ganapavaram
-
కడుపు నింపుతున్న.. 'దోసెడు బియ్యం'
నెలలో మూడో మంగళవారం వచ్చిoదంటే..భుజాన పుస్తకాల బ్యాగే కాదు.. ప్రతి విద్యార్థి చేతిలోని బాక్సు నిండా ఇంటి వద్ద నుంచి బియ్యం నింపుకొని కాలేజీకి తెస్తారు. కళాశాలలో ఏర్పాటు చేసిన డ్రమ్‌లో వాటిని పోస్తారు.వచ్చిన బియ్యం మొత్తాన్ని మూడు నుంచి ఐదు కేజీల చొప్పున ప్యాకెట్లుగా చేసి వాటిని పేదలకు అందజేసి వారి ఆకలిని తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలోని శ్రీ చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు. హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ (గుప్పెడు బియ్యం) పేరిట రెండున్నరేళ్లుగా నిరాటంకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. – సాక్షి, భీమవరంవిద్యార్థుల్లో మానవత్వం పెంపుదల.. కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు ఉండగా వాటిలో 300 మంది విద్యార్థులు విద్యాభ్యాసం సాగిస్తున్నారు. విద్యతో పాటు ఎన్ఎస్ఎస్, రెడ్‌క్రాస్ సంబంధిత సేవా కార్యక్రమాల నిర్వహణకు ఇక్కడి అధ్యాపక బృందం, విద్యార్థులు ప్రాధాన్యమిస్తుంటారు. అందులో భాగంగానే 2022లో ‘దోసెడు బియ్యం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనం తీసుకునే ఆహారంలో కొంచెం భాగం ఇతరులకు ఇవ్వడం, విద్యార్థుల్లో మానవత్వాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రతి విద్యార్థీ నెలలో నిర్ణీత రోజున తమ ఇంటి వద్ద నుంచి గుప్పెడు బియ్యాన్ని తెచ్చి కళాశాలలో ఏర్పాటు చేసిన డ్రమ్‌లో వేస్తే.. సేకరించిన మొత్తాన్ని అవసరమైన నిరుపేదలకు అందించాలి. ప్రతినెలా మూడో మంగళవారం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏదైనా నెలలో ఆ రోజు సెలవు వస్తే ముందురోజున లేదా మరుసటి రోజున అమలు చేస్తున్నారు. నెలకు దాదాపు 100 నుంచి 120 కేజీల వరకు బియ్యం వస్తుండగా, వాటిని మూడు నుంచి ఐదు కేజీల వరకు బ్యాగులుగా ప్యాక్ చేసి గ్రామంలోని మార్కెట్ తదితర ప్రాంతాల్లోని నిరుపేదలకు పంపిణీ చేస్తున్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.నిర్మలకుమారి నేతృత్వంలో వైస్ ప్రిన్సిపల్ పి.మధురాజు, కామర్స్, బోటనీ లెక్చరర్లు బి.రాణిదుర్గ, డాక్టర్ సీహెచ్ చైతన్యల పర్యవేక్షణలో రెండున్నరేళ్లుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.మూడో మంగళవారం వచ్చిందంటే చాలు తమకంటే ముందే తమ పేరెంట్స్ బాక్సులో బియ్యం పోసి సిద్ధం చేయడం ద్వారా ఇప్పటికే తమ కళాశాలలో చేస్తున్న ఈ సేవలో భాగస్వాములయ్యారని విద్యార్థులు చెబుతున్నారు. మిగిలినచోట్ల విద్యార్థులు ప్రయత్నిస్తే ఒక పెద్ద సేవగా మారుతుందని వారు ఆశిస్తున్నారు. ఆనందంగా అనిపిస్తుంది ప్రతినెలా విద్యార్థులమంతా కలసి బియ్యం తెచ్చి పేదలకు పంచడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఈ హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ ప్రోగ్రాం మరింత విస్తరించి ప్రతి ఒక్కరూ ఇతరులకు పంచే సేవ చేయటంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. – పి.హర్షిత, బీకాం సెకండియర్ బియ్యం ఇచ్చి పంపుతారు నెలలో మూడో మంగళవారం వచ్చి0దంటే చాలు కాలేజీకి ఈరోజు బియ్యం తీసుకువెళ్లాలి ఇవిగో అంటూ బాక్సులో పోసి పేరెంట్స్ పంపిస్తుంటారు. మా స్టూడెంట్సే కాదు మా పేరెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. – కె.జాయ్, బీకాం కంప్యూటర్స్, సెకండియర్మార్పుకోసం చిన్న ప్రయత్నం ఇది కేవలం ఒక సామాజిక సేవా కార్యక్రమం కాదు. పేదరికాన్ని తగ్గించేందుకు, మానవత్వాన్ని పెంచేందుకు, సమాజంలో మార్పు కోసం మా విద్యార్థులు చేస్తున్న చిన్న ప్రయత్నం. ఈ కార్యక్రమం నిర్వహించే బాధ్యత నాకు అప్పగించడచాలా ఆనందంగా ఉంది. – బి.రాణి దుర్గ, కామర్స్ లెక్చరర్ పంచే గుణాన్ని అలవాటు చేసేందుకు తమకు ఉన్న దానిలో ఇతరులకు కొంచెం పంచే గుణాన్ని విద్యార్థులకు అలవాటు చేయడం హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ ముఖ్య ఉద్దేశం. మా కళాశాలలో ప్రిన్సిపల్ నిర్మలకుమారి మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న అత్యుత్తమ సేవా కార్యక్రమాల్లో ఇదీ ఒకటి. – డాక్టర్ సీహెచ్ చైతన్య, బోటనీ లెక్చరర్ విద్యతో పాటు విలువలు మా కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారిలో మంచి విలువలు పెంపొందించాలన్నదే మా లక్ష్యం. పేదవారి ఆకలిని తీర్చడంలో ఉండే సంతృప్తిని వారు ఆనందిస్తున్నారు. ప్రతినెలా అందరూ ఎంతో ఉత్సాహంగా హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. – డాక్టర్ పి.నిర్మలాకుమారి, ప్రిన్సిపల్ -
సీఎం జగన్ ను అడుగడుగునా అపూర్వ స్వాగతం పలుకుతున్న జనం
-
సీఎం జగన్ హామీ.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు
సాక్షి, గణపవరం/ భీమవరం(పశ్చిమ గోదావరి): గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలోకి చేరుస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గణపవరం మండలాన్ని ఏలూరు రెవెన్యూ డివిజన్ నుంచి భీమవరం రెవెన్యూ డివిజన్‌లోకి మారుస్తూ రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ పేరుమీద గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై ఏమైనా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే 30 రోజుల్లోపు కలెక్టర్‌కు సమర్పించాలని సూచించారు. ఈ ఏడాది మే నెలలో గణపవరంలో జరిగిన రైతు భరోసా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక నేతల విజ్ఞప్తి మేరకు గణపవరం మండలాన్ని భీమవరం రెవెన్యూ డివిజన్లో కలిపేందుకు సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో కలుపుతామని సభాముఖంగా ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. 20 మండలాలతో జిల్లా జిల్లాల పునర్విభజనతో పశ్చిమగోదావరి జిల్లా 19 మండలాలు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, ఆకివీడు మున్సిపాలిటీలతో ఏర్పడింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు రెవెన్యూ డివిజన్లతో 2,178 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 17.80 లక్షల జనాభా కలిగి ఉంది. ఇదిలా ఉండగా ఏలూరు జిల్లాలోని గణపవరం మండలాన్ని పశ్చిమలో విలీనం చేయడంతో మండలాల సంఖ్య 20కి చేరనుంది. అలాగే 100 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం, 65 వేల మంది జనాభా పెరగనుంది. -
వివాహానికి వెళ్లొస్తూ మృత్యు ఒడికి
గణపవరం: పంట కాల్వలో కారు బోల్తా కొట్టిన ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మహిళలు మృతి చెందగా మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. ఈ విషాద ఘటన ఏలూరు జిల్లా గణపవరం మండలం వల్లూరు – అర్ధవరం గ్రామాల మధ్య సోమవారం రాత్రి జరిగింది. మృతులు భీమవరంలోని కొత్త బస్టాండ్ ప్రాంతానికి చెందినవారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భీమవరం కొత్త బస్టాండు సమీపంలో నివాసం ఉంటున్న మహబూబ్ బాషా బంధువుల వివాహం ఏలూరులో జరిగింది. దీనికి అమర్జహాన్ (50), మహ్మద్ సంషాద్ (55), ఫాతిమా జహర్బీ (45), అమర్జహాన్ కుమారుడు కమాల్ బాషా, ఎండీ రహీమా కారులో బయలుదేరి వెళ్లారు. ఫంక్షన్ పూర్తి అయ్యాక తాడేపల్లిగూడెంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి రాత్రి ఎనిమిది గంటల సమయంలో కారులో భీమవరం బయలుదేరారు. కారు వల్లూరు వద్ద రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి.. పంట కాల్వలోకి దూసుకుపోయింది. స్థానికులు వెంటనే కారులో ఉన్నవారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నీటిలో సగం వరకు కారు మునిగిపోవడంతో కారులో ఉన్న అమర్జహాన్, మహ్మద్ సంషాద్ (55), ఫాతిమా జహర్బీ (45) అనే ముగ్గురు మహిళలు ఊపిరాడక కారులోనే ప్రాణాలు విడిచారు. కారు నడుపుతున్న అమర్జహాన్ కుమారుడు కమాల్ బాషా, ఎండీ రహీమాను స్థానికులు రక్షించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రైతుల మేలుకోరి.. ముందడుగు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు వీలుగా విద్యుత్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి, వారిలో ఉన్న అపోహలు తొలగించే ప్రయత్నం చేశారు. ప్రయోగాత్మకంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం గణపవరం గ్రామాన్ని ఎంచుకొని, వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లను బిగించి పరిశీలించారు. బెంగళూరులోని ప్రయోగశాల నుంచి వీటిని పరీక్షించారు. సానుకూల ఫలితాలు రావడంతో ఉమ్మడి జిల్లాలోని 1,08,859 వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించేందుకు వీలుగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి గానూ అర్హత పొందిన ఏజెన్సీలు మీటర్లను దశల వారీగా సరఫరా చేయనున్నాయి. సంబంధిత ఏజెన్సీ బిల్లులు తయారు చేసి డిస్కంలకు అందజేయనున్నాయి. వీటి ఆధారంగా ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. ప్రస్తుతం నగదు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు వీలుగా బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. దీంతో పాటు రైతుల నుంచి డెబిట్ మ్యాన్‌డేట్ ఫారాలను సేకరిస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వం జమ చేసే బిల్లు మొత్తం సంబంధిత డిస్కంకు బదిలీ అయ్యేందుకు ఆమోదం తెలిపినట్లవుతుంది. బ్యాంకు ఖాతాల సేకరణ ఇలా.. విజయవాడ సర్కిల్ పరిధిలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 1,08,859 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటీకి సంబంధించి డిస్కంల వద్ద ఉన్న రికార్డుల వివరాలను పోల్చుకొని, అప్డేట్ చేస్తున్నారు. అప్డేట్ కాని చోట్ల రికార్డుల్లో మార్పులు చేస్తున్నారు. పాస్ పుస్తకం, భూ యజమాన్య హక్కు పత్రం ఆధారంగా కనెక్షన్లను, ప్రస్తుతం ఉన్న హక్కుదారుడి పేరిట నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి డిస్కంల వద్ద 55,610 ఖాతాలుండగా, తాజాగా మరో 11,415 ఖాతాలను రైతుల ద్వారా ఓపెన్ చేయించారు. మిగిలిన 41,834 వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి, రైతులతో ఖాతాలు తెరిచే పనిలో విద్యుత్ సిబ్బంది నిమగ్నం అయ్యింది. ప్రధానంగా వ్యవసాయ కనెక్షన్లు అధికంగా ఉన్న నూజివీడు, విజయవాడ రూరల్, ఉయ్యూరు డివిజన్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అపోహలను తొలగిస్తున్నాం వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లను బిగించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ విధానంపై రైతుల్లో నెలకొన్న అపొహలను తొలగిస్తున్నాం. వారి ఖాతాల్లో బిల్లుకు సంబంధించిన నగదును జమ చేసేందుకు వీలుగా బ్యాంకు ఖాతాలను తెరిపిస్తున్నాం. రైతుల నుంచి డెబిట్ మ్యాన్‌డేట్ ఫారాలను సేకరిస్తున్నాం. – శివప్రసాద్‌రెడ్డి, ఎస్ఈ, విజయవాడ సర్కిల్ -
మారనున్న ‘పశ్చిమ’ ముఖ చిత్రం
సాక్షి, భీమవరం: భీమవరం కేంద్రంగా ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లాలో గణపవరం మండలాన్ని విలీనం చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో ముఖచిత్రం మారనుంది. ఇప్పటివరకూ ఏలూరు జిల్లాలో ఉన్న గణపవరాన్ని ‘పశ్చిమ’లో కలుపుతామని ఇటీవల గణపవరంలో జరిగిన రైతు భరోసా సభలో ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గణపవరానికి భీమవరం అత్యంత సమీపంలో ఉండటంతో ‘పశ్చి మ’లో కలపాలని ఈ ప్రాంత ప్రజలు వినతులు సమర్పించారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని గణపవరం మండలం ఆక్వా సాగులో పేర్గాంచింది. ప్రస్తుతమున్న ఏలూరు జిల్లా కేంద్రం సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ‘పశ్చిమ’లో కలపాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా.. ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. 2,278 చ.కి.మీ విస్తీర్ణంతో.. భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా 19 మండలాలు, ఆరు మున్సిపాలిటీలతో ఏర్పడింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు రెవెన్యూ డివిజన్లతో 2,178 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 17.80 లక్షల జనాభా కలిగి ఉంది. గణపవరాన్ని విలీనం చేస్తే మండలాల సంఖ్య 20కి పెరుగుతాయి. మరో 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 65 వేల మంది జనాభా పెరగనుంది. -
నాడు తండ్రి.. నేడు తనయుడు: దశాబ్దంన్నర తరువాత అదే ప్రదేశంలో..
సాక్షి, ఏలూరు(గణపవరం): నాడు తండ్రి వైఎస్సార్, నేడు తనయుడు వైఎస్ జగన్ అడిగిందే తడవుగా ఉంగుటూరు నియోజకవర్గంపై వరాల జల్లులు కురిపించారు. ఇద్దరూ గణపవరం పర్యటనకు వచ్చి సభాముఖంగా వరాలు ఇచ్చారు. పైగా ఇద్దరి సభా వేదిక ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం విశేషం. 2007లో తొలిసారి గణపవరం వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గణవపరం ప్రభుత్వ డిగ్రీ కాలేజి ఆవరణలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. గణపవరం డిగ్రీ కాలేజి అభివృద్ధికి రూ. కోటి మంజూరు చేశారు. గణపవరం మండలంతోపాటు నిడదవోలు, తణుకు, తాడేపల్లిగూడెం, అత్తిలి మండలాలకు ప్రధాన సమస్యగా ఉన్న ఎర్రకాల్వ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కాల్వలో పూడిక తీత, ఇరువైపులా గట్లు పటిష్టం చేసి ఒకవైపు బీటీ రోడ్డు, మరోవైపు కంకర రోడ్డు నిర్మించడం, ఆయా గ్రామాల వద్ద ఐదేసి కోట్ల రూపాయలతో వంతెనల నిర్మాణం చేపట్టారు. గణపవరంలో దాదాపు వెయ్యి ఇళ్లతో వైఎస్సార్ ఇందిరమ్మ కాలనీ నిర్మాణం ప్రారంభించి, వాటిని మరోసారి వచ్చి ప్రారంభోత్సవం చేశారు. చదవండి: (జనాన్ని బాదింది మీరు కాదా..బాబూ!) దశాబ్దంన్నర తరువాత అదే ప్రదేశంలో సభ ఈనెల 16న గణపవరం వచ్చిన వైఎస్సార్ తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదే ప్రదేశంలో ఏర్పాటుచేసిన సభావేదిక నుంచి ఉంగుటూరు నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా ఈప్రాంతంలో ఆక్వా రైతాంగానికి మేలు చేసేలా యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకే పదెకరాల రైతులకు విస్తరిస్తున్నట్లు ప్రకటించి ఆక్వా రంగానికి ఊపిరి పోశారు. ఎమ్మెల్యే వాసుబాబు ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సబ్సిడీ విద్యుత్ పరిమితి ఐదెకరాల నుంచి పదెకరాలకు విస్తరించి ఎక్కువ మంది ఆక్వా రైతులకు మేలు చేయాలని కోరగా తక్షణమే ఆమోదిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. దశాబ్దాలుగా శిథిలావస్థలో ఉన్న గణపవరం బొబ్బిలి వంతెనతోపాటు ఏలూ రు కాల్వపై మరో మూడు వంతెనల నిర్మాణానికి అనుమతించారు. గణపవరం మండలాన్ని భీమవరం డివిజన్‌లోకి మార్చడం, నియోజకవర్గంలో ఆరు 33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటు, కొల్లేరు రీసర్వే, కొల్లేరులో కాంటూర్ నిర్మాణం, కొల్లేరుకు చెందిన 4 గ్రామాల్లో ఏటా తలెత్తే వేసవి దాహార్తిని తీర్చడానికి సమ్మర్‌స్టోరేజి ట్యాంకుల ఏర్పాటు తదితర వాసుబాబు కోరినవన్నీ మంజూరు చేస్తున్నట్లు సభాముఖంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. వరాల జల్లుతో ఈ ప్రాంతంపై వైఎస్ కుటుంబానికి ఉన్న ప్రత్యేక అభినాన్ని చాటుకున్నారు. -
గతానికి, ఇప్పటికీ ఉన్న తేడాను రైతులు గమనించాలి: సీఎం జగన్
-
చంద్రబాబును దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదు: సీఎం జగన్
సాక్షి, ఏలూరు (గణపవరం): చంద్రబాబు హయాంలో రైతులను మోసం చేస్తే దుష్టచతుష్టయం ఎందుకు ప్రశ్నించలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. ఇక ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా చంద్రబాబుపై దత్తపుత్రుడు విపరీతమై ప్రేమ చూపించాడు. నాడు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని సీఎం మండిపడ్డారు. ఏలూరు జిల్లా గణపవరంలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, రాజకీయాల గురించి ఆలోచన చేయనని.. ప్రజలకు మంచి చేయాలన్నది తన తపన’’ అని సీఎం అన్నారు. ‘‘ఈ మధ్య రైతుల పరామర్శ యాత్ర అంటూ దత్తపుత్రుడు బయల్దేరాడు. పట్టాదారు పాసు పుస్తకం ఉండి ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం అందని ఒక్కరిని కూడా దత్తపుత్రుడు చూపించలేకపోయాడు. ఇవాళ వీరంతా మొసలి కన్నీరు కారుస్తున్నారు. మన ప్రభుత్వంలో ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. ఓటు వేసినా వేయకపోయినా మంచి చేసే పని జరుగుతోంది. తనకు చంద్రబాబుకు ఉన్న తేడా అదే’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వ్యవసాయం దండగ అన్ననాయకుడు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా?. రైతుల ఉచిత విద్యుత్, వ్యవసాయం దండగ అన్న నాయకుడు, రైతులపై కాల్పులు జరిపించిన నాయకుడు, రుణాల పేరుతో మోసం చేసిన నాయకుడి పాలనను ఒకసారి గుర్తుచేసుకోండి. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనించాలని సీఎం జగన్ కోరారు. ‘చంద్రబాబు 2014లో పెట్టిన మేనిఫెస్టోను టీడీపీ వెబ్సైట్ నుంచి కూడా తీసేశారు. చెత్తబుట్టలో వేసిన చంద్రబాబుగారి నైజాన్ని చూడండి. ఇవాళ మన ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ప్రతి ఇంటికీ జగనన్న రాసిన లేఖను అందించి.. ఏం మేలు జరిగిందో చూపిస్తూ, గుర్తుచేస్తూ, మేనిఫెస్టోలో ఏం జరిగిందో టిక్కు పెట్టిస్తున్నారు. మన అందరి ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి తేడా గమనించండని సీఎం జగన్ ప్రజల్ని కోరారు. జగన్ మీ బిడ్డ. రైతుల తరఫున నిలబడే బిడ్డ. ఎన్నికలప్పుడు ఒకలా? ఎన్నికలు అయిన తర్వాత మరో మాదిరిగా ఉండేవాడు కాదు జగన్. మీ బిడ్డకు నిజాయితీ ఉంది.. మీ బిడ్డకు నిబద్ధత ఉంది. ఏది చెబుతాడో... అదే చేస్తాడు. దేవుడు ఆశీస్సులు కావాలి.. మీరు చల్లని దీవెనలు ఇవ్వాలని' సీఎం జగన్ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
-
Ganapavaram: సీఎం జగన్ పర్యటనకు ఏర్పాట్లు
సాక్షి, గణపవరం(పశ్చిమగోదావరి): ఈనెల 16న గణపవరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. వైఎస్సార్ రైతు భరోసా పథకంలో రైతులకు సీఎం చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఈ పర్యటన కోసం ఇప్పటికే హెలిప్యాడ్ నిర్మాణం పూర్తికావచ్చింది. హెలికాప్టర్ ట్రయల్‌రన్ పూర్తిచేశారు. హెలిప్యాడ్ నుంచి ముఖ్యమంత్రి ప్రత్యేక వాహనశ్రేణిలో నేరుగా సభాస్థలికి చేరుకుంటారు. ఇందుకోసం ప్రధాన రోడ్డుకు చేరడానికి ప్రత్యేకంగా రోడ్డును నిర్మించారు. అలాగే సీఎం పర్యటించే దారిలో పారిశుధ్య పనులు ముమ్మరం చేశారు. ఏలూరు ఆర్డీఓ పెంచల కిషోర్ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. హెలికాప్టర్ దిగినప్పుడు దుమ్ము రేగకుండా ఆ ప్రాంతం వాటరింగ్ చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో భారీ సభావేదికను నిర్మిస్తున్నారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు, మంత్రులు, రాçష్ట్రస్థాయి నాయకులు, అధికారులు కూర్చునే విధంగా సువిశాలమైన సభావేదికను నిర్మిస్తున్నారు. సభలో పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొననున్న దృష్ట్యా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభాప్రాంగణానికి రావడానికి ప్రజలు ఇబ్బంది పడకుండా ఐదు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి పాల్గొనే సభావేదిక నిర్మాణ పనులను శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, జాయింట్ కలెక్టర్ అరుణ్‌బాబు పరిశీలించారు. సభకు తరలివచ్చే రైతులు, ప్రజలకు సిట్టింగ్ ఏర్పాటుపై చర్చించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ పరిశీలించారు. గురువారం రాత్రి వ్యవసాయ శాఖ జిల్లా, స్థానిక అధికారులతో సమావేశమై స్టాల్స్‌పై చర్చించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయడానికి నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నేతలు, గణపవరం, సరిపల్లె, బువ్వనపల్లి గ్రామాలకు చెందిన పార్టీ శ్రేణులతో సమావేశమై పార్టీపరంగా ఏర్పాట్లపై చర్చించారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఈనెల 16న పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తెలిపారు. శుక్రవారం ఆయన గణపవరంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పోలీసు అధికారులతో పర్యటించి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ఎలాంటి ఘటనలూ తలెత్తకుండా, ఇబ్బందులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హెలిప్యాడ్ నుంచి సభాస్థలి వరకూ రోడ్డు మార్గాన్ని పరిశీలించి ఏఏ ప్రదేశాల్లో ఎలాంటి బందోబస్తు ఏర్పాట్లు చేయాలో సూచించారు. గణపవరంలో సిద్ధం చేస్తున్న హెలీప్యాడ్ -
మే 16న గణపవరం పర్యటనకు సీఎం జగన్
సాక్షి, గణపవరం (పశ్చిమగోదావరి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 16వ తేదీన గణపవరం రానున్నారు. రైతుభరోసా పథకం కింద రైతులకు చెక్కులు పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి కార్యక్రమాల కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ గణపవరం రానున్నట్టు ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు మంగళవారం తెలిపారు. సభాస్థలి, హెలీప్యాడ్, ముఖ్యమంత్రి ప్రయాణించే రోడ్డు మార్గాలని వారు పరిశీలిస్తారని చెప్పారు. చదవండి: (తుపాను అలజడి: ఏపీ ప్రభుత్వం అప్రమత్తం) -
గణపవరం సి ఐ భగవాన్ హఠాన్మరణం
-
గణపవరంలో క్యాండిల్ ర్యాలీ
-
బాంబులు జేబులో వేసుకోవడానికే వచ్చా: పవన్
గణపవరం : తెలుగుదేశం పార్టీ నాయకులు కాలర్ ఎగరవేసి తిరగడానికి కారణం జనసేన పార్టీయేనని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా గణపరం సభలో మాట్లాడుతూ..జనసేన పార్టీ ఆవిర్భావానికి కారణం మిగిలిన రాజకీయ పార్టీ నాయకుల భయమే కారణమన్నారు. రాజకీయాల్లోకి డబ్బులు సంపాదిద్దామని రాలేదని వ్యాక్యానించారు. జనసేన అభిమానుల ప్రేమతూటాలు, బాంబులు జేబులో వేసుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను తలచుకుంటే 2-014 ఎన్నికల అనంతరం రాజ్యసభ, ఎంపీ సీటు తీసుకునే సత్తా ఉన్నా తీసుకోలేదని వెల్లడించారు. దెందులూరు, ఉంగుటూరు ఎమ్మెల్యేలు జనసేన అభిమానుల, కార్యకర్తల లోన్లు ఆపేస్తున్నారని చెప్పారు. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. భీమడోలు ప్రభుత్వ ఘగర్ ఫ్యాక్టరీని 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అతి తక్కువ టోకు ధరకు ధారాదత్తం చేసి ఫ్యాక్టరీ కార్మికులకు అన్యాయం చేయడం దారుణమన్నారు. కొల్లేరుకి సరైన రహదారులు లేవని, ప్రాథమిక అవసరాలు తీర్చగలిగే నాయకులు లేరని విమర్శించారు. తినడానికి పనికి రాని బియ్యాన్ని ప్రజలకు ఇచ్చి అధికార పార్టీ నాయకులు రాష్ట్రాన్ని దోచేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఆర్ధికంగా వెనకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు కార్పొరేషన్, హాస్టల్ వసతి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ సున్నితమైన సమస్య..ఇది ముఖ్యమంత్రి పెట్టిన చిచ్చని విమర్శించారు. మాల మాదిగలు సోదరభావంతో ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమని, అందుకు జనసేన కృషి చేస్తుందని అన్నారు. ముస్లింల సంక్షేమానికి సచ్చార్ కమిటీ సూచనలు ఆచరణలోనికి తీసుకువస్తామని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పారు. చింతమనేని కాళ్లు విరగ్గొడతా గణపవరం సభ ముగిసిన తర్వాత ఏలూరు సభలో పవన్ కల్యాణ్ ప్రసగించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ రౌడీ ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించారు. ఆయనకు చెబుతున్నా ఏలూరు వచ్చి దౌర్జన్యాలకు దిగితే కాళ్లు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడతానని హెచ్చరికలు పంపారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని వంటి వారు ఉత్తర్ ప్రదేశ్‌లో సందుకు ఒకరు ఉంటారని చెప్పారు. ఈ ప్రభుత్వం హత్యలు, నేరాలు చేసే వారిపై కేసులు నమోదు చేయదు..