ఏసీబీ వలలో మరో రెవెన్యూ చేప
ముత్తుకూరు, న్యూస్‌లైన్:ఎన్నికల ప్రక్రియ ముగిసి ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు జోరందుకున్న నేపథ్యంలో అవినీతి అధికారుల భరతం పట్టడంలో ఏసీబీ స్పీడ్ పెంచింది. సరిగ్గా వారం క్రితం వింజమూరు మండలం నందిగుంట వీఆర్వో శేషయ్య ఏసీబీకి చిక్కగా శుక్రవారం ముత్తుకూరు బిట్-2 ఆర్‌ఐ నన్నం నాగరాజు అడ్డంగా బుక్కయ్యాడు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.2 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ నంజుండప్ప కథనం మేరకు.. దువ్వూరువారిపాళేనికి చెందిన నడవల గున్నయ్యకు ఇటీవల గుండె ఆపరేషన్ చేయాల్సివచ్చింది. ఆరోగ్యశ్రీకార్డు ఇన్‌వాల్యూడ్ కావడంతో చెల్లుబాటులోకి తెచ్చేందుకు గున్నయ్య కొడుకు నడవల మోహన్ సంబంధిత వీఆర్వో పోలయ్యకు ఫోన్ చేశాడు.
తాను శిక్షణలో ఉన్నానని, ఆర్‌ఐ నాగరాజును సంప్రదించాలని పోలయ్య సూచించాడు. దీంతో ఈ నెల 4న మోహన్ రెవెన్యూ కార్యాలయానికి వచ్చి ఆర్‌ఐ నాగరాజును కలిసి, ఆరోగ్యశ్రీకార్డు విషయం ప్రస్తావించాడు. దీనికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అవసరమని, రూ.2 వేలు ఖర్చవుతుందని ఆర్‌ఐ బదులిచ్చాడు. మరుసటి రోజే మోహన్ మళ్లీ ఆర్‌ఐని కలిసి లంచం మొత్తం తగ్గించాలని కోరాడు. దీనికి ఆయన ససేమిరా అనడంతో ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శుక్రవారం ముత్తుకూరు తహశీల్దార్ కార్యాలయంలో నాగరాజుకు మోహన్ రూ.2 వేలు ఇస్తుండగా అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు.
విధి లే కే ఏసీబీని ఆశ్రయించాను: నడవల మోహన్.
తండ్రి గుండె అపరేషన్‌కు ఆరోగ్యశ్రీ కార్డు అవసరమై ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అడిగాను. అది ఇవ్వడానికి ఆర్‌ఐ నాగరాజు రూ.2 వేలు లంచం అడిగాడు. మరోమారు కలిసి లంచం మొత్తం తగ్గించమని ప్రాధేయపడ్డాను. ఆయన ససేమిరా అన్నాడు. దీంతో విధిలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాను.
ఉపేక్షించేది లేదు :
డీఎస్పీ నంజుండప్ప
ముత్తుకూరు ఆర్‌ఐ నాగరాజుపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నడవల మోహన్ తమకు ఫిర్యాదు చేశాడు. లంచం తీసుకుంటుండగా నాగరాజును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశాం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయడానికి ఎవరైనా లంచం అడిగితే వెంటనే ప్రజలు మాకు ఫిర్యాదు చేయాలి. అవినీతి పరులు ఎంతటి వారైనా ఉపేక్షించేదిలేదు. ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు.
అవినీతి ఉద్యోగుల్లో
ఏసీబీ గుబులు
మొదటి సారి ముత్తుకూరు రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ దాడి చేసి ఆర్‌ఐ నాగరాజును అదుపులోకి తీసుకొన్న సంఘటన కలకలం సృష్టించిం ది. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల్లో ప నిచేసే కొందరు అవినీతి ఉద్యోగుల్లో గుబులు రేగింది. రెవెన్యూ కార్యాల యంలో కొందరు వీఆర్వోలు, ఉద్యోగులు ఇటీవల లంచాలకు బాగా అల వాటు పడ్డారన్న ఆరోపణలు ఉన్నా యి. ఈ నేపధ్యంలో ఏసీబీ దాడి జరగడంతో వారిలో కలకలం మొదలైంది.