wedding cecmony
-
Anant-Radhika Wedding:ఆకాశ పందిరి.. తారలు తలంబ్రాలు
కుబేరులు వియ్యంకులైతే ఒక కల్యాణం ఎంత ఘనంగా జరగాలో అంత ఘనంగా జరుగుతుంది. దేవతల వంటి అతిథులు, పుష్పక విమానాలు, పారిజాతాలు, శతభక్ష్య పరమాణ్ణాలు, సువర్ణ తోరణాలు, వెండి ద్వారాలు, స్త్రీల మెడల్లో పచ్చలు, కెంపులు, వజ్రవైఢూర్యాలు, కళ్లు చెదిరే పట్టుపీతాంబరాలు...ముఖేష్ అంబానీ– నీతా అంబానీ తమ కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని విరెన్ మర్చంట్–శైలా మర్చంట్ల కుమార్తె రాధికా మర్చంట్‌తో జూలై 12 రాత్రి జరప నిశ్చయించడంతో ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ అందుకు భారీ వేదికైంది. దేశ, విదేశాల అతిథులను విమానాలు మోసుకొచ్చాయి. శనివారం ‘శుభ్ ఆశీర్వాద్’ పేరుతో వేడుక, ఆదివారం రోజు ‘మంగళ్ ఉత్సవ్’ పేరున భారీ రిసెప్షన్ జరుగనున్నాయి.తరలి వచ్చిన అతిథులుఒకవైపు తేలికపాటి చినుకులు పడుతూ ఉంటే అనంత్–రాధికల పెళ్లి కోసం అంబానీ గృహధామం ఎంటిలియాతో పాటు వివాహవేదిక జియో వరల్డ్ కన్వెçన్షన్‌లో అతిథుల తాకిడి మొదలైంది. ‘దుల్హేరాజా’ అనంత్ బారాత్‌ను సర్వాంగ సుందరంగా తయారు చేసిన కారులో కొనసాగింది. సాయంత్రం నుంచే అతిథుల రాక మొదలైంది. బ్రిటన్ మాజీ ప్రధాని టోని బ్లెయర్ మొదలు అమెరికా మీడియా పర్సనాలిటీ కిమ్ కర్దాషియన్ వరకు హాలీవుడ్ నటుడు జాన్ సీనా నుంచి తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ వరకూ ఎందరో అరుదెంచారు. బాలీవుడ్ నుంచి షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, ఆలియా భట్, ప్రియాంకా చో్ప్రా– నిక్ జోన్స్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ తదితరులు హాజరయ్యారు. క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోని, నాటి మేటి ఆటగాడు శ్రీకాంత్, బుమ్రా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. దక్షిణాది తారాతోరణంఅనంత్– రాధికల వివాహంలో దక్షిణాది తారలు తళుకులీనారు, మహేష్‌బాబు తన భార్య నమ్రత, కుమార్తె సితారతో హాజరవగా, రామ్‌చరణ్–ఉపాసన జోడీగా వచ్చారు. వెంకటేష్, రాణ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహమాన్ సతీసమేతంగా హాజరయ్యారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కుటుంబ సమేతంగా వచ్చారు. నయనతార–విగ్నేష్ శివన్, సూర్య–జ్యోతిక వేడుకకు తళుకులు అద్దారు. -
అనంత్ అంబానీ పెళ్లిలో ధగధగ మెరిసిపోతున్న దేవర భామ.. పోటోలు
-
కేఎల్ రాహుల్- అతియా పెళ్లి వేదిక! ఎంత అందంగా ఉందో చూశారా?! (ఫొటోలు)
-
చిత్తూరులో ఘోరం.. పెళ్లింట పెనువిషాదం
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పరిధిలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రాత్రి 10 గంటల సమయంలో పూతలపట్టు, కాణిపాకం మార్గంలోని లక్ష్మయ్య ఊరు అనే గ్రామం వద్ద జరిగింది. ఐరాల మండలం బలిజపల్లికి చెందిన హేమంత్‌కుమార్‌కు పూతలపట్టు మండలం జెట్టిపల్లిలో గురువారం వివాహం జరగాల్సి ఉంది. ఇందుకోసం వరుడి తరఫు బంధువులు సుమారు 30 మంది వరకు బుధవారం రాత్రి ట్రాక్టర్లో జెట్టిపల్లికి బయలుదేరారు. ఈ క్రమంలో పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో సురేంద్రరెడ్డి (52) (డ్రైవర్), వసంతమ్మ (50), రెడ్డెమ్మ (31), తేజ (25), వినీషా (3), దేశిక (2) ఉన్నారు. గాయపడ్డ వారిని అంబులెన్స్‌లో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ సురేంద్రరెడ్డి ట్రాక్టర్ గేర్‌ను న్యూట్రల్ చేసి వేగంగా వెళ్లడంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనే గుంతలో దిగి బోల్తాపడింది. గాయపడ్డవారిలో వళ్లెమ్మ (60), సోమశేఖర్ (25), లక్ష్మమ్మ (60), చిన్నప్ప (55), మునీశ్వరి (46), సుభాíÙణి (35), అరుణ (44), ఉదయ్ (35), లీలావతి (27), మాలతి (35), మాధవి(25), కృష్ణవేణి (38), యశోద (30), నవీన (26), శంకయ్య (70), హేమంత్ (31), వినాయక (39), సుమతి (49), మోనిక (23), కాంతమ్మ (45), అన్నపూర్ణ (43,) శోభన్‌బాబు(43) ఉన్నారు. -
పెళ్లి పీటలెక్కబోతున్న నాగశౌర్య.. వధువు ఎవరంటే..?
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ నెల 20న బెంగళూరులో అనూష అనే యువతిని వివాహం చేసుకోబోతున్నాడు. నవంబర్ 19న మెహందీ ఫంక్షన్ ఉండటంతో ఇప్పటికే నాగశౌర్య ఇంట పెళ్లి సందడి మొదలైంది. శుభలేఖలు కూడా పంచుతున్నారు. పెళ్ళికి భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా నాగశౌర్య ఫ్యామిలీ ఆహ్వానితులను కోరుతోంది. నవంబర్ 20న ఉదయం 11.25 గంటలకి అనుష మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. నాగ శౌర్య వివాహం జరగబోతున్న సంగతి బయటికి వచ్చింది కానీ అది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిరించిన వివాహమా? అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. పెళ్లి విషయం తెలియడంతో నాగశౌర్యకు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల నాగశౌర్య తన 24వ సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాకు అరుణాచలం దర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని వైష్ణవి ఫిలిమ్స్ మీద శ్రీనివాసరావు, విజయ్ కుమార్, అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. -
నా పెళ్లిలో నేను నేనులా కనిపిస్తా: తాప్సీ
‘‘సినిమా ఇండస్ట్రీ కాకుండా బయట వ్యక్తితో నాకు అనుబంధం కుదరాలని కోరుకున్నాను. కెరీర్ ఆరంభించిన తక్కువ టైమ్‌లోనే అది జరిగింది. నాకెవరితో ఉంటే సౌకర్యవంతంగా ఉంటుందో అలాంటి వ్యక్తే దొరకడం ఆనందంగా ఉంది’’ అంటున్నారు తాప్సీ. డెన్మార్క్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోతో తాప్సీ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మథియాస్‌తో అనుబంధం గురించి ఓ పత్రిక అడిగితే.. పై విధంగా స్పందించారు తాప్సీ. ఇంకా ఆ ఇంటర్వ్యూలో మథియాస్ గురించి తాప్సీ మాట్లాడుతూ – ‘‘మా ఇద్దరి ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. అందుకే మా మధ్య జరిగే చర్చలు ఆసక్తికరంగా ఉంటాయి’’ అన్నారు. పెళ్లికి వధువు చేసుకునే అలంకరణ గురించి మాట్లాడుతూ – ‘‘మందంగా మేకప్ వేసుకుని కనిపించే పెళ్లికూతుళ్లను చూస్తే నాకు బాధగా ఉంటుంది. ఎందుకంటే అంత మేకప్‌లో మనం మనలా కనపడం. మన పెళ్లి ఫొటోల్లో మనల్ని మనమే గుర్తుపట్టలేనంతగా ఉంటే ఎలా? పెళ్లి తాలూకు జ్ఞాపకం ఆ క్షణాల వరకే కాదు.. జీవితాంతం ఆ అనుభూతి మిగిలిపోవాలి. అందుకే నా పెళ్లిలో నేను నేనులా కనిపిం చేట్లే ఉంటా. మామూలుగా నా జుత్తు వంకీలు తిరిగి ఉంటుంది. పెళ్లికి కూడా అలానే ఉంచేస్తా’’ అన్నారు తాప్సీ. -
బంధువులు లేని పెళ్లి బరాత్.. వైరల్ వీడియో..