వారిపై చర్యలు తీసుకోదని విమర్శించారు. కొల్లేరులోని ప్రజలు బయటకు రావడానికి రోడ్లు లేవని, జనసేనకు 18 శాతం ఓటు బ్యాంకు ఉందని వెల్లడించారు. తనకు చెగువేరా అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఎన్టీఆర్ లాగా తొమ్మిది నెలలో ముఖ్యమంత్రి అవ్వాలని రాలేదని చెప్పారు. ప్రభుత్వ పథకాలు ఒక్క టీడీపీ నాయకులకే దక్కుతున్నాయని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ విధంగా పరిస్థితులు ఉండబట్టే యువత నక్సల్స్ వైపు మొగ్గు చూపుతున్నారని వ్యాఖ్యానించారు. బాక్సైట్ తవ్వకాలు ఆపవలసిన అవసరం ఉంది..ఇలాంటి ద్వంద్వ విధానాల వల్ల యువత మావోయిస్టు వైపు వెళ్తోందన్నారు. మావోయిస్టులు ఎందుకు పోరాడుతున్నారో ఆలోచించాలని హితవు పలికారు. మీరు కోరుకున్నట్లు నేను సీఎం అయితే మహిళలకు ఉచితంగా గ్యాస్ ఇస్తానని తెలిపారు. ఉచిత రేషన్ బదులు మహిళల ఖాతాల్లో నేరుగా 2500 నుంచి 3500 రూపాయలు వేస్తామని వెల్లడించారు. మహిళలకు రిజర్వేషన్ 33 శాతం కల్పించి తీరుతామన్నారు. -
రొయ్యల రైతులకు వైఎస్ జగన్ వరాలు
సాక్షి, గణపవరం: నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో దారుణంగా చితికిపోయిన రొయ్యల రైతులు, చేపల రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటిచ్చారు. తాము అధికారంలోకి వస్తే రొయ్యల రైతులకు యూనిట్ కరెంటును రూపాయిన్నరకే అందజేస్తామని, అనుబంధ పరిశ్రమలకు యూనిట్ కరెంటు ఐదు రూపాయలకే ఇస్తామని ప్రకటించారు. 169వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సీడ్ కొనుగోళ్ల నుంచి రైతు తన పంటను అమ్ముకునే దాకా మధ్యలో ఉన్న దళారీ వ్యవస్థను కూల్చేస్తామని, నిర్ణీత కాలంలోగా రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతుల బాధను చూసి..: ‘‘పాదయాత్ర ద్వారా ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టిన నాకు.. రైతులు, స్థానికులు తమ సమస్యలు చెప్పారు. చేపలు, రొయ్యలకు మంచి రేట్లుంటే మా బతుకులు బాగుంటాయని వారు తెలిపారు. పంట రేట్లు తగ్గిపోయి, దళారుల దోపిడీ పెరగడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం మాత్రం తమను పట్టించుకోవడంలేదని రైతులు బాధపడుతున్నారు. ఏలూరు కాలువ ఉన్నా.. రెండో పంటకు నీరు రావట్లేదని, ఎండాకాలంలో తాగునీరు కూడా లేదని, బోర్లు వేస్తే ఉప్పునీళ్లొస్తున్నాయని రైతులు వివరించారు. ఈ పరిస్థితుల్లో రొయ్యల పంటను బతికించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నామన్నా.. చెరువులు మార్చుతుంటే వైరస్ సోకి చనిపోతున్నాయన్నా.. అని చెబుతూ బాధపడ్డారు. పుట్టలకొద్దీ హ్యాచరీస్ పుట్టుకొస్తున్నా.. సీడ్ నాణ్యతను పరీక్షించే ల్యాబ్‌లు మాత్రం లేవని, హ్యాచరీస్-ప్రైవేట్ ల్యాబ్‌లు కలిసి రైతుల్ని మోసం చేస్తున్నారని, దాణా కంపెనీలు కూడా ఇష్టారీతిగా ధరలు పెంచుతున్నాయని, వీటన్నింటికి తోడు కరెంటు కష్టాలూ ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు. కరెంటు చార్జీలు తగ్గిస్తాం: దివంగతనేత వైఎస్సార్ హయాంలో చేపలు, రొయ్యల రైతులకు కరెంటు యూనిట్ 90 పైసలకే ఇచ్చారు. ఇప్పుడేమో 3.80 రూపాయలు గుంజుతున్నారు. అదిగాక, అడిషనల్ చార్జీల పేరుతో లక్షలకు లక్షలు వసూలుచేస్తున్నారు. దేవుడి దయతో, ప్రజల ఆశీర్వాదంతో మన ప్రభుత్వం ఏర్పడితే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని మాటిస్తున్నా. రైతులకు విద్యుత్ యూనిట్ రూపాయిన్నరకే ఇస్తాం. ఈ పంటలకు అనుబంధంగా నడిచే ఐస్ ఫ్యాక్టరీలు, ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రస్తుతం 7 రూపాయలు వసూలు చేస్తున్నారు. దాన్ని 5 రూపాయలకు తగ్గిస్తాం. రొయ్యలకూ మద్దతు ధర ఉండాలన్నది నా ఆకాంక్ష. అది జరగాలంటే ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల సంఖ్య పెంచాలి. మనం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో సముద్రతీరమంతటా ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు నిర్మిస్తాం. నాలుగో ఏట రొయ్యలకు మద్దతు ధర ప్రకటిస్తాం. సీడ్ తయారీ, దాణా తయారీ.. అన్ని చోట్లా దళారీ వ్యవస్థను రూపుమాపుతాం. తాగునీరు, పేదలకు ఇళ్లు ఇక్కడి ప్రధాన సమస్యలని స్థానికులు చెప్పారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని గ్రామాల్లో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నిర్మించుకుందాం. వాటిని గోదావరి, కృష్ణ జలాలతో నింపుకొందాం. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత నేనే తీసుకుంటా.. కొల్లేరుపై పకడ్బందీ వ్యూహం: కొల్లేరు సరస్సుకు సంబంధించిన సమస్యలను కూడా ఇక్కడి రైతులు చెబుతున్నారు. ఈ సమస్యల గురించి కైకలూరు సభలో నేను సుదీర్ఘంగా ప్రసంగించాను. కొల్లేరు సమస్య సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయాల్సిఉంటుంది. అందుకే దీనిపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని ఎమ్మెల్సీ చేసి, నా పక్కనే కూర్చొబెట్టుకుంటాను. అధికారంలోకి వచ్చినవెంటనే కొల్లేరు రీసర్వేకు ఆదేశిస్తానని హామీ ఇస్తున్నా. కాంటూరును తగ్గించి రైతులకు మేలు చేకూర్చుతానని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోలేదు. బీజేపీతో నాలుగేళ్లు కాపురం చేసిన ఆయనకు కొల్లేరుగానీ, ప్రత్యేక హోదాగానీ గుర్తుకురాదు. తీరా ఎన్నికల సమయం దగ్గరికి వచ్చేసరికి, నెపం వేరేవాళ్లపై నెట్టడానికి బీజేపీతో విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు కొత్త పెళ్లికూతురు కాంగ్రెస్ వైపు చూస్తున్నాడు. అబ్బా! బాబుకు బాధకలిగిందట!!: మట్టి నుంచి గనుల దాకా, గుడి భూముల నుంచి గుడిలో దేవుడి ఆహరణాల దాకా అన్నింటినీ స్వాహా చేస్తోన్న చంద్రబాబు నాయుడు అబద్ధాలు, మోసాలతోనే పరిపాలన సాగిస్తున్నాడు. నిన్న విశాఖపట్నంలో ఆయన అబద్దాలు క్లైమాక్స్‌కు చేరాయి. అవి వింటే.. ఈయన ముఖ్యమంత్రిగా ఎలా ఉన్నాడా అనిపిస్తుంది. బాబు చేసేదేమో ధర్మపోరాటమట, తిరుపతిలో అర్చకులు చేసేదేమో అధర్మపోరాటమట! పైన చంద్రబాబు.. కింద జన్మభూమి కమిటీ మాఫియాలు జనాన్ని పీడిస్తున్నారు. ఈ మనిషా.. ధర్మపోరాటం చేసింది? కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనుగోలుచేస్తుంటే బాధ అనిపించిందట! మరి 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొని, అందులో నలుగురి మంత్రులుగా చేసి, డిస్క్వాలిఫై కాకుండా స్పీకర్ పదవిని దిగజార్చినప్పుడు? కనీసం వడ్డీలకు కూడా సరిపోని డబ్బుచెల్లించి.. అదేదో మొత్తం రైతుల రుణాల మాఫీ అయినట్లు చెప్పుకున్నాడు. ఉదయం ట్విటర్లోనేమో రూ.13 వేల కోట్లు అని, సాయంత్రం సభలో రూ.25వేల కోట్లని రెండు మాటలు చెబుతాడు. ఈ అబద్ధాలకోరు.. వైఎస్సార్ పేరును కూడా తీసుకొస్తాడు. వైఎస్సార్ 50 శాతం హామీలే పూర్తిచేశాడట, ఈయనేమో 100 శాతం చేశాడట! నాలుగేళ్లలో 2 లక్షల ఇళ్లు కట్టలేనోడు.. సంవత్సరంలో 19 లక్షల ఇళ్లు కట్టిస్తాడట! దివంగత నేత వైఎస్సార్ 13 జిల్లాల ఆంధ్రలో 26 లక్షల ఇళ్లు, 23 జిల్లాల ఆంధ్రలో 68 లక్షల ఇళ్లు కట్టించిన సంగతి ప్రజలకు తెలియదా.. చంద్రం విచిత్రాలు వినతరమా?: నోరు తెరిస్తే అబద్ధాలు, సొంత డబ్బా తప్ప పనికొచ్చే మాట ఒక్కటీ మాట్లాడడీ చంద్రబాబు. స్వాతంత్ర్యపోరాటం జరిగినప్పుడు నిక్కరు కూడా తొడగని చంద్రబాబు.. నేనే స్వాతంత్ర్యం తెచ్చానంటాడు. ఇంకా నయం.. అప్పుడుగిన ఆయన ఏ నాయకుడో అయి ఉంటే.. స్వాతంత్ర్యం మనకెందుకు.. బ్రిటిష్ వారితో లాలూచీ పడదాం అనేవాడు! ఈ మహానుభావుడు దోమలమీద దండయాత్ర చేశాడట. ఒక్క శాశ్వత భవనమూ కట్టలేదుగానీ అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తాడట. అంతేనా, కంప్యూటర్లు, సెల్ఫోన్లు కనిపెట్టానంటాడు. ప్రైవేట్ జెట్లలో విదేశాలకు పోయి.. ఏ దేశానికి పోతే ఆ దేశం నుంచి ఏదో వచ్చేస్తుందంటాడు. పాపం సత్యా నాదెండ్ల కష్టపడి చదివి పైకొచ్చి, మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈవో అయితే.. నా వల్లే అని క్రెడిట్ లాగేసుకుంటాడు చంద్రబాబు. సింధు చమటోడ్చి షెటిల్ ఆడితే.. ఆమెకు ఆట నేర్పించిందే నేనని చెప్పుకుంటాడు. ఈ మధ్య ఇంకోటి.. ఎండలు తగ్గించాలట! 10 డిగ్రీల ఎండను తగ్గించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చాడు.. సూర్యుడితో ఫోన్లో మాట్లాడి తగ్గిస్తాడేమో!! పొరపాటున కూడా క్షమించొద్దు: రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి.. అంటూ హామీలిచ్చి, ఏ ఒక్కదానినీ అమలు చేయకుండా ప్రజల్ని మోసపుచ్చాడు చంద్రబాబు. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా.. మోసాలు చేసేవాడు, అబద్ధాలు చెప్పేవాడు మీకు నాయకుడుగా కావాలా? ఈ మోసకారి బాబును పొరపాటున కూడా క్షమిస్తే, ఇంటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తానంటా కొత్త ఎత్తులతో వస్తాడు. ఒక నాయకుడు మైక్ పట్టుకుని మాటిస్తే, దాన్ని నెరవేర్చలేని రోజు రాజీనామా చేసే పరిస్థితి రావాలి. అది జగన్ ఒక్కడితోనే సాధ్యంకాదు. మీ అందరి ఆశీర్వాదంతో రాబోయే మన ప్రభుత్వంలో ప్రజలకు చేయబోయే మేళ్లను నవరత్నాల ద్వారా వివరించాం. ఇవాళ పేద పిల్లల చదువుల కోసం మనం ఏమేం చేయబోతున్నామో మరోసారి వివరిస్తాను.. పిల్లల చదువులకు ఎంత ఖర్చైనా నాదే బాధ్యత: ప్రతి పేద ఇంట్లో ఒక డాక్టర్‌గానీ, ఇంజనీర్గానీ ఉండాలన్నది మహానేత వైఎస్సార్ కల. అలాగైతేనే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడగలవు. పేదల కోసం నాన్న ఒక అడుగు ముందుకేస్తే.. నేను రెండు అడుగులు వేస్తాను. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. పిల్లల్ని బడికి పంపించే ప్రతి తల్లికీ ‘అమ్మ ఒడి’ పథకం కింద ఏటా రూ. 15,000 అందిస్తాం. పిల్లలు ఎంత పెద్ద చదువు చదివితే అంతవరకు అయ్యే ఖర్చును, ఎన్ని లక్షలైనా ప్రభుత్వమే భరిస్తుంది. వేరే ప్రాంతాల్లో చదువుకునే పిల్లల హాస్టల్ ఖర్చు కింద ఏటా రూ. 20,000 ఇస్తాం’’ అని వైఎస్ జగన్ తెలిపారు. -
ఘరానా మోసగాడి అరెస్ట్
ఏలూరు అర్బన్ : పోలీస్, విజిలెన్స్, ఏసీబీ అధికారినంటూ రేషన్ డీలర్లు లక్ష్యంగా నేరాలకు పాల్పడిన ఘరానా మోసగాడిని గణపవరం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వలిశెల రత్న వివరాలు వెల్లడిం చారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామానికి చెందిన అయితం రవిశేఖర్ అనే వ్యక్తి విలాసాలకు బానిసై మోసగాడికి మారాడు. తాను పోలీస్, విజిలెన్స్, ఏసీబీ అధికారినంటూ ప్రజ లకు పరిచయం చేసుకోవడంతో పాటు దొంగిలించిన కార్లకు ప్రభుత్వ నంబర్ ప్లేట్లను అమర్చుకుని వాటిపై ప్రభుత్వ వాహనం అని రాయించుకుని తిరుగుతూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి తాను విజిలెన్స్ అధికారినంటూ హ డావుడి చేసేవాడు. కేసు లేకుండా చేస్తానని డీలర్లను నమ్మించి వారి వంటిపై ఉన్న బంగారు ఆభరణాలు కాజేసేవాడు. ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి సొమ్ములు వసూలు చేసుకుని పరారయ్యేవాడు. నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో అలపాటి రాజ్యలక్ష్మి అనే రేషన్ షాపు డీలర్ భార్యను మోసగించి 25 కాసుల బంగారు ఆభరణాలు, ఉంగుటూరుకు చెందిన పారంపాటి రాఘవేంద్రరావును ఏసీబీ అధికారినంటూ మోసగించి స్విఫ్ట్ డిజైర్ కారును అపహరించుకుపోయాడు. ఇలా ఇప్పటి వరకూ 80కు పైగా నేరాలకు పాల్పడ్డాడు. ఇదే క్రమంలో పలుమార్లు పోలీసులకు చిక్కి జైలు శిక్ష కూడా అనుభవించాడు. చివరిగా నల్గొండ జిల్లా భువనగిరిలో మోసానికి పాల్పడిన కేసులో జైలు శిక్ష అనుభవించి గతేడాది విడుదలయ్యాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో 11 నేరాలకు పాల్ప డ్డాడు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, సీసీఎస్ డీఎస్పీ టి.సత్యనారాయణ పర్యవేక్షణలో సీసీఎస్ పోలీసులు, గణపవరం పోలీసు సిబ్బంది నిందితుడిని బాదంపూడి వై.జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు. అతడి నుంచి 341 గ్రాముల బంగారు ఆభరణాలు, నకిలీ ఐడెంటిటీ కార్డులు, నకిలీ కార్ నంబర్ ప్లేట్లు స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ రత్న వివరించారు. ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, గణపవరం సీఐ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
ఫ్లో మ్యాచ్‌లో భీమవరం జట్టు గెలుపు
గణపవరం (నిడమర్రు) : ఫుట్‌బాల్ లీగ్ ఆఫ్ వెస్ట్ గోదావరి(ఫ్లో) సీజ న్ –2లో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం భీమవరం, తాడేపల్లిగుడెం జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించారు. భీమవరం జట్టు 3–0 స్కోర్‌తో తాడేపల్లిగూడెం జట్టుపై విజేతగా నిలిచింది. మ్యా న్ ఆఫ్ ది మ్యాచ్‌గా నైజీరియా ఆటగాడు స్కిల్స్ నిలిచాడు. ప్రేక్షకుల నుంచి నిడమర్రు మండలం సిద్ధాపురం గ్రామానికి చెందిన విద్యార్థిని డి.ఉష లావా మొబైల్ గెలుచుకుంది. మ్యాచ్ అనంతరం ప్లో చైర్మ న్ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ మన జిల్లా నుంచి ఒక్కరినైనా ఆంతర్జాతీయ క్రీడాకారుడిగా తీర్చిదిద్దాలనే ఆశయంతో పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వైఎస్సార్ సీపీ ఉంగుటూరు, కైకలూరు, గోపాలపురం నియోజకవర్గాల కన్వీనర్లు పుప్పాల వాసుబాబు, దూలం నాగేశ్వరరావు, తలారి వెంకట్రావు, సర్పంచ్ కె.సోమేశ్వరరావు పాల్గొన్నారు. -
పగలు ఎలక్ట్రికల్ పని..రాత్రులు చోరీలు
గణపవరం : పగలు ఎలక్ట్రికల్ పని చేస్తూ రాత్రులు చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు పోలీసులకు చిక్కారు. వీరిలో ఇద్దరు బాలలు కావడం విశేషం. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో గణపవరం సీఐ దుర్గాప్రసాద్ కేసు వివరాలు వెల్లడించారు. గణపవరం పంచాయతీ పరిధిలో చిన రామచంద్రపురానికి చెందిన గునుపూడి ఉదయ్‌కుమార్ ఎలక్ట్రికల్ వైండింగ్ పని చేస్తుంటాడు. ఇతని వద్ద ఇద్దరు బాలురు హెల్పర్లుగా పనిచేస్తున్నారు. వీరు ముగ్గురు కలిసి రాత్రులు చోరీలకు పాల్పడుతున్నారు. కారు అద్దాలు పగుల కొట్టి.. 2014 డిసెంబర్ 8వ తేదీన గణపవరం డిగ్రీ కళాశాల వద్ద పార్కింగ్ చేసిన కారు వెనుక అద్దాలు బద్దలు కొట్టి బ్యాగ్‌తో పాటు బంగారం వస్తువులు దొంగిలించారు. ఇటీవల గణపవరం బొబ్బిలి వంతెన దిగువన కూల్డ్రింక్షాపులో మూడు సెల్ఫోన్లు, రూ.4 వేల నగదు అపహరించారు. ముత్యాలరాజు ఆసుపత్రి కాంప్లెక్స్‌లోని రామభద్రిరాజు మెడికల్ షాపు షట్టర్లు బద్దలుకొట్టి బంగారం, వెండి వస్తువులు, కొంత నగదు దొంగిలించారు. అప్పట్లో ఈ కేసులు నమోదయ్యాయి. నిందితులు ముగ్గురి కదలికలపై అనుమానం వచ్చి అరెస్ట్ చేయగా నేరాలు ఒప్పుకున్నారని సీఐ చెప్పారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.2 లక్షల విలువైన వస్తువులు రికవరీ చేసినట్టు తెలిపారు. నిందితుల్లో ఇద్దరి బాల నేరస్తులను ఏలూరు జువైనల్ జస్టిస్ బోర్డులో హాజరు పరిచినట్టు చెప్పారు. ఉదయ్‌కుమార్‌ను తాడేపల్లిగూడెం కోర్టుకు తరలించినట్టు సీఐ తెలిపారు. ఏఎస్సై జాన్‌మోజెస్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. 6 నెలల క్రితం క్లోజ్ అయిన 2014 నాటి కారులో చోరీ కేసును ఏలూరు డీఎస్పీ అనుమతి మేరకు తిరిగి మళ్లీ తెరిచి దర్యాప్తు చేసి ఛేదించినందుకు సిబ్బందిని సీఐ అభినందించారు. గణపవరం ఎస్సై హరికృష్ణ, హెడ్ కానిస్టేబుల్ అనంద్‌బాబు, లెనిన్ ప్రసాద్, రవికుమార్, శ్రీనివాస్‌లకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందించారు. రివార్డుల కోసం జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు సీఐ చెప్పారు. -
గణపవరంలో లారీ బీభత్సం: నలుగురి దుర్మరణం
నాదెండ్ల: గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో శనివారం తెల్లవారుజామున ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన లారీ రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. గ్రామంలోగల చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి పై చోటుచేసుకుంది. ఒంగోలు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ గణపవరం వద్దకు రాగానే రోడ్డు మలుపు దగ్గర ఒక్కసారిగా పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో దుకాణంలో ఉన్న బి. భాస్కర్ రావు(70), ఆయన సతీమణి పుణ్యవతి(60) తోపాటు అక్కడే టీ తాగుతున్న మరో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. లారీ డ్రైవర్ నిద్రపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ బీభత్సం: నలుగురి దుర్మరణం
-
అంతర్రాష్ట్ర గొలుసు దొంగల ముఠా అరెస్ట్
గణపవరం : మహిళల మెడలో బంగారు ఆభరణాలను తెంచుకుని పరారయ్యే ముగ్గురు సభ్యులు గల అంతర్రాష్ట్ర గొలుసు దొంగల ముఠాను భీమవరం పోలీసులు అరెస్టు చేసి, నిందితుల నుంచి రూ.4.13 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు బైక్‌లు, రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి చెప్పారు. గణపవరం సీఐ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రం దౌల్పూర్ జిల్లాకు చెందిన రామ్ భరణ్ సింగ్‌పర్మార్, రమాకాంత్ సవిత, రవీంద్రసింగ్ నాలుగేళ్లుగా భీమవరంలో మార్బుల్స్ అతికించే పనిచేస్తున్నారు. వ్యసనాలకు బానిసలై సంపాదించిన సొమ్ము జల్సాలకు సరిపోకపోవడంతో దొంగతనాలకు అలవాటుపడ్డారు. ఒంటరిగా నడిచే వెళ్లే మహిళల మెడలోని బంగారు వస్తువులను దొంగిలిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి నేరాలకు ఒడిగడుతూ ఎదురు తిరిగినవారిని తుపాకీతో బెదిరిస్తున్నారు. మావూళ్లమ్మ గుడి వద్ద ఒంటరిగా ఉన్న మహిళ మెడలో ఆభరణాలను ఈ ముగ్గురూ బైక్‌పై వచ్చి తెంపుకుని వెళుతుండగా ఆమె కేకలు వేయడంతో అక్కడే ఉన్న పాలకోడేరు కానిస్టేబుల్ వై.