సీనియర్ జర్నలిస్టు మురళీమోహన్‌కు అంత్యక్రియలు
Published Tue, Feb 4 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM
చిలకలూరిపేట, న్యూస్‌లైన్: సాక్షి దినపత్రికలో చీఫ్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు పులిపాక మురళీమోహనరావు(57) అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో సోమవారం సాయంత్రం అశృనయనాలనడుమ సాగింది. ఈయన గుండెపోటుతో ఆదివారం హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో మృతిచెందిన విషయం విదితమే. ఈయనకు భార్య సువర్చల, కుమారులు రామలక్ష్మణులు, కుమార్తె విజయలక్ష్మి ఉన్నారు. భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో సోమవారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకువచ్చారు. గ్రామంలోని హిందు శ్మశాన వాటికలో అంతక్రియలు నిర్వహించారు. భౌతికకాయాన్ని గుంటూరు సాక్షి దినపత్రిక బ్రాంచి మేనేజర్ ఆర్.రామచంద్రరెడ్డి, ఏపీయూడబ్యూజే జిల్లా అధ్యక్షుడు పి భక్తవత్సలరావు, తదితరులు సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Advertisement
Advertisement