నల్లగొండ జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం గర్భగుడిలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు.
మోత్కూరు : నల్లగొండ జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం గర్భగుడిలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు గర్భగుడి తాళాన్ని పగులగొట్టారు.
శివలింగం పక్కన కొంత మేర తవ్వకాలు చేసిన అనంతరం ప్రయత్నం ఉపసంహరించుకుని వెళ్లినట్టు సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తోంది. ఆలయం ఆవరణ అంతా కారంపొడి చల్లి ఉంది. దీనిపై ఆలయ కమిటీ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు పోలీసులకు ఫిర్యాదు చేశారు.