వెంకటేశ్వరరావు వారిని వెంబడించాడు. దీంతో నిందితుల్లో ఒకరు తన దగ్గర ఉన్న తుపాకీతో కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపాడు. కాల్పులనుంచి కానిస్టేబుల్ తప్పించుకుని వారిని పట్టుకునేందుకు వెంటపడ్డాడు. దీనిని చూసిన భీమవరం చైతన్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి హరీష్.. కానిస్టేబుల్‌తో పాటు వెంబడించి నిందితుల్లో ఒకరిని పట్టుకుని భీమవరం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. మిగిలిన ఇద్దరిని సీఐలు జి.కెనడీ, ఆర్జీ జయసూర్యలు లూథరన్ హైస్కూల్ గ్రౌండ్లో బుధవారం అరెస్ట్ చేశామని ఎస్పీ వివరించారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన 15 మందిని, వారికి సహకరించిన ఏజెంట్లను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారి వివరాల తెలుసుకున్న అనంతరమే పనిలో పెట్టుకోవాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధైర్యసాహసాలు ప్రదర్శించిన కానిస్టేబుల్ వై.వెంకటేశ్వరరావుకు ఎస్పీ రివార్డు అందజేశారు. కానిస్టేబుల్, విద్యార్థి హరీష్‌కు బ్రేవరీ అవార్డు కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామన్నారు. ఏలూరు డీఎస్సీ కేజీవీ సరిత, భీమడోలు సీఐ ఎన్.దుర్గా ప్రసాద్, గణపవరం ఎస్సై ఎ.పైడిబాబు పాల్గొన్నారు. -
గణపవరంలో విజయమ్మ
బొల్లారెడ్డి వెంకటేశ్వరరెడ్డి సంస్మరణ సభకు హాజరు మైలవరం: వైఎస్సార్సీపీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ శనివారం గణపవరం జమీందారు బొల్లారెడ్డి వెంకటేశ్వరరెడ్డి సంస్మరణ సభకు హాజరయ్యారు. మైలవరం మండలం గణపవరం జమిందారు బొల్లారెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమారుడు కుమార కోటిరెడ్డితో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి సోదరి విమలమ్మ వివాహం జరగడంతో వీరికి బంధుత్వమేర్పడింది. మరో కుమారుడు బిమల్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం జగతి పబ్లికేషన్స్‌కు వైస్ ప్రసిడెంట్‌గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో విజయమ్మ, వైఎస్. వివేకానందరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి సంస్మరణ సభకు హాజరయ్యారు. పలువురు పార్టీ నాయకులు ఆమెను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. విజయమ్మను కలిసిన వారిలో తలశిల రఘురామ్, జ్యేష్ఠ రమేష్‌బాబు, జోగి రమేష్, కాజా రాజకుమార్, అప్పిడి కిరణ్ కుమార్‌రెడ్డి, వేణుగోపాలరెడ్డి తదితరులున్నారు. అలాగే జగన్ అభిమానులు, కార్యకర్తలు, మహిళలు పెద్దఎత్తున వచ్చి విజయమ్మను కలుసుకుని అభిమానం చాటుకున్నారు. -
కలెక్టర్ చొరవతో మహిళకు విముక్తి
ఏలూరు: బహ్రెయిన్ దేశంలోని ఓ ఇంట్లో పని చేయడానికి వెళ్లి అక్కడ చిత్రహింసలకు గురవుతున్న ఓ మహిళ కలెక్టర్ చొరవతో స్వగ్రామానికి తిరిగి వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా గణపవరానికి చెందిన జల్లిపల్లె ధర్మారావు, సత్యవతి దంపతుల కుమార్తె నాగేశ్వరిని జంగారెడ్డిగూడేనికి చెందిన వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. మద్యానికి బానిసైన అతడు నాగేశ్వరిని పట్టించుకోకపోవడంతో ఐదేళ్ల కిందట పుట్టింటికి వచ్చేసింది. విదేశాలలో ఉపాధి అవకాశాలు ఎక్కువని, ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని చెప్పిన ఏజెంట్లను నమ్మి వారి ద్వారా బహ్రెయిన్ దేశం వెళ్లింది. అక్కడ మూడు, నాలుగు ఇళ్లలో పనిచేసింది. అన్నిచోట్లా చిత్రహింసలు అనుభవించింది. రెండు నెలల కిందట ఆమె తాను అనుభవిస్తున్న ఇబ్బందులను ఫోన్‌ద్వారా తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు తమ కుమార్తెను రక్షించి తీసుకురావాలని గణపరం పోలీసులను ఆశ్రయించారు. సుమారు 50 రోజులపాటు స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో 10 రోజుల కిందట కలెక్టర్ సిద్ధార్థజైన్‌ను ఆశ్రయించారు. స్పందించిన కలెక్టర్ ఆ మహిళను జిల్లాకు తీసుకొచ్చే బాధ్యతను జిల్లా బాలల సంరక్షణ అధికారి సీహెచ్ సూర్యచక్రవేణికి అప్పగించారు. దీంతో ఆమె నాగేశ్వరిని బహ్రెయిన్ పంపిన ఏజెంట్లను ఏలూరు పిలిపించి మాట్లాడారు. ఆమెను తక్షణమే జిల్లాకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేయూలని ఆదేశించారు. దీంతో ఇక్కడి ఏజెంట్లు బహ్రెయిన్‌లోని ఏజెంట్లతో సంప్రదించి ఆమెను రప్పించారు. ముంబై వచ్చిన ఆమె అక్కడి నుంచి స్వగ్రామానికి వచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడ భిక్షాటన చేసుకోవడం మొదలుపెట్టింది. ముంబైకి చెందిన కొందరు ఆమెను హైదరాబాద్ పంపించారు. అక్కడినుంచి ఏలూరు చేరుకున్న నాగేశ్వరిని సోమవారం జిల్లా బాలల సంరక్షణాధికారి సూర్యచక్రవేణి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఆమెను బహ్రెయిన్ పంపించిన ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సీనియర్ జర్నలిస్టు మురళీమోహన్‌కు అంత్యక్రియలు
చిలకలూరిపేట, న్యూస్‌లైన్: సాక్షి దినపత్రికలో చీఫ్ సబ్ఎడిటర్గా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు పులిపాక మురళీమోహనరావు(57) అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో సోమవారం సాయంత్రం అశృనయనాలనడుమ సాగింది. ఈయన గుండెపోటుతో ఆదివారం హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో మృతిచెందిన విషయం విదితమే. ఈయనకు భార్య సువర్చల, కుమారులు రామలక్ష్మణులు, కుమార్తె విజయలక్ష్మి ఉన్నారు. భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో సోమవారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకువచ్చారు. గ్రామంలోని హిందు శ్మశాన వాటికలో అంతక్రియలు నిర్వహించారు. భౌతికకాయాన్ని గుంటూరు సాక్షి దినపత్రిక బ్రాంచి మేనేజర్ ఆర్.రామచంద్రరెడ్డి, ఏపీయూడబ్యూజే జిల్లా అధ్యక్షుడు పి భక్తవత్సలరావు, తదితరులు సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.