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని తీపిగుర్తు. పెళ్లిలోని ప్రతి వేడుకను వధువరులు జీవితాంతం మరిచిపోలేనిదిగా ఉండాలనుకుంటారు. అయితే వివాహం జరిగిన అనంతరం ఏర్పాటు చేసే బరాత్‌లో కుటుంబసభ్యులు, స్నేహితులు చేసే డ్యాన్సుల హంగామా మాములుగా ఉండదు. ప్రతి ఒక్కరు దీన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అయితే తాజాగా, ఓ వరుడి పెళ్లి బరాత్‌లో కేవలం బ్యాండ్‌వారు మాత్రమే కనిపిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కనిపించలేదు. కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న నేపథ్యంలో పెళ్లి బరాత్‌లో ఎవరు హాజరు కాకుండా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బంధువులతో, అల్లరిగా సాగాల్సిన పెళ్లి బరాత్ సందడి లేక వెలవెలబోయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘పాపం.. కోవిడ్ మహమ్మారి వల్ల ఇలా అయింది’.. ‘ఇప్పుడే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు బ్రో.. ‘ అసలు నీ స్నేహితులు ఎక్కడికి వెళ్లారు. కరోనాకు భయపడి వచ్చారా? లేదా?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
నితిన్ పెళ్లి వాయిదా..!
‘భీష్మ’ విజయంతో మంచి ఊపుమీద ఉన్నాడు యంగ్ హీరో నితిన్. అంతేకాకుండా తాను ప్రేమించిన యువతిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నందుకు మరోరకంగా ఆనందంగా ఉన్నాడు. అయితే నితిన్ ఆనందంపై కరోనా కన్నెర్ర జేసినట్లు తెలుస్తోంది. చాలాకాలంగా ప్రేమలో ఉన్న షాలినితో నితిన్ వివాహం వాయిదా పడిందనే వార్తలు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అన్నిదేశాలలో విస్తరిస్తుడటం.. ఆయా దేశాలు విదేశీయుల్ని తమ దేశానికి రాకుండా నిషేధం విధించడంతో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకోవాలని భావిస్తున్నారని సమాచారం. (చదవండి : ఘనంగా హీరో నితిన్ ఎంగేజ్మెంట్) ముందుఅనుకున్న ప్రకారం ఏప్రిల్ 16న దుబాయ్‌లో నితిన్, షాలినీల వివాహం జరగాల్సిందింది. పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేశారు. కొద్ది మంది బంధువులు, మిత్రుల మధ్య దుబాయ్‌లో ఏప్రిల్ 15వ తేదీన ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే ఏప్రిల్ 16వ తేదిన రిసెప్షన్ నిర్వహించాలని అనుకొన్నారు. అయితే దుబాయ్‌లో కూడా కరోనావైరస్ వ్యాప్తి చెందుతుండటంతో పెళ్లి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్‌లోనే నితిన్ వివాహం జరిపేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. కానీ దీనిపై నితిన్ , షాలినీ కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రకటన చేయదలేదు. -
నదిలో పడ్డ బస్సు.. రాజస్తాన్‌లో 24 మంది మృతి
కోటా: రాజస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 24 మంది మృతిచెందారు. మృతుల్లో 11 మంది మహిళలు సహా ముగ్గురు చిన్నారులు ఉన్నారు. రాజస్తాన్‌లోని బుండి జిల్లా కోటా–దౌసా జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సవాయి మాధోపూర్ నగరంలో జరగనున్న వివాహ వేడుకకు హాజరయ్యేందుకు 29 మంది బుధవారం ఉదయం కోటా నుంచి బస్సులో బయల్దేరారు. పాన్డీ గ్రామం సమీపంలోని బ్రిడ్జి వద్దకు రాగానే డ్రైవర్ బస్సును నియంత్రించలేకపోయాడు. ఈ బ్రిడ్జికి గోడ కానీ రెయిలింగ్ కానీ లేకపోవడంతో దాదాపు 20–25 అడుగుల ఎత్తు నుంచి బస్సు మెజ్ నదిలో పడిపోయింది. -
నృత్యం ఆపిందని ముఖంపై కాల్చాడు..!
