కోటా: రాజస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 24 మంది మృతిచెందారు. మృతుల్లో 11 మంది మహిళలు సహా ముగ్గురు చిన్నారులు ఉన్నారు. రాజస్తాన్‌లోని బుండి జిల్లా కోటా–దౌసా జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సవాయి మాధోపూర్ నగరంలో జరగనున్న వివాహ వేడుకకు హాజరయ్యేందుకు 29 మంది బుధవారం ఉదయం కోటా నుంచి బస్సులో బయల్దేరారు. పాన్‌డీ గ్రామం సమీపంలోని బ్రిడ్జి వద్దకు రాగానే డ్రైవర్ బస్సును నియంత్రించలేకపోయాడు. ఈ బ్రిడ్జికి గోడ కానీ రెయిలింగ్ కానీ లేకపోవడంతో దాదాపు 20–25 అడుగుల ఎత్తు నుంచి బస్సు మెజ్ నదిలో పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment