power wires
-
విద్యుత్ తీగ తెగి పడి.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
నెల్లూరు రూరల్: విద్యుత్ లైన్ తీగ తెగి పడటంతో ఓ కుటుంబంలోని ముగ్గురు మృత్యువాత పడిన విషాద ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, రూరల్ పోలీసుల కథనం మేరకు... ఎంఐబీ– 207 ఇంటిలో గోవిందు వేణుగోపాల్ (54) కుటుంబం నివసిస్తోంది. ఆయన సైదాపురం మండలం కలిచేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కొరియర్ రావడంతో కవర్‌ను అందుకుని డబ్బులు ఇచ్చే సమయంలో పైనున్న విద్యుత్ లైను తీగ తెగి కొరియర్ బాయ్ టోపీపై పడింది. అతను త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగా ఆ తీగ వేణుగోపాల్‌పై పడింది. ఆయన అరుపులకు ఇంటి నుంచి బయటకు వచ్చిన భార్య లత (45) భర్తను కాపాడే క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురయ్యారు. వేణుగోపాల్ తల్లి బుజ్జమ్మ (71) కూడా బయటకు రాగా ఆమె కూడా విద్యుత్ షాక్‌కు గురికావడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వేణుగోపాల్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడుకి ఇటీవలే బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. కుమార్తె డిప్లొమా పరీక్షలు రాయడానికి అనంతపురం వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఒడిశాలో బస్సుకు షాక్..
భువనేశ్వర్: ఒడిశాలో ఓ బస్సుపై 11కేవీ విద్యుత్ తీగలు తెగిపడటంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు దుర్మరణం చెందగా.. 34 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గంజాం జిల్లా గోళాంతర ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. 45 మంది ప్రయాణికులతో జంగల్పాడు నుంచి చికరాడ వెళ్తున్న బస్సు మందరాజ్పూర్ వద్ద విద్యుదాఘాతానికి గురైంది. బస్సులోని వారంతా ఓ వివాహ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తున్నారని బెర్హంపూర్ సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డీపీవో) సర్దార్ జయంత్‌కుమార్ మహాపాత్ర వెల్లడించారు. మృతులకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంతాపం తెలిపారు. మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి వైద్య సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పద్మనాభ బెహరా తెలిపారు. -
కాటేసిన కరెంటు తీగ
పశ్చిమగోదావరి, కామవరపుకోట (చింతలపూడి): కరెంట్ తీగలకు మరో రైతు బలయ్యాడు. పశువులకు మేత వేసి పాలు తీసుకురావడానికి వెళ్లిన వ్యక్తిని విద్యుత్ తీగ మృత్యురూపంలో కబళించింది. కామవరపుకోట మండలం అంకాలంపాడు గ్రామానికి చెం దిన దొప్పసాని నాగేశ్వరరావు (42) అనే రైతు తన ఎకరాన్నర ఆయిల్‌పామ్ తోటలో గేదెలకు దాణా పెట్టి పాలు తీసుకురావడానికి బుధవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లాడు. తోట సమీపంలో అతడిపై 11 కేవీ విద్యుత్ కండక్టర్ వైరు తెగి పడటంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. శరీరం కాలిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. సమీప పొలంలో ఉన్న నాగేశ్వరరావు అన్న పగిడియ్య తమ్ముడి కేకలు విని వచ్చేసరికి ప్రమాదం జరిగిపోయింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతునికి భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగేశ్వరరావు మృతితో వా రంతా అనాథలయ్యా రు. నాగేశ్వరరావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావడంతో పార్టీ నాయకులు పలువురు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుని భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తడికలపూడి ఏఎస్సై సత్యనారాయణ తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ సంఘటనా స్థలానికి చేరుకున్న వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని కుటుంబసభ్యులకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారు. పార్టీలో నిబద్ధత గల కార్యకర్తగా నాగేశ్వరరావు పనిచేశాడన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే.. నాగేశ్వరరావు మృతదేహాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘంటా మురళీరామకృష్ణ సందర్శించి నివాళులర్పించారు. మృతుని ఇద్దరు పిల్లలను ప్రభుత్వమే చదివించి, భార్యకు అంగన్వాడీ టీచర్ పోస్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఏటా రైతులు విద్యుత్ ప్రమాదాల్లో మృతి చెందుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ కండక్టర్ తీగలను వెంటనే తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
అరకటివేములలో విషాదం
అరకటివేములలో ఘోరం జరిగింది. ఈదురుగాలులకు తెగిపడిన విద్యుత్ తీగలను గమనించకుండా తాకిన ఇద్దరు వ్యక్తులు షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. పుట్లూరు:అరకటివేముల గ్రామంలోని రజక వీధిలో మంగళవారం తెల్లవారుజామున గాలివానకు విద్యుత్ తీగ తెగిపడింది. అదే సమయంలో బాలరంగయ్య (30), చాకలి ఓబుళపతి (55) అనే వ్యక్తులు తాడిపత్రికి వెళ్లడానికి ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. తెగిపడిన తీగలను గమనించకుండా తాకడంతో ఇద్దరూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. బాలరంగయ్య తండ్రి ఏడాది క్రితం చనిపోవడంతో తనే ఇంటికి పెద్దదిక్కయ్యాడు. ఇటువంటి సమయంలో విద్యుదాఘాతంతో అతడు కూడా మృతి చెందటంతో తమకు దిక్కెవరు అంటూ తల్లి, సోదరుడు కన్నీరుమున్నీరయ్యారు. మరో మృతుడు ఓబుళపతికి భార్య వెంకటమ్మ ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సురేష్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు పరామర్శ :అరకటివేముల గ్రామంలో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన బాలరంగయ్య, చాకలి ఓబుళపతి కుంటుంబాలను వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి పరామర్శించారు. తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మృతులకు ఆయన నివాళులు అర్పించారు. ఈయన వెంట వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రాఘవరెడ్డి, నాయకులు కంచెం శ్రీనివాసులరెడ్డి ఉన్నారు. -
రాత్రంతా జాగారం
రాత్రి ఒంటి గంట.. జగదల్పూర్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు.. వారు ఉదయానికి విశాఖ చేరుకోవాలి.. అంతలో బొర్రాగుహలు స్టేషన్లో రైలు నిలిచిపోయింది.. గంటలు గడుస్తున్నా కదలకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది.. అప్పుడు తెలిసింది విద్యుత్ వైర్లపై చెట్టు పడి అంతరాయం ఏర్పడిందని.. దీంతో రైల్లో ప్రయాణిస్తున్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి.. బుధవారం ఉదయం 10.30 గంటలకు గానీ పునరుద్ధరణ పనులు పూర్తికాలేదు.. అదీ పాక్షికంగానే.. అనంతగిరి (అరకులోయ):కొత్తవలస–కిరండూల్ (కేకే) లైన్లో మంగళవారం రాత్రి ప్రయాణికులు నరకం చూశారు. వివిధ పనులపై విశాఖ వెళదామని రైలెక్కిన వారంతా అర్ధరాత్రి పూట మార్గమధ్యంలో బండి నిలిచిపోవడంతో నానా అవస్థలు పడ్డారు. విద్యుత్ వైర్లు తెగిపడడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చిమిడిపల్లి–తైడా మధ్యలో 58/89లో ఓహెచ్సీ విద్యు™Œ వైర్లు, స్తంభాలపై చెట్టు పడడంతో సమస్య తలెత్తింది. రాత్రి 1 గంట సమయంలో ఓహెచ్ఈ విద్యుత్ వైర్ల మీద చెట్టు పడడం వల్ల జగదల్పూర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును బొర్రా రైల్వే స్టేషన్ వద్ద నిలిపివేశారు. వేసవి కాలం కావటంతో ఆకులు రాలిపోయి చెట్లు ఎండిపోతున్నాయి. వీటికి కొద్దిపాటి నిప్పు రవ్వ అంటుకున్నా అది కార్చిచ్చుగా మారి అడవిని సైతం తగులబెట్టే విధంగా మంటలు చెలరేగుతున్నాయి. ఈ విధంగా మంగళవారం రాత్రి అనంతగిరి మండలంలో ఎక్కడ బడితే అక్కడ కార్చిచ్చు చెలరేగింది. కేకే లైన్‌ను అనుకుని ఉన్న కొండపై ఓ వృక్షానికి నిప్పు అంటుకుని అది నేలకొరిగింది. తైడా, చిమిడిపల్లి స్టేషన్ల మధ్య ఒంటిగంట సమయంలో విద్యుత్ తీగలపై పడింది. దీంతో ఈ సమయంలో ప్రయాణిస్తున్న రైళ్లను రైల్వే అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. జగదల్పూర్ నుంచి విశాఖపట్నం వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు బొర్రా స్టేషన్లో నిలచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రంతా అవస్థల మధ్య గడిపారు. రైల్వే సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వృక్షాన్ని యుద్ధప్రతిపాదికన తొలగించడంతో బుధవారం ఉదయం 10.30 గంటలకు రైలు కదిలింది. జగదల్పూర్ వరకే కిరండూల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): కేకే లైన్లో బుధవారం తెల్లవారుజామున చెట్ల కొమ్మలు విరిగిపడడంతో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల విశాఖపట్నం–కిరండూల్–విశాఖపట్నం(08512/11)స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం జగదల్పూర్ వరకే నడిచిందని ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ జి.సునీల్‌కుమార్ తెలిపారు. తిరుగు ప్రయాణంలో గురువారం ఈ రైలు కిరండూల్ నుంచి కాకుండా జగదల్పూర్ నుంచి విశాఖపట్నం వస్తుందని ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు. పూర్తి టికెట్ డబ్బులు ఇవ్వాలని ప్రయాణికులు రైల్వే సిబ్బందిని డిమాండ్ చేశారు. అయితే రైల్వే సిబ్బంది ప్రయాణికుల టికెట్ డబ్బులో 50 శాతం తిరిగి ఇచ్చారు. నరకం చూశాం.. రాత్రంతా బొర్రా స్టేషన్లోనే గడిపాం. అర్ధరాత్రి రైలు నిలిచిపోవడంతో పిల్లా పాపలతో ప్రయాణిస్తున్న కుటుంబాలన్నీ తీవ్ర అవస్థలు పడ్డాయి. తాగడానికి మంచి నీరు సైతం దొరకలేదు. బొర్రా గుహల నుంచి ములియగుడ చేరుకుని విశాఖపట్నం వెళుతున్నాం.– శరభన్, జగదల్పూర్ అర్జంటు పనులు ఆగిపోయాయి.. కోరాపుట్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు రైలెక్కాను. రాత్రి ఒంటిగంటకు నిలిచిపోయిన రైలు తెల్లారినా కదలకపోవడంతో నా పనులన్నీ ఆగిపోయాయి. రాత్రంతా ఆందోళనే. చాలా ఇబ్బందులకు గురయ్యాం. – చైతన్య, కోరాపుట్ -
కోతి తెచ్చిన తంటా
వెలుగోడు: ఓ కోతి చేసిన ఆకతాయి పనికి ఇళ్లలోని విద్యుత్ మీటర్లు, టీవీలు, ఫ్రీజ్‌లు కాలిపోయిన ఘటన వెలుగోడులో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. పట్టణంలోని ఏరాసు అయ్యపురెడ్డి నగర్లో ఏర్పాటు చేసిన 11 కేవీ విద్యుత్ తీగలపై కోతి వేలాడటంతో ఆ తీగ తెగి మరో తీగలపై పడింది. దీంతో ఒక్క సారిగా హై ఒల్టేజీ రావడంతో కాలనీలోని 50 ఇళ్లలో విద్యుత్ మీటర్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, లైట్లు కాలిపోయాయి. దీంతో బాధితులు విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఎస్ఐ సుబ్బరామిరెడ్డి అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. విద్యుత్ అధికారులతో చర్చించి కొత్త మీటర్లు ఇచ్చేందుకు ఒప్పించడంతో బాధితులు శాంతించారు. -
ఆ వైర్లు షాక్ కొట్టవు!
విజయనగరం, బొబ్బిలి: మన ఇళ్లు... డాబాల మీదుగా వెళ్లే విద్యుత్ వైర్లతో ఇక అవస్థలు పడనక్కరలేదు. అవి షాక్ కొడతాయని భయపడక్కర్లేదిక! ఎందుకంటే ఇక నుంచీ షాక్ కొట్టని వైర్లు వస్తున్నాయి. కరెంటు వైర్లు షాక్ కొట్టకపోవడమేంటంటారా? జిల్లాలో ప్రయోగాత్మకంగా కవర్డ్ కం డక్లర్లు అమరుస్తున్నా రు. ఇప్పటికే ఈ పనులు ప్రారంభమయ్యా యి. స్వీడన్ నుంచి వచ్చి న ఈ వైర్లను జిల్లాలోని రెండు మున్సిపాలిటీలకు మాత్ర మే అందజేశారు. దీంతో ఈపీడీసీఎల్ అధికారులు ప్రస్తుతం ఈ పనులు నిర్వహిస్తున్నారు. స్వీడన్ దేశంలో అమలవుతున్న ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ముందు అమలు చేసి దాని పనితీరు చూసి అటు తరువాత జిల్లా వ్యాప్తంగా వైర్లను మార్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రెండు మున్సిపాలిటీల్లో30 కిలోమీటర్ల మేర మార్పులు విజయనగరం, బొబ్బిలి మున్సిపాలిటీల్లో మాత్రమే ఈ వైర్ల మార్పు జరుగుతోంది. విజయనగరం మున్సిపాలిటీలో 20 కిలోమీటర్ల చొప్పున, బొబ్బిలిలో 10 కిలోమీటర్ల చొప్పున ఈ కొత్త కండక్టర్లతో లైన్లు మార్చుతున్నారు. బొబ్బిలిలో ఇప్పటికే సుమారు 30 శాతం పైగా పనులు పూర్తి కావచ్చాయి. నిర్వహణ ఇక సులభం కొత్తగా వచ్చిన కవర్డ్ కండక్లర్ల వల్ల నిర్వహణ చాలా సులభమవుతుంది. గతంలో చెట్ల కింది నుంచి గ్రామాలు, పట్టణాలకు వెళ్లే విద్యుత్ వైర్ల వల్ల షార్ట్‌సర్క్యూట్ ప్రమాదాలు తరచూ చోటు చేసుకునేవి. పెద్ద పెద్ద మంటలు రేగుతూ జిల్లాలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్న విషయం విదితమే. ఇప్పుడీ కొత్త తరహా వైర్ల వల్ల ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు. ఎందుకంటే కవర్డ్ కండక్లర్ల వలన రెండు వైర్లు కలసి పోయినా, లేక వైర్లను ప్రమాదావశాత్తూ తాకినా ప్రమాదాలు జరగవు. అందువల్ల నిర్వహణ ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశముంది. ఖర్చు దాదాపు రెండింతలు ప్రస్తుతం జిల్లాలో స్వీడన్ తరహా విద్యుత్ లైన్ల మార్పిడికి ఖర్చు భారీగానే అవుతోంది. అయితే భద్రత దృష్ట్యా ఈ ఖర్చుకు వెనుకాడక్కర్లేదని అధికారులు చెబుతున్నారు. సంప్రదాయ కండక్టర్ ధర కిలోమీటర్‌కు రూ.4లక్షలు అయితే ఇది కిలోమీటర్‌కు రూ.8 లక్షలు అవుతుంది.మొత్తంగా రెండు మున్సిపాలిటీల్లోనూ విద్యుత్ వైర్ల కొనుగోలుకే రూ.2.40 కోట్లు ఖర్చవుతుంది. జిల్లా వ్యాప్తంగా ఈ కవర్డ్ కండక్లర్లు ఏర్పాటు వల్ల ఎంతో భద్రత ఉంటుందని విద్యుత్ శాఖాధికారులు, ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. కవర్డ్ కండక్టర్లతో భద్రత జిల్లాలోని బొబ్బిలి, విజయనగరం మున్సిపాలిటీలకు కొత్తగా స్వీడన్ టెక్నాలజీతో కవర్డ్ కండక్లర్లు మంజూరయ్యాయి. బొబ్బిలికి పది కిలోమీటర్లు మంజూరయ్యాయి. ఆ పనులు చేస్తున్నాం. త్వరలో పనులు పూర్తవుతాయి. దీని వల్ల భద్రతకు అవకాశం ఉంటుంది. – లచ్చుపతుల సత్యనారాయణ, ఏడీఈ, ఈపీడీసీఎల్, బొబ్బిలి -
పాపం.. బడి పిల్లలు
వల్లూరు: తమ పాఠశాలలో శుక్రవారం జరగనున్న గణతంత్ర వేడుకల్లో జెండాను ఎగురవేసేందుకు సిద్ధం చేస్తుండగా పాఠశాల ముందు భాగంలో ఉన్న విద్యుత్ తీగలు తగులుకుని నలుగురు విద్యార్థులకు గాయాలైన సంఘటన మండలంలోని పెద్దలేబాక ఎస్సీ కాలనీలో గురువారం జరిగింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు మండలంలోని పెద్దలేబాక ఎస్సీ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక ( స్పెషల్ ) పాఠశాల ఉపాధ్యాయుడు దీన్ దయాల్ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం జరిగే వేడుకలకు అవసరమైన ఏర్పాట్లను చేయడానికి సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా ఉపాధ్యాయుని సూచన మేరకు పాఠశాల తరగతి గదిలో ఉన్న జెండాను ఎగురవేసే ఇనుప పైపును నలుగురు విద్యార్థులు గది బయటకు తీసుకుని వచ్చారు. పైపును నిలబెట్టే క్రమంలో పాఠశాల ఆవరణలో గదికి సమీపంలో వెళుతున్న 11 కేవీ విద్యుత్ తీగలకు పొరబాటున తగిలింది. దీంతో పైపు గుండా విద్యుత్ ప్రవహించడంతో పైపును పట్టుకున్న 5 వ తరగతి విద్యార్థులు ఆది జాషువా పాల్, బి.ఈశ్వర వర్దన్, ఆది రామకృష్ణ , నాలుగవ తరగతి విద్యార్థి పెరికెల అజిత్ చంద్ర విద్యుదాఘాతానికి గురయ్యారు. అక్కడే ఉన్న ఉపాధ్యాయుడు దీన్ దయాల్ అప్రమత్తమై వారిని రక్షించాడు. దీంతో విద్యార్థులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు , స్థానికులు విద్యార్థులను ఆటోలో కమలాపురం ఆసుపత్రికి తరలించారు. ఈశ్వర వర్దన్, జాషువా పాల్ అనే విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. కాలికి తీవ్ర గాయమైన జాషువా పాల్ , షాక్‌లో ఉన్న ఈశ్వర వర్దన్‌లు కోలుకుంటున్నారు. తహసీల్దార్ మహాలక్ష్మి సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడారు. పరామర్శించిన ఎమ్మెల్యే రిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను జెడ్పీటీసీ సభ్యుడు అబ్బిరెడ్డి వీరారెడ్డితో కలిసి కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథరెడ్డి పరామర్శించారు. వారి తల్లి దండ్రులతో ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం బాధితులకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు అందజేశారు. ఆయన వెంట ఎంపీటీసీ చల్లా రాజారెడ్డి, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకుడు చిట్టిబాబు ఉన్నారు. -
కరెంటు తీగలు తగిలి వ్యక్తి మృతి
రామాపురం : రాచపల్లె గ్రామ పంచాయతీ బీదవాండ్లపల్లెలో ఎస్సీ కాలనీకి చెందిన నీళ్లపల్లి సుబ్బరాయుడు(50) విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు. పోలీసు లు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ సమీపంలోని కొండ ప్రాంతంలో ఉన్న పొలాల్లో అడ వి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు రాచపల్లెకు చెందిన సుబ్బన్న, గుర్రయ్య, మహేశ్వరుడు కూటాలు నాటి కరెంటు తీగలు అమర్చారు. తమ పంట పొలాలకు కాపలా కోసం ఆ దారిన వెళ్తున్న సుబ్బరాయుడు పొరపాటున కరెంటు తీగలు తగిలి గాయపడ్డాడు. అతనిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. సుబ్బరాయుడు కుమారుడు వీరనాగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ రోజులు మాకొద్దు..రాత్రి కరెంటు చంపేస్తోంది..
ఏప్రిల్ 1, మంగళవారం, 2014... వేళాపాళా లేని విద్యుత్తు రెండు నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది. ఇంటికి పెద్ద దిక్కు లేకుండా చేసింది. ఎవుసాన్ని నమ్ముకున్న రైతులను కరెంటు తీగలు కబళించాయి. పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన మెదక్ జిల్లా గజ్వేల్ వుండలం కోవుటిబండకు చెందిన ఉబ్బని రామయ్య , కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్‌లో నంగని గంగారెడ్డిలు చేలోనే కరెంటు కాటుకు బలయ్యారు. రామయ్య రాత్రి పదకొండు గంటల సమయంలో పగిలిన పైపులైన్‌ను సరిచేస్తుండగా కరెంటు తీగలు తెగి మీద పడడంతో చనిపోయాడు. గంగారెడ్డి కూడా ఇదే కారణంగా చనిపోయాడు. ఇలా రాత్రి కరెంటుకు ఎందరో చనిపోతూనే ఉన్నారు. రాష్ర్టంలో కరెంటు రాకడ..పోకడ పాలక పెద్దల కే కాదు ఆ దేవుడే దిగివచ్చినా చెప్పలేని దుస్థితి ఉంది. వేళాపాళా లేని విద్యుత్ సరఫరాతో రైతులు రేయింబవళ్లు మడిలోనే మకాం పెడుతూ జాగారం చేస్తున్నారు. కాలిన మోటార్లు, ఫ్యూజులు, ట్రాన్స్ఫార్మర్లను బాగు చేసుకునే క్రమంలో బలిపీఠం ఎక్కుతున్నారు. ఎ(వి)లక్షణం: బద్దం.. గెలిస్తే మధ్యంతరం మిర్యాలగూడ(నల్లగొండ), న్యూస్‌లైన్: కొందరికి ఎన్నికలు అచ్చిరావు..వురికొందరు ఎన్నికైనా ఫలం దక్కదు. ఆ రెండో కోవకు చెందిన వ్యక్తే వాస్తు శిల్పి బద్ద నర్సింహారెడ్డి (బీఎన్‌రెడ్డి).మిర్యాలగూడ నుంచి ఎంపీగా బీఎన్‌రెడ్డి గెలిచినప్పుడు ఎప్పుడూ ఐదేళ్లకాలం ఎంపీగా కొనసాగలేకపోయారు. గెలిచిన ప్రతిసారీ మధ్యంతర ఎన్నికలు వచ్చాయి.పైగా ఆయన గెలిచినప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. మొదటగా 1989లో బీఎన్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి భీమిరెడ్డి నర్సింహారెడ్డి (సీపీఎం)పై 34,995 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వీపీసింగ్, చంద్రశేఖర్ ప్రభుత్వాలు స్వల్పకాలంలో పడిపోవడంతో 1991లో మధ్యంతర ఎన్నికలొచ్చాయి. వుళ్లీ భీమిరెడ్డి (సీపీఎం)పై తిరిగి బీఎన్‌రెడ్డి పోటీ చేసినా 8263 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పుడు పీవీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 1996 సాధారణ ఎన్నికల్లో వుళ్లీ బీఎన్‌రెడ్డి పోటీ చేసి మల్లు స్వరాజ్యం (సీపీఎం)పై 43,876 ఓట్ల మెజారిటీతో గెలిచినప్పుడు వాజ్‌పేయి ప్రభుత్వం 15 రోజులే కొనసాగింది. తరువాత దేవెగౌడ ప్రభుత్వం కొంత కాలానికే కుప్పకూలింది. దీంతో 1998లో వుళ్లీ మధ్యంతర ఎన్నికలొచ్చాయి. అప్పుడు సీపీఎం అభ్యర్థి చెరుపల్లి సీతారాములుపై 14,498 ఓట్ల మెజారిటీతో బీఎన్‌రెడ్డి గెలిచారు. అప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. ఒక్క ఏడాదే ఎంపీ పదవిలో ఉన్నారు. 1999 సాధారణ ఎన్నికల్లో ఆయునకు కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. టిక్కెట్ దక్కించుకున్న సీనియర్ కాంగ్రెస్ నేత సూదిని జైపాల్‌రెడ్డి వరుసగా ఆయన 1999 , 2004 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. ఎలచ్చన్లు అచ్చినప్పుడే గుర్తుకస్తం ఎన్నో ఎలచ్చన్లు అచ్చినై పోయినై.. నాయకులు మారుతుండ్రు.. ఎలచ్చన్లు అచ్చినప్పుడె మేము గుర్తుకొస్తం. ఆ తర్వాత కనిపియ్యరు. నేను చిన్నగున్నప్పుడే మా పెద్దోళ్ల నుంచి ఈ వృత్తి నేర్చుకున్న. అప్పటినుంచి గిప్పటివరకు నా బత్కులో ఏం మార్పులే. జైనథ్ మండలం సాత్నాల దగ్గరున్న తోయగూడ మా ఊరు. పక్కనున్న మారుగూడ కాడ గుడిసె వేసుకొని పనులు జేసేవాడ్ని. అప్పట్లో కాస్తకార్లు సామగ్రి తీసుకొచ్చి పలుగులు, నాగళ్లు, కర్రులు, కొడవళ్లు, గొడ్డళ్లు, బండిగారెలు తయారు చేయించుకునేవాళ్లు. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయంటేనే కమ్మరింట్లో సందడి ఉండేది. చేతిల పైసలు కనిపించేవి. గిప్పుడేమో అన్నీ రెడీమేడ్‌గానే దొరుకుతుండబట్టె. ఊర్లలో పనిముట్లను సర్పతందుకు తీసుకరావడమే తప్పితే తయారు చేయించుకోవడం లేదు. కమ్మరి పనులు నడవక పోవడంతో బతుకుదెరువు కోసం ఆదిలాబాద్ పట్టణానికి వచ్చినా. ఈడా ఎడైనా ఇండ్ల పనులు నడుస్తుంటే గడ్డపారలు, ఫ్యాన్ కొండ్లు, డాగులు చేయించుకునేందుకు అస్తుంటారు. పొట్ట గడుస్తే మస్తన్నట్లు బతుకు సాగుతుంది. ఇక్కడికచ్చి 23 ఏండ్లైనా ఇప్పటి వరకు నాకు ఇల్లు లేదు. ఎన్నో ఏండ్లసంది బ్యాంకు లోన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నా ఒక్కలు కరుణించలేదు. వయసులో ఉన్నప్పుడే ఆ రుణం ఇచ్చుంటే వెల్డింగ్ కార్కాన్ పెట్టుకుంటే లాభముండేది. ఎన్నికలప్పుడు అచ్చిన నాయకులకు నా కష్టాలు చెబితే అన్నీ రాసుకున్నరు. ఇల్లన్నరు, లోనన్నరు, పింఛనన్నురు. ఏదీ ఏదీ లే. మాలోంటోళ్ల కష్టాలు పట్టించుకునేటోళ్లే లేరు. ఈ ముసలితనంలో భగవంతుడు ఇచ్చికాడికి ఉన్నదున్నట్టు పని చేసుకుంటూ బతుకుతున్నా. - పులిమామిడి రాములు, దస్నాపూర్, ఆదిలాబాద్