చిత్రకూట్: వివాహ వేడుకలో నృత్యం ఆపిందనే కోపంతో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో మహిళా డ్యాన్సర్ తీవ్రంగా గాయపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని టిక్రా గ్రామంలో జరిగింది. నవంబర్ 30న టిక్రా గ్రామపెద్ద సుహిర్ సింగ్ పటేల్ కుమార్తె వివాహం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బరాత్‌లో నృత్యం ఆపేశారని కోపం తెచ్చుకున్న సుహిర్ సింగ్ బంధువు ఒకరు నాటు తుపాకీతో డ్యాన్సర్లపైకి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒక డ్యాన్సర్ తీవ్రంగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. -
పిచ్చి పీక్స్‌కి చేరడం అంటే ఇదే.. శవపేటికలో వధువు
ఏ జంట అయినా పెళ్లి వేడుకను ఘనంగా జరుపుకుంటుంది. కొంతమంది అయితే తమ వివాహ వేడుక అందరికి గుర్తిండిపోయేలా వింతగా జరుపుకుంటారు. అదెలాగంటే.. కొందరు వివాహ వేడుకకి గుర్రాలపై వస్తారు. మరికొందరు కొత్తగా రెడీ చేసిన కారులో వెరైటీగా ఎంట్రీ ఇస్తారు. ఇంకొందరు గాల్లో తేలియాడుతూ రింగులు మార్చుకుంటారు. కానీ ఓ వధువు మాత్రం ఇంకాస్త వెరైటీగా తన పెళ్లి వేడుకను జరుపుకుంది. గుర్రాలు, కార్లను కాదని ఏకంగా శవపేటికలో పెళ్లి మంటపానికి వచ్చింది. శవపేటిక లోపలి నుంచి లేచి మంటపంపైకి వెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ప్రకారం.. ఓ వధువు శవపేటికలో పడుకొని ఉంది. ఆ శవపేటికపై నల్లటి వస్త్రం కప్పి ఉంది. కళ్యాణ మంటపం దగ్గరకి రాగానే ఆ వస్త్రాన్ని తొలగించారు. అనంతరం శవపేటికలోనుంచి వధువు నవ్వుతూ లేచింది. అందరూ ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం వేదికపైకి వెళ్లి రింగులు మార్చుకున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ చావు కూడా మన జీవితంలో భాగమే.. అందుకే ఆమె శవపేటికలో వచ్చింది’ అని ఒకరంటే.. ‘పిచ్చి పీక్స్‌కి చేరడం అంటే ఇదే’ అంటూ మరొకరు కాంమెట్లు చేస్తున్నారు. కాగా, ఈ వింత ఘటన ఎక్కడ జరిగిందనే విషయం తెలియరాలేదు. -
పెళ్లి వేడుకకూ పరిమితులు
‘నా పెళ్లి.. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను’అంటే కుదరదంటోంది ఢిల్లీ ప్రభుత్వం. పెళ్లి ఎక్కడ చేసుకోవాలో, ఎంత మందిని పిలవాలో, అతిథులకు ఏం పెట్టాలో.. .మిగిలిన ఆహారాన్ని ఏం చెయ్యాలో... అన్ని తామే చెబుతామంటోంది. తమ మాట పాటించకపోతే భారీగా జరిమానా కూడా వసూలు చేస్తామని స్పష్టం చేస్తోంది. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం ఒక ముసాయిదా విధానాన్ని కూడా తయారు చేసింది. కోట్లు ఖర్చు పెట్టి అట్టహాసంగా, ఆడంబరంగా పెళ్లి తదితర వేడుకలు జరుపుకోవడం ఈ మధ్య మామూలైంది. వీటివల్ల యజమానులకు కలిగే సంతోషాన్ని పక్కన పెడితే బోలెడు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్లలో బోలెడు ఆహారం వృథా అవుతోందని, వేడుకల్లో వాడే వస్తువులు, పదార్థాల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని, ఇరుగుపొరుగులకు ఇబ్బందులు కలుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. దాంతో సుప్రీంకోర్టు రాజధానిలో వేడుకల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు రూపొందిం చాలని ఆదేశించింది. ఆ మేరకు ఢిల్లీ సర్కారు ఈ ముసాయిదాను తయారు చేసింది. ‘పాలసీ ఫర్ హోల్డింగ్ సోషల్ ఫంక్షన్స్ ఇన్ హోటల్స్, మోటల్స్ అండ్ లో డెన్సిటీ రెసిడెన్షియల్ ఏరియా (ఎల్డీఆర్ఏ) ఇన్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ’పేరుతో రూపొందించిన ఈ ముసాయిదాను సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆమోదించింది కూడా. దాని ప్రకారం.. ► పెళ్లిళ్లు, వేడుకల్లో మిగిలిపోయే, వృథా అయ్యే ఆహారాన్ని ఏదైనా స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో)ద్వారా అన్నార్థులకు పంచిపెట్టాలి. ఇందుకోసం కేటరర్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల యాజమాన్యాలు ఎన్జీవోల దగ్గర తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ఆహారాన్ని ఎలాపడితే అలా కాకుండా చక్కగా, పార్సిళ్లలోనో, డబ్బాల్లోనో ఎన్జీవోలకు అందజేయాలి. ► హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల యాజమాన్యాలు, కేటరర్లు,నిర్వాహకులు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఆహార భద్రత విభాగం నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి.అలాంటి వారే వేడుకలకు భోజనాలు తయారు చేయడం, సరఫరా చేయడం వంటివి చేయాలి. ► వేడుక నిర్వహించే ప్రాంతం విస్తీర్ణాన్ని బట్టి అతిథులను పిలవాలి. ఎక్కడ ఎంత మందిని పిలవాలన్నది సంబంధిత పట్టణ స్థానిక సంస్థ నిర్ణయిస్తుంది. ఆ పరిమితికి మించి అతిథులను పిలవడానికి వీల్లేదు. ► ఎంత మంది అతిథులను పిలుస్తామో వారికి సరిపడేంత ఆహారం మాత్రమే సిద్ధం చేయాలి. పిలిచిన వాళ్లంతా రాకపోవడం లేదా ఇతరేతర కారణాల వల్ల ఆహారం మిగిలితే వేడుక పూర్తయిన వెంటనే మిగులు ఆహారాన్ని వెంటనే ఫంక్షన్ హాలు నుంచి తొలగించాలి. ఆ బాధ్యత హాలు యాజమాన్యానిదే. ► ఫంక్షన్ హాలులో పార్కింగ్ ప్రదేశంలో ఎన్ని కార్లు నిలపవచ్చో ఆ సంఖ్యను నాలుగుతో గుణిస్తే ఎంత వస్తుందో అంత మంది అతిథులను మాత్రమే ఆహ్వానించాలి. అంటే 20 కార్లు పట్టేంత స్థలం ఉంటే 80 మందినే పిలవాలన్నమాట. లేదా హాలు విస్తీర్ణాన్ని 1.5 చదరపు మీటర్లతో భాగిస్తే ఎంత వస్తుందో అంత మందినే పిలవాలి. ఈ రెండింటిలో ఏది తక్కువయితే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ► రెండున్నర అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో కట్టిన హాళ్లలోనే ఇలాంటి వేడుకలు నిర్వహించుకోవాలి. ఈ హాళ్లు రోడ్డు చివర(డెడ్ ఎండ్) ఉండకూడదు. ఈ భవనాలకు ప్రధాన రహదారితో కలుపుతూ 60 అడుగుల రోడ్డు సదుపాయం ఉండాలి. ► పర్యావరణానికి ఏ విధంగానూ ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేడుకల కోసం పాక్షిక శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. హాలు బయట వాహనాలు నిలపకూడదు. నీటిని పొదుపుగా వాడాలి.చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేయొద్దు. పెద్ద శబ్దాలు చేయకూడదు. ► ఈ నిబంధనలను పాటించాలి. లేనిపక్షంలో 15 లక్షల వరకు జరిమానా కట్టాలి. మొత్తం జరిమానాను కేవలం హాళ్ల యాజమాన్యం కట్టాలి. వేడుకలు జరుపుకునే వారికి సంబంధం లేదు. -
సెల్‌కు సెలవు
గిఫ్ట్స్ తీసుకురాక పోయినా పర్లేదు కానీ తమ పెళ్లి వేడుకకు మొబైల్స్‌ని తీసుకురావద్దని గెస్ట్స్‌కు కండీషన్స్ పెడుతున్నారట కాబోయే దంపతులు రణ్వీర్ సింగ్ అండ్ దీపికా పదుకోన్. ఎందుకంటే పెళ్లికి సంబంధించి కాస్త ప్రైవసీ కావాలని చెబుతున్నారట. విరాట్ కోహ్లీ– అనుష్కాశర్మ, ఆనంద్ అహూజా– సోనమ్ కపూర్ల పెళ్లిళ్ల తర్వాత బీటౌన్‌లో జరగబోయే బిగ్ మ్యారేజ్ దీపికా–రణ్వీర్లదేనని బీటౌన్ టాక్. వీరిద్దరి వివాహం ఇటలీలో నవంబర్ 20న జరగనుందట. సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యే ఈ వేడుకకు ఆల్రెడీ ఆహ్వానాలను అందించే పనిలో ఉన్నారు దీపికా. అలాగే పెళ్లి వేడుకకు మొబైల్స్ తీసుకు రావద్దని చెబుతున్నారట. అంటే పెళ్లికి వెళ్లిన అతిథులు వేడుకలో ఉండే ఆ కాసేపు సెల్‌ఫోన్స్‌కు సెలవు ఇవ్వాల్సిందే. అలాగే పెళ్లి వేడుకలో సెల్ఫీలు కూడా బంద్ అని ప్రత్యేకించి చెప్పకర్లేదు. ఈ మధ్య లుక్స్ రివీల్ అవుతాయని షూటింగ్ స్పాట్స్‌కు సెల్‌ఫోన్స్‌ను అనుమతించడం లేదు. ఇప్పుడు పెళ్లికి కూడా సెల్స్ఫోన్స్ బంద్ అంటే సోషల్ మీడియా ఔత్సాహికరాయుళ్ల ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లే. -
అంగరంగ వైభవంగా..
