Naga Shaurya Is Going To Marry Anusha On Nov 20th, Deets Inside - Sakshi
Sakshi News home page

Naga Shaurya Marriage: పెళ్లి పీటలెక్కబోతున్న నాగశౌర్య.. వధువు ఎవరంటే..?

Published Thu, Nov 10 2022 3:02 PM | Last Updated on Thu, Nov 10 2022 3:40 PM

Naga Shaurya Is Going To Get Married - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ నెల 20న బెంగళూరులో అనూష అనే యువతిని వివాహం చేసుకోబోతున్నాడు.  నవంబర్‌ 19న మెహందీ ఫంక్షన్‌ ఉండటంతో ఇప్పటికే నాగశౌర్య ఇంట పెళ్లి సందడి మొదలైంది.  శుభలేఖలు కూడా పంచుతున్నారు. పెళ్ళికి భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా నాగశౌర్య ఫ్యామిలీ ఆహ్వానితులను కోరుతోంది. నవంబర్‌ 20న ఉదయం 11.25 గంటలకి అనుష మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. నాగ శౌర్య వివాహం జరగబోతున్న సంగతి బయటికి వచ్చింది కానీ అది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిరించిన వివాహమా? అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. పెళ్లి విషయం తెలియడంతో నాగశౌర్యకు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల నాగశౌర్య తన 24వ సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాకు అరుణాచలం దర్శకత్వం వహిస్తున్నాడు.  ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమాని వైష్ణవి ఫిలిమ్స్ మీద శ్రీనివాసరావు, విజయ్ కుమార్, అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement