muralimohan
-
టీడీపీ ఎంపీ మురళీమోహన్‌పై కేసు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేత, ఎంపీ మురళీమోహన్‌పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం పోలీసుల తనిఖీల్లో దొరికిన రూ.2 కోట్లకు సంబంధించి మురళీమోహన్‌తో పాటు మరో ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. గచ్చిబౌలి జయభేరి కార్యాల యం నుంచి రెండు బ్యాగుల్లో డబ్బులతో ఆటో లో హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో దిగి ఇద్దరు వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేయగా దొరికిపోయారని తెలిపా రు. జయభేరి ఉద్యోగులు కాకినాడ వాసి నిమ్మాలూరి శ్రీహరి, మెదక్ జిల్లా వాసి అవుటు పండారీలను అదుపులోకి తీసుకుని విచారించగా రాజమండ్రి లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు తీసుకెళ్తున్నట్లు అంగీకరించినట్లు చెప్పారు. రైలు మార్గం ద్వారా రాజమండ్రికి.. జయభేరి ప్రాపర్టీస్‌కి చెందిన ధర్మరాజు, జగన్ మోహన్‌రావు ఆదేశాల మేరకు అదే కార్యాలయంలో ఆఫీసు అసిస్టెంట్లుగా పనిచేసే శ్రీహరి, పండారీలు రెండు బ్యాగుల్లో రూ.2 కోట్లు తీసుకుని హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌కు బయల్దేరారు. కారులో వెళ్తే తనిఖీలు చేస్తారనే ఉద్దేశంతో ఆటోలో వెళ్లారు. ఇటీవల రాజేంద్రనగర్‌లోని ఆరామ్‌ఘర్ వద్ద బస్సులో ఏపీ టీడీపీ నేత పరిటాల సునీత అనుచరులు రూ.28 లక్షలు తీసుకెళ్తూ పోలీసులకు దొరికారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచేందుకు ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారని భావించి అన్ని రైల్వేస్టేషన్ల వద్ద తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు, మాదాపూర్ పోలీసులు బుధవారం తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కన్పించారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఆటో దిగి ఆదరాబాదరాగా వెళ్తున్న వారిని ఆపి తనిఖీ చేయగా రెండు బ్యాగుల్లో రూ.రెండు కోట్లు దొరికాయి. తాము జయభేరి ప్రాపర్టీ ఉద్యోగులమని వారు చెప్పినట్లు సమాచారం. కోడలు గెలుపు కోసం.. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ నుంచి ఎంఎంటీఎస్‌లో సికింద్రాబాద్‌కు చేరుకొని, అక్కడి నుంచి గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రి వెళ్లాలని ధర్మరాజు, జగన్మోహన్రావు సూచించినట్లు ఇద్దరు నిందితులు శ్రీహరి, పండారీలు పోలీసు విచారణలో అంగీకరించారని సీపీ సజ్జనార్ తెలిపారు. రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే మురళీమోహన్ అనుచరుడు యలమంచి మురళీకృష్ణ కలుస్తాడని, తర్వాత ఆ డబ్బును రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌కు ఇవ్వాలని ఆదేశించినట్లు వారు వెల్లడించారని చెప్పారు. ఈ డబ్బునే లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ తరఫు అభ్యర్థి మురళీమోహన్ కోడలు రూప.. నియోజకవర్గంలోని ఓటర్లకు పంపిణీ చేయాలని అనుకున్నట్లు వెల్లడించారు. వీరిద్దరు ఇచ్చిన వాంగ్మూలంతో ఎంపీ మురళీమోహన్, యలమంచి మురళీకృష్ణ, ధర్మరాజు, జగన్మోహన్రావులపై ఐపీసీ సెక్షన్ 171(బి), 171(సి), 171(ఈ),171(ఎఫ్)ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ డబ్బును ఐటీ విభాగానికి అప్పగిస్తామని చెప్పారు. -
దైవసన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు బాధ్యతల స్వీకరణ