బెర్క్‌షైర్: బ్రిటన్ రాజకుమారుడు హ్యారీ(33), అమెరికా నటి మేఘన్ మార్కల్(36)ల వివాహం శనివారం ఘనంగా జరిగింది. బ్రిటన్‌లోని బెర్క్‌షైర్ కౌంటీ విండ్సర్లోని సెయింట్ జార్జి చర్చిలో జరిగిన ఈ వేడుకకు సుమారు 600 మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. మరో 2,640 మంది విండ్సర్ మైదానం నుంచి, లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అంతకుముందు, సంప్రదాయ పద్ధతిలో మార్కల్‌ను హ్యారీ తండ్రి చార్లెస్ చర్చిలోకి తీసుకొచ్చారు. అనారోగ్యంతో మార్కల్ తండ్రి రాలేకపోవడంతో చార్లెస్ ఆమెకు తండ్రి స్థానంలో నిలిచారు. మార్కల్ కుటుంబం నుంచి ఆమె తల్లి డోరియా రాగ్లాండ్ హాజరయ్యారు. హ్యారీ అన్న విలియం కూతురు చార్లెట్ తోడి పెళ్లికూతురిలా వెంట వచ్చింది. విలియం కొడుకు జార్జి, కూతురు చార్లెట్లు వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రత్యేక ఆకర్షణగా మార్కల్ గౌను.. బ్రిటిష్ డిజైనర్ క్లారె వైట్ కెల్లర్ రూపొందించిన తెలుపు రంగు పట్టు గౌనులో మార్కల్ మెరిసిపోయారు. ఆ డ్రెస్‌పై తామరతో పాటు 53 దేశాలకు చెందిన పుష్పాల చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ ప్రమాణాల బదులు 2000 నాటి మ్యారేజ్ సర్వీసును పాటించారు. కష్టమైనా, సుఖమైనా, ఆరోగ్యఅనారోగ్యాల్లో కడదాకా ఒకరికొకరు తోడు ఉంటామని ప్రమాణం చేశారు. మార్కల్‌కు హ్యారీ బంగారు ఉంగరం తొడగ్గా, హ్యారీకి మార్కల్ ప్లాటినం ఉంగరం తొడిగారు. వివాహం అనంతరం దంపతులు గుర్రపు బగ్గీలో విండ్సర్ ప్రాంతమంతా కలియతిరిగారు. వారిని చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో వీధుల్లో నిలబడ్డారు. కొత్త జంట ప్రిన్స్ హ్యారీ–మేఘన్ మార్కల్‌కు రాణి ఎలిజబెత్ 2 సస్సెక్స్ డ్యూక్, సస్సెక్స్ డచెస్ బిరుదులు ప్రదానం చేశారు. హాజరైన ప్రియాంక చోప్రా.. వివాహానికి హాజరైన ప్రముఖుల్లో భారత నటి ప్రియాంక చోప్రా ఉన్నారు. హాలీవుడ్ నటుడు జార్జి క్లూనీ, సాకర్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్ తదితరులు కూడా అతిథుల జాబితాలో ఉన్నారు. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ మైనా మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుహానీ జలోటా, తన ఫౌండేషన్ సభ్యులతో హాజరయ్యారు. వివాహం తర్వాత గుర్రపు బగ్గీలో వెళుతున్న హ్యారీ దంపతులు వివాహానికి హాజరైన సుహానీ జలోటా(ఎడమ), ఫౌండేషన్ సభ్యులు, ప్రియాంక చోప్రా వివాహ వేదిక వద్దకు వస్తున్న హ్యారీ, మార్కల్లను చూసేందుకు బారులుతీరిన ప్రజలు -
తేజ్ ప్రతాప్ పెళ్లిలో రసాభాస
పట్నా: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట పెళ్లి వేడుకలో రసాభాస చోటుచేసుకుంది. లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ వివాహానికి హాజరైన కొందరు దుండగులు చేతి వాటం ప్రదర్శించారు. తినే ప్లేట్లు, ఆహార పదార్థాలు.. ఇలా కంటికి కనిపించిన వస్తువునల్లా దొంగిలించుకుపోయారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. శనివారం రాత్రి పట్నాలోని వెటర్నరీ కాలేజీ గ్రౌండ్లో లాలూ పెద్ద