిన సీపీఎం పట్టణ మాజీ కార్యదర్శి బత్తుల శ్రీశైలం అదే పార్టీ నుంచి 19వ వార్డులో పోటీ చేశాడు. తన బాబాయి కుమారులైన బత్తుల వెంకటేశం బీజేపీ తరఫున 20వవార్డు, విప్లవ్‌కుమార్ 16వ వార్డులో సీపీఎం తరుఫున పోటీ చేశారు. కానీ శ్రీశైలం 19వవార్డులో బీజేపీపై విజయం సాధించగా, వెంకటేశం, విప్లవ్‌కుమార్ టీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. చండూరు: చండూరు మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో మాజీ ఎంపీపీ తొకల వెంకన్నతో పాటు అతని భార్య చంద్రకళ కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచారు. వెంకన్న 8వ వార్డు నుంచి బరిలో నిలవగా అయనపై టీఆర్ఎస్ అభ్యర్థి బూతరాజు దశరథ పోటీ చేశారు. దశరథపై తోకల వెంకన్న 49 ఓట్ల తేడాతో గెలుపొందాడు. అలాగే అతని భార్య చంద్రకళ 10వ వార్డు నుంచి బరిలో నిలువగా ఆమెపై టీఆర్ఎస్ అభ్యర్థి తేలుకుంట్ల రాజకుమారి పోటీ చేసింది. రాజకుమారిపై చంద్రకళ 240 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఓడిన దంపతులు 1వ వార్డునుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కోడి గిరిబాబు బరిలో నిలిచాడు. టీఆర్ఎస్నుంచి పోటీ చేసిన తన సోదరుడు కోడి వెంకన్నపై గిరిబాబు 223 ఓట్లతో ఓటమిపాలయ్యాడు. అదే విధంగా తన భార్యను చైర్మన్ చేయాలని కోడి గిరిబాబు 7వ వార్డునుంచి భార్య విజయలక్షి్మని కాంగ్రెస్ తరఫున పోటీలో నిలిపాడు. కాగా టీఆర్ఎస్ అభ్యర్థి చిలుకూరి రాధికపై విజయలక్ష్మి 148 ఓట్లతో పరాజయం పాలైంది. ఓడిన తాజా మాజీ కౌన్సిలర్లు, చైర్మన్లు భువనగిరి : గత మున్సిపాలిటీ కాలంలో కౌన్సిలర్లుగా పనిచేసి తిరిగి ఈ నెల 22న జరిగిన ఎన్నికల బరిలో నిలిచి కొందరు ఓటమి పాలయ్యారు. ఇందులో 6వ వార్డు నుంచి కుక్కదూవు లతశ్రీ, 10వ వార్డు నుంచి బట్టుపల్లి అనురాధ, ఇదే వార్డు నుంచి పడమటి జగన్మోహన్రెడ్డి, 20వ వార్డు నుంచి చిట్టిప్రోలు సువర్ణ, 21వ వార్డు నుంచి ఫతే మహ్మద్, 30వ వార్డు నుంచి లయిఖ్ అహ్మద్, ఇదే వార్డు నుంచి షఫిక్ అహ్మద్ ఉన్నారు. ఓడిన మాజీ చైర్మన్లు వివిధ పాలకవర్గాల్లో చైర్మన్లుగా ఎన్నికై ప్రస్తుతం కౌన్సిర్లుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇందులో 35వ వార్డు నుంచి నువ్వుల ప్రసన్న, 8వ వార్డునుంచి బర్రె జహంగీర్, 25వ వార్డునుంచి కొల్పుల కమలాకర్, 28వ వార్డు నుంచి సుర్వి లావణ్య, 9వ వార్డు నుంచి దోనకొండ వనిత ఉన్నారు. -
గుంటూరు జిల్లా మోతుకూరులో దారుణం
-
అంతా అస్తవ్యస్తం..!
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మినీ ట్యాంక్బండ్ల పనులు అస్తవ్యస్తంగా మారాయి. సకాలంలో పనులు పూర్తికాకపోగా.. నాసిరకంగా ఉంటున్నాయి. అందుకు మోత్కూరు పెద్ద చెరువు పనులే నిదర్శనం. చెరువుకట్ట, రివిట్మెంట్ అస్తవ్యస్తంగా ఉండి కాంట్రాక్టర్ అలసత్వాన్ని, అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. మరో వైపు మెట్‌చిప్స్, విద్యుత్ స్తంభాలు ఆగమాగంగా ఉన్నాయి. మే 31తో కాంట్రాక్ట్ గడువు ముగిసినా పనులు పూర్తికాకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. మోత్కూరు : ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.అందులో భాగంగా జిల్లాలోని మోత్కూరు చెరువును కూడా అధికారులు ఎంపిక చేశారు. మిషన్ కాకతీయ రెండో దశలో ప్రభుత్వం రూ.6.83కోట్ల నిధులు మంజూరు చేసింది. 2017 మే16వ తేదీన రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు విద్యుత్‌శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి పనులకు శంకుస్థాపన చేశారు. 2016 జూలై 26న అగ్రిమెంట్ చేసుకున్న కాంట్రాక్టర్.. మే 31వ తేదీ నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ, గడువు ముగిసినా పూర్తి కాలేదు. చేపట్టిన పనులు కూడా అస్తవ్యస్తంగా, నాణ్యత లోపించి ఉన్నాయి. చేపట్టాల్సిన పనులు ఏమంటే.. పాత చెరువుకట్ట వెడల్పు 5 మీటర్లు ఉండగా 12 మీటర్లకు పెంచాలి. కట్ట ప్ర«ధాన రహదారి కావడంతో బీటీ రోడ్డు వేసి ఇరువైపులా విద్యుత్ లైటింగ్, రేలింగ్ ఏర్పాటు చేయాలి. చెరువు కట్టకు లోపలి భాగంలో రాతి కట్ట (రివిట్మెంట్)నిర్మించాలి. పార్క్, వాకింగ్ ట్రాక్, మూడు విజిట్ వ్యూ పాయింట్లు, మూడు బతుకమ్మ గాట్లు ఏర్పాటు చేయాలి. బృందావన్ కాల్వ ఫీడర్‌చానల్ అలుగు వద్ద సీసీ, బ్రిడ్జి, ఎఫ్టీఎల్ లెవల్ చెరువు చుట్టూ ఆరు మీటర్ల వెడల్పుతో కట్ట పోయాల్సి ఉంది. కట్టకు ఉత్తరం వైపున ఉన్న వ్యవసాయ బావికి రివైండింగ్ వాల్ (సీసీ రోడ్డు) ఏర్పాటు చేయాలి. పాటించని ప్రమాణాలు.. ఆగమాగంగా పనులు! గడువులోగా పూర్తి చేయాల్సిన పనులు ఆగుతూ సా..గుతూ నడుస్తున్నాయి. పైగా నాసిరకంగా ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతుండడం.. పనులు జరిగిన తీరు చూస్తుంటే తేటతెల్లమవుతోంది. రివిట్మెంట్ చేసే కట్టలోపలి భాగంతోపాటు కట్ట రహదారి విస్తరణకు చెరువు మట్టినే వినియోగించారు. అంతేకాకుండా కట్టపై బీటీ రోడ్డు పనులు అధ్వానంగా ఉన్నాయి. వాటర్ క్యూరింగ్‌తో రోలింగ్ చేయించకపోవడంతో అప్పుడే రోడ్డుపై కంకరలేచింది. అదే విధంగా మెట్ చిఫ్స్ అస్తవ్యస్తంగా వేశారు. ఓ వైపు మెటల్ చిప్స్ వేసి మరోవైపు వేయకపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పాపతకట్టపై అంతరాయంగా ఉన్న కరెంట్ స్తంభాలను తొలగించలేదు. ప్రస్తుతం స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా ఉన్నాయి. 10 కరెంట్ స్తంభాలు వృథాగా ఉన్నాయి. గతంలో చెరువుకట్టపై ఉన్న ప్రధాన రహదారిపై అలుగునీరు ప్రవహిస్తూ ఉండేది. అక్కడ సిమెంట్ గూనలు వేసి తాత్కాలికంగా మరమతులు వేశారు. అలుగు సమీపంలో రహదారిపై బ్రిడ్జి నిర్మాంచాల్సి ఉండగా ఆర్అండ్బీ ఇరిగేషన్ శాఖల సమన్వయ లోపంతో ఇప్పటి వరకు బ్రిడ్జి పనులకు నోచుకోవడం లేదు. అసలు బ్రిడ్జి నిర్మిస్తారా లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.10 కోట్లకు పెంచి నిధులు ఇదిలా ఉండగా మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.6.83కోట్లు మంజూరు చేసింది. కాగా అధనంగా నిధులు కావాలని స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ పనుల శంకుస్థాపనకు వచ్చిన మంత్రి హరీశ్‌రావును కోరారు. అందుకు మంత్రి స్పందిస్తూ నిధులు పెంచుతున్నట్లు వేదికపై ప్రకటించారు. -
బాణసంచా.. తేనెతుట్టెను కదిపింది!
సాక్షి, మోత్కూరు: అంతిమ యాత్రలో కాల్చిన బాణసంచా వారికి ప్రాణసంకతమైంది. అంతిమయాత్ర నిర్వహించే సమయంలో తేనెటీగలు దాడి చేసి పలువురిని గాయపరిచాయి. ఈ సంఘటన యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురంలో జరిగింది. గ్రామంలో ఓ వ్యక్తి చనిపోతే ఆయన అంత్యక్రియల్లో భాగంగా బంధువులు, గ్రామస్తులు బాణసంచా కాల్చారు. బాణసంచా అక్కడి వేపచెట్టు పై ఉన్న తేనె తుట్టెకు తగిలింది. దీంతో తేనెటీగలు ఒక్కుమ్మడిగా దాడి చేయడంతో సుమారు 40మంది గాయపడ్డారు. వీరందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. -
ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధంకావాలి
మోత్కూరు/యాదగిరిగుట్ట : కాలు పట్టుకునే సంస్కృతి కాకుండా మాదిగ యువతీ, యువకులు, విద్యార్థులు ఆత్మగౌరవ పోరాటం చేయడానికి సిద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి పిలుపు ఇచ్చారు. ఆదివారం మోత్కూరు రహదారి బంగ్లాలో, యాదగిరిగుట్టలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 22 సంవత్సరాల మాదిగ ఉద్యమంలో మందకృష్ణ మాదిగ జాతి కాలు మొక్కే సంస్కృతిని ఇచ్చాడని ప్రపంచంలో ఏసామాజిక హక్కులు, ఉద్యమాలు కాళ్లు పట్టుకుంటే రాలేదని కాలర్ పట్టుకుంటేనే సాధించారని అన్నారు. 27 జిల్లా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కమిటీల ఏర్పాటు అనంతరం అక్టోబర్‌లో అలాయ్‌బలాయ్ కార్యక్రమాన్ని నవంబర్‌లో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. వచ్చే పార్లమెంట్ సమావేశంలో ఏబీసీడీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం చేసినా.. కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందన్నారు. సకల జనులకు జేఏసీగా ఉన్న కోదండరాం ఏ కులానికి మద్దతు ప్రకటించకుండా మోసం చేశారని ఆరోపించారు. ప్రాజెక్టులతో ప్రజలు నష్టపోతున్నారని అంటున్న కోదండరాంను ఏ కులం న్యాయం కోసం పోరాడుతున్నావు అని ఆయన ప్రశ్నించారు. వర్గీకరణ అయినా తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా కలిసి నూతన ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ కింద ఇప్పటి వరకు 4,500మందికి రూ.45కోట్లు సంక్షేమ ఫలాలు అందాయని, ఇంకా 20వేల మందికి త్వరలోనే వస్తాయన్నారు. జిల్లా జేఏసీ అధ్యక్షుడి ఎన్నిక నూతన యాదాద్రి జిల్లా మాదిగ జేఏసీ అధ్యక్షుడిగా యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామానికి చెందిన డప్పు వీరస్వామిని నియమించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ నియామక పత్రాన్ని అందజేశారు. అంతకు ముందు పిడమర్తి రవిని స్థానిక నాయకులు సన్మానించారు. యాదాద్రి క్షేత్రంలో ఎస్సీ సత్రం నిర్మించాలని కోరారు. దీనిపై ఆయన స్పందిస్తు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. ఈ సమావేశంలో తుంగతుర్తి నియోజకవర్గ జేఏసీ ఇన్చార్జి దాసరి ప్రవీణ్, గద్దల అంజిబాబు, ఎర్రబెల్లి కృష్ణ, కూరెళ్ల దాసు, మందుల కృష్ణ, పులిగిల నర్సింహ, చేడె మహేందర్, మధు, కృష్ణ, తొంట నవీన్, ఆదిత్య, మహేష్, నరేష్, నాగరాజు, యాదగిరిగుట్ట సర్పంచ్ బూడిద స్వామి, పులెపాక అశోక్, సుర్పంగ పాండు, కొన్నె వెంకటేష్, గ్యాదపాక బాలనర్సయ్య, నమిలె ఆంజనేయులు, మొగిలిపాక మహేందర్, పులెపాక వెంకటేష్ తదితరులున్నారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
మోత్కూరు : నల్లగొండ జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం గర్భగుడిలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు గర్భగుడి తాళాన్ని పగులగొట్టారు. శివలింగం పక్కన కొంత మేర తవ్వకాలు చేసిన అనంతరం ప్రయత్నం ఉపసంహరించుకుని వెళ్లినట్టు సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తోంది. ఆలయం ఆవరణ అంతా కారంపొడి చల్లి ఉంది. దీనిపై ఆలయ కమిటీ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఏసీబీ వలలో మరో రెవెన్యూ చేప
ముత్తుకూరు, న్యూస్‌లైన్:ఎన్నికల ప్రక్రియ ముగిసి ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు జోరందుకున్న నేపథ్యంలో అవినీతి అధికారుల భరతం పట్టడంలో ఏసీబీ స్పీడ్ పెంచింది. సరిగ్గా వారం క్రితం వింజమూరు మండలం నందిగుంట వీఆర్వో శేషయ్య ఏసీబీకి చిక్కగా శుక్రవారం ముత్తుకూరు బిట్-2 ఆర్ఐ నన్నం నాగరాజు అడ్డంగా బుక్కయ్యాడు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.2 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ నంజుండప్ప కథనం మేరకు.. దువ్వూరువారిపాళేనికి చెందిన నడవల గున్నయ్యకు ఇటీవల గుండె ఆపరేషన్ చేయాల్సివచ్చింది. ఆరోగ్యశ్రీకార్డు ఇన్వాల్యూడ్ కావడంతో చెల్లుబాటులోకి తెచ్చేందుకు గున్నయ్య కొడుకు నడవల మోహన్ సంబంధిత వీఆర్వో పోలయ్యకు ఫోన్ చేశాడు. తాను శిక్షణలో ఉన్నానని, ఆర్ఐ నాగరాజును సంప్రదించాలని పోలయ్య సూచించాడు. దీంతో ఈ నెల 4న మోహన్ రెవెన్యూ కార్యాలయానికి వచ్చి ఆర్ఐ నాగరాజును కలిసి, ఆరోగ్యశ్రీకార్డు విషయం ప్రస్తావించాడు. దీనికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అవసరమని, రూ.2 వేలు ఖర్చవుతుందని ఆర్ఐ బదులిచ్చాడు. మరుసటి రోజే మోహన్ మళ్లీ ఆర్ఐని కలిసి లంచం మొత్తం తగ్గించాలని కోరాడు. దీనికి ఆయన ససేమిరా అనడంతో ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శుక్రవారం ముత్తుకూరు తహశీల్దార్ కార్యాలయంలో నాగరాజుకు మోహన్ రూ.2 వేలు ఇస్తుండగా అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. విధి లే కే ఏసీబీని ఆశ్రయించాను: నడవల మోహన్. తండ్రి గుండె అపరేషన్‌కు ఆరోగ్యశ్రీ కార్డు అవసరమై ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అడిగాను. అది ఇవ్వడానికి ఆర్ఐ నాగరాజు రూ.2 వేలు లంచం అడిగాడు. మరోమారు కలిసి లంచం మొత్తం తగ్గించమని ప్రాధేయపడ్డాను. ఆయన ససేమిరా అన్నాడు. దీంతో విధిలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. ఉపేక్షించేది లేదు : డీఎస్పీ నంజుండప్ప ముత్తుకూరు ఆర్ఐ నాగరాజుపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నడవల మోహన్ తమకు ఫిర్యాదు చేశాడు. లంచం తీసుకుంటుండగా నాగరాజును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశాం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయడానికి ఎవరైనా లంచం అడిగితే వెంటనే ప్రజలు మాకు ఫిర్యాదు చేయాలి. అవినీతి పరులు ఎంతటి వారైనా ఉపేక్షించేదిలేదు. ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. అవినీతి ఉద్యోగుల్లో ఏసీబీ గుబులు మొదటి సారి ముత్తుకూరు రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ దాడి చేసి ఆర్ఐ నాగరాజును అదుపులోకి తీసుకొన్న సంఘటన కలకలం సృష్టించిం ది. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల్లో ప నిచేసే కొందరు అవినీతి ఉద్యోగుల్లో గుబులు రేగింది. రెవెన్యూ కార్యాల యంలో కొందరు వీఆర్వోలు, ఉద్యోగులు ఇటీవల లంచాలకు బాగా అల వాటు పడ్డారన్న ఆరోపణలు ఉన్నా యి. ఈ నేపధ్యంలో ఏసీబీ దాడి జరగడంతో వారిలో కలకలం మొదలైంది. -
పరిహారం చెక్కుల గల్లంతు
ముత్తుకూరు, న్యూస్‌లైన్: ఏపీ జెన్కో సీవాటర్ ఇంటేక్ ప్లాంటు నిర్మాణం కోసం నేలటూరు పట్టపుపాళెంలో సేకరించిన భూములకు సంబంధించి చనిపోయిన వారి పేర్లతో పరిహారం స్వాహా చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై నెల్లూరు ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి శుక్రవారం పట్టపుపాళెంలో విచారణ చేపట్టారు. మత్స్యకారుల ఫిర్యాదు ప్రకారం..జెన్కో ప్రాజెక్టు చేపట్టిన సీవాటర్ ఇంటేక్ప్లాంటు నిర్మాణం కోసం 10 నెలల క్రి తం గంగపుత్రులకు చెందిన సీజేఎఫ్ఎస్ భూములు 34 ఎకరాలు సేకరించారు. 318, 321 సర్వే నంబర్లలోని ఈ భూముల్లో మొదటి విడతగా 28 ఎకరాలకుగాను 28 మందికి రూ 6.65 లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. అప్పటి ఆర్డీఓ మాధవీలత, ముత్తుకూరు తహశీల్దార్ సుశీలమ్మ పర్యవేక్షణలో ఈ చెక్కు లు పంపిణీ జరిగింది. రెండో విడతలో మరో 6 ఎకరాలకు 6 చెక్కులు సిద్ధం చేశారు. వీరిలో ముగ్గురికి మాత్రమే చెక్కులు అందాయి. మి గిలిన ముగ్గురిలో కోలంగారి అబ్బయ్య, కోడి చిననరసింహలు చనిపోయారు. బసవంగారి పోతయ్య మాత్రం ఉన్నాడు. వీరి చెక్కులను మాత్రం అధికారులు కాజేశారు. దీని వెనుక ఆర్డీఓ కార్యాలయంలో డీటీగా ఔట్ సోర్సింగ్ కింద పనిచేసే ఉద్యోగి హస్తం కూడా ఉంది. సాధారణంగా పరిహారం చెక్కులు ఇచ్చే ముం దు వీఆర్వో,ఆర్ఐలు రిపోర్టు రాస్తే, చెక్కు ఇచ్చేందుకు ఆర్డీఓ కార్యాలయానికి తహశీల్దార్ సిపార్సు చేస్తారు. అయితే అలా జరగలేదు. వీఆర్వో పోలయ్య ద్వారా ముగ్గురు బినామీ వ్యక్తులతో నగదు డ్రా చేశారని మత్స్య కారులు ఆరోపిస్తున్నారు. సొమ్ము రికవరీ చేస్తాం:ఆర్డీఓ పరిహారం సొమ్ము గల్లంతయినట్టు గుర్తించిన మత్స్యకారులు కొందరు ఇటీవల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరెడ్డి పట్టపుపాళెంలో విచారణ జరిపించారు. రెండో విడత కింద పంపిణీ అయిన ఆరు చెక్కులపై విచారణ జరిపారు. ఈ మూడు చెక్కుల పరిహారం మొత్తాన్ని రికవరీ చేస్తామన్నారు. -
బీసీలకు 150 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాలు కేటాయించాలి
మోత్కూరు, న్యూస్‌లైన్: వచ్చే సాధారణ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు 150 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలు బీసీలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా మోత్కూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లివ్వని పార్టీలను బీసీ వ్యతిరేక పార్టీలుగా గుర్తించి, వారి ఓటమికి ప్రచారం చేస్తామన్నారు. నల్లగొండ జిల్లా కమ్యూనిస్టులతో ఎంతో చైతన్యవంతమైనప్పటికీ 12 ఎమ్మెల్యేల స్థానాల్లో ఓకే ఒక్క స్థానం బీసీలకు కేటాయించడం, 2 పార్లమెంట్ స్థానాల్లో అగ్రవర్ణాలను, దొరలను ఎన్నుకోవడం ఏమిటని ప్రశ్నించారు. జిల్లాలో 12 ఎమ్మెల్యే స్థానాల్లో 6 బీసీలకు, 2 ఎంపీ స్థానాల్లో బీసీలకు ఒక్కటి కేటాయించాలని డిమాండ్ చేశారు. రూ. 20వేల కోట్లతో బీసీలకు సబ్‌ప్లాన్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సోలార్ పంపుసెట్లు 100 శాతం సబ్సిడీతో, ఉద్యానవన శాఖలో 50 శాతం సబ్సిడీతో బీసీ రైతులకు సదుపాయాలు అందించాలన్నారు.