సాక్షి, ఫిల్మ్‌నగర్: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం చైర్మన్‌గా నటుడు మోహన్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మరో నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ దైవసన్నిధానం 18 దేవుళ్ల సముదాయం అని చెప్పారు. ఈ దైవసన్నిధానానికి ఆద్యుడు వి.బి. రాజేంద్రప్రసాద్ అని, అప్పటి మూలధనంతో సన్నిధానాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సన్నిధానానికి రూ.3 కోట్ల 70 లక్షల విరాళాలు వచ్చాయని వివరించారు. ఈ దైవభక్తిలో పాలుపంచుకుంటానని మోహన్‌బాబు కోరారన్నారు. నూతన పాలకవర్గాన్ని ఎన్నుకుంటామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ చిరంజీవి, తాను చిలుకా గోరింకల్లా గొడవపడుతుంటామన్నారు. ఇప్పటికి రెండు కమిటీలు సన్నిధానాన్ని దిగ్విజయంగా నిర్వహించాయని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి అన్నారు. మోహన్‌బాబు చైర్మన్‌గా రావడం ఆనందంగా ఉందని, ఆయనకు కొత్త జీవితం ప్రారంభమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు, స్వరూపానందేంద్రస్వామి, ప్రముఖ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి, చాముండేశ్వరీనాథ్ తదితరులు హాజరయ్యారు. -
టీడీపీలో టీటీడీ చైర్మన్ పదవి చిచ్చు
అమరావతి: ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్ పదవి కోసం తెలుగుదేశం పార్టీలో అప్పుడే చిచ్చు మొదలైంది. చైర్మన్ పదవి తనకే ఇవ్వాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు పట్టుబడుతున్నారు. అవసరం అయితే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసేందుకు ఆయన సిద్ధం అయ్యారు. ఈ మేరకు రాయపాటి సాంబశివరావు పది రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. అంతకు ముందు కూడా రాయపాటి తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ పట్టుబట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తనకు దక్కుతుందనుకున్న టీటీడీ ఛైర్మన్ పదవి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నాయకుడు కనుమూరి బాపిరాజుకు దక్కడంతో అప్పట్లోనే ఆయన పార్టీ వీడాలనుకున్నారు. తర్వాతి పరిణామాలలో రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరారు. అయితే ఇక్కడ కూడా ఆయనకు ఆశాభంగం తప్పలేదు. చిత్తూరు జిల్లాకు చెందిన చదలవాడ కృష్ణమూర్తికి ఆ ఛాన్స్ దక్కింది. దాంతో మరోసారి రాయపాటి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా ఆ పదవి దక్కించుకోవాలని ఎదురుచూస్తున్న రాయపాటి సాంబశివరావుపై ఈసారి అయినా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి కటాక్షం లభిస్తుందో లేదో మరి. మరోవైపు ఇదే పదవిపై కన్నేసిన ఎంపీ మురళీమోహన్ కూడా తెరవెనుక యత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడిన మురళీమోహన్ టీటీడీ చైర్మన్ పదవిపై మక్కువ పెంచుకున్న విషయం తెలిసిందే. ఇందు కోసం మురళీమోహన్.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇక టీటీడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తితో పాటు పాలకవర్గం పదవీ కాలం పూర్తి కావడంతో కొత్త పాలకవర్గాన్ని ప్రభుత్వాన్ని నియమించనుంది. కాగా ప్రస్తుతం చదలవాడ కృష్ణమూర్తి రాయలసీమ నేత కావడంతో ఈసారి టీటీడీ చైర్మన్ పదవి కోస్తా జిల్లాల వారికే కేటాయించాలని డిమాండ్ తెరమీదకు వస్తోంది. మరి వెంకన్న స్వామి ఎవరిని కరుణిస్తాడో చూడాలి. -