కొడుకు తేజ్- ఆర్జేడీ సీనియర్ నేత చంద్రిక రాయ్ కుమార్తె ఐశ్వర్య రాయ్ వివాహ వేడుక జరిగిన విషయం తెలిసిందే. వధువరులు దండలు మార్చుకుంటున్న సమయంలో ఆర్జేడీ కార్యకర్తలమంటూ కొందరు.. వీఐపీ, మీడియా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక హాలులోకి లోపలికి ప్రవేశించారు. టపాసులతోపాటు, ప్లేట్లు, భోజనం, అతిథుల కోసం ప్యాకింగ్ చేసిన గిఫ్ట్‌లను పట్టుకుని పారిపోయారు. వారిని గమనించిన కార్యకర్తలు వెంబడించి అడ్డుకునే యత్నం చేశారు. కానీ, అప్పటికే వారు చాలా దూరం వెళ్లిపోయారు. ఈ పరిణామాల నడుమ తమపై దాడి జరిగిందని, కెమెరాలు ధ్వంసం అయ్యాయని కొందరు మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. చివరకు ఆర్జేడీ నేతల జోక్యంతో అంతా శాంతించారు. నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ఇది జరిగినట్లు ఆర్జేడీ నేత ఒకరు తెలిపారు. 200 స్టాళ్ల ద్వారా సుమారు 7 వేల మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేయగా.. ఊహించని రీతిలో జనాలు హాజరయ్యారు. మరోవైపు భోజనాల దగ్గర తొక్కిసలాట చోటు చేసుకోగా.. ఇంకోవైపు ప్రాంగణమంతా చెత్త చెదారంతో నిండిపోయింది. బాహుబలి తరహా సెట్స్ .. భారీ వ్యయంతో ఈ వివాహవేడుకను గ్రాండ్‌గా నిర్వహించాలని యత్నించినప్పటికీ చివరకు గందరగోళ పరిస్థితుల్లో వేడుక ముగిసింది. లాలూకి నితీశ్ కౌగిలింత.. కూటమితో విడిపోయాక తొలిసారి బిహార్ సీఎం నితీశ్ కుమార్.. లాలూలు ఒకే వేదికపై సందడి చేశారు. తేజ్ ప్రతాప్ వివాహానికి హాజరైన నితీశ్.. లాలూను ఆప్యాయ ఆలింగనం చేసుకున్నారు. వీరిద్దరు కాసేపు ముచ్చటించుకోగా.. నవ దంపతులు తేజ్ ప్రతాప్-ఐశ్వర్యలను నితీశ్ ఆశీర్వదించారు. బిహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. -
సర్దార్జీ పెళ్లా మజాకా!
పెళ్లంటే? పందిళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, బ్యాండ్ బాజా బారాత్‌లు.. ఆగండాగండి.. ఇది మీరనుకునే మామూలు పెళ్లి కాదు. సర్దార్జీ షాదీ! తాళి, తలంబ్రాల మాటేమోగానీ, బారాత్ (ఊరేగింపు)లో ఈయన సృష్టించిన అలజడి (నిజానికి సందడి అనాలేమో) అంతా ఇంతాకాదు! ఇంతకీ సర్దార్జీ ఏం చేశారంటే.. సాధారంణంగా ఏ గుర్రంపైనో లేదంటే టాప్‌లెస్ కారులోనే ఊరేగింపుగా వస్తారు పెళ్లికొడుకులు. ఈయన మాత్రం బ్యాట్‌మొబైల్‌లో వచ్చాడు. బ్యాట్ మొబైల్ అంటే ఏమిటో తెలుసుగా.. కామిక్ హీరో బ్యాట్మన్ వాహనం! మరి ఆ వాహనాన్ని మామూలు మనుషులు నడపలేరు. కాబట్టి.. బ్యాట్మన్ చేతే వాహనాన్ని డ్రైవ్ చేయించాడు సర్దార్జీ! వరుడి బంటు పాత్రలో ఒద్దికగా ఒదిగిపోయిన బ్యాట్మన్.. పెళ్లి కూతురి ఇల్లు రాగానే 'మహారాజరాజశ్రీ సర్దార్జీ గారు వేంచేశారహో..' అంటూ పెద్ద పెట్టున అరిచి సందడిలో మునిగిపోయిన పెళ్లింటి వారిని అలర్ట్ చేశాడు. కార్ డోర్ తెరిచి.. బ్లింగ్ అవుతున్న సింగ్ గారిని పెళ్లింటిలోకి పంపేశాడు. ఏ ఊళ్లో జరిగిందీ, ఆ సర్దార్జీ పేరు ఇతర వివరాలు లేకుండా 'అర్బన్ సర్దార్జీ' ఫేస్బుక్ పేజ్ లో అప్ లోడ్ అయిన ఈ బారాత్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.