కరెంటు తీగలు తగిలి వ్యక్తి మృతి | Power wires to catch the person killed | Sakshi
Sakshi News home page

కరెంటు తీగలు తగిలి వ్యక్తి మృతి

Published Sat, Nov 12 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

Power wires to catch the person killed

రామాపురం : రాచపల్లె గ్రామ పంచాయతీ బీదవాండ్లపల్లెలో ఎస్సీ కాలనీకి చెందిన నీళ్లపల్లి సుబ్బరాయుడు(50) విద్యుత్‌ తీగలు తగిలి మృతి చెందాడు. పోలీసు లు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ సమీపంలోని కొండ ప్రాంతంలో ఉన్న పొలాల్లో అడ వి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు రాచపల్లెకు చెందిన సుబ్బన్న, గుర్రయ్య, మహేశ్వరుడు కూటాలు నాటి కరెంటు తీగలు అమర్చారు. తమ పంట పొలాలకు కాపలా కోసం ఆ దారిన వెళ్తున్న సుబ్బరాయుడు పొరపాటున కరెంటు తీగలు తగిలి గాయపడ్డాడు. అతనిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. సుబ్బరాయుడు కుమారుడు వీరనాగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement