గణపవరంలో లారీ బీభత్సం: నలుగురి దుర్మరణం | lorry runs into house, four dead | Sakshi
Sakshi News home page

గణపవరంలో లారీ బీభత్సం: నలుగురి దుర్మరణం

Published Sat, Nov 7 2015 7:55 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

గణపవరంలో లారీ బీభత్సం: నలుగురి దుర్మరణం - Sakshi

గణపవరంలో లారీ బీభత్సం: నలుగురి దుర్మరణం

నాదెండ్ల: గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో శనివారం తెల్లవారుజామున ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన లారీ రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. గ్రామంలోగల చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి పై చోటుచేసుకుంది.

ఒంగోలు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ గణపవరం వద్దకు రాగానే రోడ్డు మలుపు దగ్గర ఒక్కసారిగా పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో దుకాణంలో ఉన్న బి. భాస్కర్ రావు(70), ఆయన సతీమణి పుణ్యవతి(60) తోపాటు అక్కడే టీ తాగుతున్న మరో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. లారీ డ్రైవర్ నిద్రపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement