రాబాత్: మొరాకోలో ప్యాసింజర్లతో వెళ్తోన్న ఓ బస్సు ప్రమాదకరమైన మలుపు వద్ద వేగంగా వెళ్లడంతో బోల్తా కొట్టింది. ప్రమాదంలో 24 మందిమృతి చెందినట్లు తెలిపింది మొరాకో వార్తా సంస్థ(MAP ).
సెంట్రల్ మొరాకోలోని అజిలాల్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డెమ్నాట్‌లోని వీక్లీ మార్కెట్‌కు వెళ్తోన్న ఓ బస్సు రోడ్డు మలుపు వద్ద వేగంగా వెళ్లడంతో ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 24 ముంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గురించిన సమాచారం అందగానే రాయల్ జెండర్మీర్ పౌర రక్షణ సంస్థ వారు సహాయక చర్యలు చేపట్టారు.
దర్యాప్తు బృందం సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉంటాయా అని విచారణ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మొరాకోలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఏడాదికి రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించేవారు సంఖ్య సగటున 3500గా ఉందని, గతేడాది 3200 మంది చనిపోయారని అధికారులు చెబుతున్నారు.
ఇక ఈ ప్రాంతంలో కూడా తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయని సరిగ్గా గత ఏడాది ఆగస్టులో తూర్పు కాసాబ్లాంకాలో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకోగా ఆ ప్రమాదంలో 25 మంది మృతి చెందారని అంతకు ముందు 2015లో యువ అథ్లెట్లు ప్రయాణిస్తున్న ఒక బస్సును సెమీ ట్రైలర్ ట్రక్కు ఢీకొట్టడంతో 33 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: చైనాలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు..
Comments
Please login to add a commentAdd a comment