'రాజమండ్రి ఎయిర్ పోర్ట్ విస్తరణకు 170 కోట్లు'
రాజమండ్రి: రాజమండ్రి విమానాశ్రయ విస్తరణను రూ. 170 కోట్లతో చేపట్టనున్నట్లు పార్లమెంట్ సభ్యుడు మాగంటి మురళీమోహన్ బుధవారం తెలిపారు. ఎయిర్ పోర్టుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో మరిన్ని సర్వీసులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో రాజమండ్రి- తిరుపతి- బెంగళూరు, రాజమండ్రి- తిరుపతి- చెన్నై సర్వీసులను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నట్లు మురళీమోహన్ స్పష్టం చేశారు. -
సమసిపోని 'మా' ఎన్నికల వివాదం
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వివాదం ఇంకా సమసిపోలేదు. 'మా' ఎన్నికలపై నటుడు ఓ.కళ్యాణ్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొత్తగా ఎన్నికైన మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్, శివాజీ రాజాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. 'మా' ఎన్నికలకు ముందు కోర్టులో పిటిషన్ - ఆ తరువాత వాడీవేడీ విమర్శలతో ఎన్నికలు జరగడం తెలిసిందే. మార్చి 29న ఎన్నికలు జరిగినా కోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు నిలిపివేశారు. ఆ తరువాత కోర్టు అనుమతితో ఏప్రిల్ 17న ఓట్లను లెక్కించి ఫలితాలు విడుదల చేశారు. సమీప ప్రత్యర్థి జయసుధపై 85 ఓట్ల ఆధిక్యంతో రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. కొత్తగా అధ్యక్షుడుగా ఎన్నికైన రాజేంద్ర ప్రసాద్ ఏప్రిల్ 19న ప్రమాణస్వీకారం కూడా చేశారు. మళ్లీ ఇప్పుడు నటుడు ఓ.కళ్యాణ్ 'మా' ఎన్నికలపై పిటిషన్ దాఖలు చేయడంతో రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్, శివాజీ రాజాలకు నోటీసులు జారీ అయ్యాయి. -
రాజమండ్రికి తెలుగు వర్సిటీ : మురళీమోహన్
రాజమండ్రి: హైదరాబాద్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమండ్రి తరలించడానికి చర్యలు తీసుకుంటానని ఎంపీ మురళీమోహన్ చెప్పారు. రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులోని తెలుగు సాహిత్యపీఠంలో ‘బోయి భీమన్న పద్య, గేయ సాహిత్యం’పై రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది.ఈ సదస్సులో మురళీమోహన్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు మానసపుత్రిక అరుున ఈ విశ్వవిద్యాలయం తరలింపు విషయాన్ని సీఎం చంద్రబాబుతో మాట్లాడి, పుష్కరాలలోగా ప్రకటన వెలువడేందుకు కృషి చేస్తానని చెప్పారు. -
శివాజీ రాజీకే ఏమీ తెలియదు
-
'మురళీమోహన్ ఆధ్వర్యంలో అవకతవకలు'
-
'మురళీమోహన్ ఆధ్వర్యంలో అవకతవకలు'
హైదరాబాద్: మురళీమోహన్ ఆధ్వర్యంలో ఎన్నో అవకతవకలు ఉన్నాయంటూ ఓ కల్యాణ్ మీడియా ముందుకు వచ్చారు. ఆర్థికపరమైన అవకతవకలపై అసోసియేషన్‌కు ఎన్నో ఉత్తరాలు రాశానని, ఒక్క ఉత్తరానికీ సమాధానం లేదని కల్యాణ్ చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే మీ ముందుకు వచ్చానని.. రాజకీయ పార్టీల్లో కూడా ఇంత వ్యతిరేకత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. సీసీఎల్ క్రికెట్ వెనుక మురళీమోహన్ ఉన్నారు. ఎలక్షన్స్ ఉన్నాయంటూ నోటీసుబోర్డులో పెట్టారు. శివాజీ రాజీకే ఏమీ తెలియదు. 'మా' డబ్బును మురళీ మోహన్ రూ.5లక్షలు దేవాలయాలకు ఇచ్చారు. నేనూ గుడి కట్టిస్తా.. మరి నాకూ అలాగే డబ్బులు ఇస్తారా ? 'మా' డబ్బును మురళీమోహన్ వేరే వాళ్లకు ఎందుకు ఇస్తారు.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టాలీవుడ్‌కు ఏదో పట్టుకుంది...
రాజమండ్రి : హాస్య నటుడు ఎంఎస్ నారాయణ మృతి తెలుగు చిత్రపరిశ్రమకు షాకింగ్ న్యూస్ అని సినీనటుడు, టీడీపీ ఎంపీ మురళీమోహన్ అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఎమ్మెస్ నారాయణ ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారన్నారు. సినిమా, సినిమాకు ఆయన హావభావాలు, బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉండేవన్నారు. మొదటి సారిగా ఎంఎస్ నారాయణ తన దగ్గరకు కథ చెప్పడం కోసం వచ్చారని, అనుకోకుండా ఈవీవీ సత్యనారాయణ ద్వారా నటుడుగా మారారని మురళీమోహన్ తెలిపారు. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకూ ఆయన నటన వినూత్నంగానే ఉండేదని గుర్తు చేసుకున్నారు. నిన్న ఆయన మృతిపై వదంతులు వచ్చాయని, దాంతో వెంటనే ఎంఎస్ కుమార్తె శశికిరణ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. అలాగే కిమ్స్ ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి ఎంఎస్ నారాయణ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని కోరినట్లు మురళీమోహన్ తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏదో పట్టుకుందని, 23 రోజుల్లో ఇది నాలుగో చావు అని ఆయన వ్యాఖ్యానించారు. ఎంఎస్ నారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని మురళీమోహన్ పేర్కొన్నారు. -
రాజమండ్రిలో తప్ప ఎక్కడా భూములు లేవు: మురళీమోహన్
గుంటూరు : రాజమండ్రిలో 300 గజాల స్థలం తప్ప తనకు ఎక్కడా భూములు లేవని టీడీపీ ఎంపీ, సినీనటుడు మురళీమెహన్ తెలిపారు. ఆయన శుక్రవారం గుంటూరులో విలేకర్లతో మాట్లాడుతూ తాను రియల్ ఎస్టేట్ వ్యాపారినే అయినా... వైట్ మనీతోనే భూములు కొంటానన్నారు. తన దగ్గర బ్లాక్ మనీ పైసా కూడా లేదని మురళీమోహన్ స్పష్టం చేశారు. తనకు బినామీ స్థలాలు ఉన్నాయని నిరూపిస్తే ఆ భూములను పేదలకు రాసిస్తానని ఆయన సవాల్ విసిరారు. -
అభిప్రాయసేకరణ సమావేశం రసాభాస!
గుంటూరు: గుంటూరు జిల్లాలో రాజధాని ఏర్పాటు కోసం భూసేకరణకు సంబంధించి అభిప్రాయ సేకరణ కోసం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. లింగాయపాలెం వెళ్లిన తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, రాజమండ్రి లోక్‌సభ సభ్యుడు మాగంటి మురళీమోహన్‌లపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకూలంగా ఉన్న రైతులతో మాత్రమే మాట్లాడిస్తున్నారని, వ్యతిరేకించే రైతుల సమస్యలు ఎందుకు వినరని రైతులు ప్రశ్నించారు. ఏకపక్షంగా వ్యవహరించవద్దని వారు చెప్పారు. భూసమీకరణను వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు ఘోరావ్ చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ** -
4,648 ఎంబీబీఎస్ సీట్ల భర్తీ
విజయవాడ: రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్‌లో ఆదివారం కౌన్సెలింగ్ ముగిసే సమయానికి 4,648 ఎంబీబీఎస్, 1,102 బీడీఎస్ సీట్లు భర్తీ అయినట్లు హెల్త్ వర్సిటీ క్యాంప్ ఆఫీసర్ మురళీమోహన్ తెలిపారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొంది నప్పటికీ మెరుగైన కళాశాలల్లో సీట్లకోసం 406 మంది స్లైడింగ్ కాగా, తాజాగా 73 మంది అభ్యర్థులు సీట్లు పొందినట్లు చెప్పా రు. హైదరాబాద్ జేఎన్టీయూ కేంద్రంలో 462 మంది, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 320 మంది, విశాఖ ఆంధ్ర వర్సిటీలో 174, తిరుపతి ఎస్వీయూలో 245 మంది, వరంగల్ కాకతీయలో 142 మంది కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సోమవారం కౌన్సెలింగ్‌కు 6,001 నుంచి 10 వేల ర్యాంకుల వరకు అభ్యర్థులను పిలిచారు. -
లోక్‌సభలో మురళీమోహన్ వ్యాఖ్యల పెనుదుమారం!
క్షమాపణలు చెప్పిన మురళీమోహన్ న్యూఢిల్లీ: లోక్‌సభలో ఈరోజు సినీనటుడు, టిడిపి రాజమండ్రి ఎంపి మురళీ మోహన్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారంలేపాయి. ‘మహిళలు, చిన్నారులపై పెరుగుతున్న అత్యాచారాలు’ అన్న అంశంపై ఈరోజు సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళా సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తి చేశారు. ఆ తరువాత తన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పారు. సభలో ఆయన మాట్లాడుతూ దేశ సంస్కృతిని నిలబెట్టేవిధంగా హుందాగా వస్త్రధారణ చేయాలన్నారు. సంస్కృతీ సంప్రదాయాల విషయంలో భారతదేశానికి ప్రపంచ దేశాల్లో ప్రత్యేక స్థానం ఉందంటూ..వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై మహిళా ఎంపిలు మండిపడ్డారు. అతనిని బయటికి పంపాలని, అతని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎంపీలు రంజీత్ రంజన్, సుష్మితా దేవ్,ప్రియా సులే తదితరులు తీవ్ర నిరసన తెలిపారు. హైదరాబాద్‌లోని మహిళా సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు కూడా మురళీమోహన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజిక కార్యకర్త దేవి మాట్లాడుతూ అతని వ్యాఖ్యలపై మండిపడ్డారు. అటువంటి భావజాలం మార్చుకోవాలన్నారు. మరో సామాజిక కార్యకర్త లక్ష్మి మాట్లాడుతూ ఆడపిల్లని లైంగిక వస్తువుగా చూడకూడదని, అధికారంలో ఉన్నవారే ఆ అంశాలను ప్రచారం చేయాలని అన్నారు. ఆయన సినిమా రంగంలో ఉన్నవారైనందున, అటువంటి అవగాహన కల్పించేవిధంగా సినిమాలు తీయాలని కోరారు. లోక్‌సభ నుంచి బయటకు వచ్చిన అనంతరం మురళీ మోహన్ మీడియాతో మాట్లాడుతూ లోక్‌సభలో తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు నొప్పించి ఉంటే మన్నించండని అడిగారు. -
రెండు దశబ్ధాల కల నెరవేరింది
రాజమండ్రి: నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబి) నిర్మాణానికి ప్రతిపాదనలను ఆమోదం లభించినట్లు విజయవాడ రైల్వే డివిజినల్ డీఎంఆర్ఓ ప్రదిప్ కుమార్ అగర్వాల్ చెప్పారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎంపి మురళీమోహన్ మాట్లాడుతూ నిడదవోలు ప్రజల రెండు దశబ్ధాల కల నెరవేరిందన్నారు. చాలా కాలం నుంచి నిడదవోలులో రైల్వేగేటు వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ గేటు వద్ద బ్రిడ్జి మంజూరైనా నిర్మాణ డిజైన్ ఆమోదం పొందలేదు. పేరుకు రైల్వే జంక్షన్ ప్రాంతమైనా బ్రిడ్జి నిర్మాణం జరగలేదు. ఇప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణానికి అడ్డంకులు అన్నీ తొలగిపోయినట్లు అగర్వాల్ తెలిపారు. -
మీడియా ఉండబట్టే కదా రెచ్చిపోతున్నారు: మురళీమోహన్
నగరం గ్యాస్ పైపులైన్ పేలుడు బాధితులను పరామర్శించేందుకు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చిన రాజమండ్రి ఎంపీ మురళీమోహన్.. ఆ బాధితులపైనే మండిపడ్డారు. ''మీడియా ఉండబట్టే కదా మీరింతగా రెచ్చిపోతున్నారు.. మీడియా ముందు వద్దు, లోపలకు రండి మాట్లాడుకుందాం. అన్నీ ఇచ్చాం కదా, అయినా ఏమీ సాయం అందలేదని అంటారెందుకు'' అంటూ బాధితుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సాయం అందలేదని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, చుట్టపుచూపుగా వచ్చి పలకరించినంత మాత్రాన ఏమీ అయిపోదని కొంతమంది బాధితులు ఎంపీ మురళీమోహన్ను కాకినాడ ఆస్పత్రిలో నిలదీశారు. తమ బతుకులు బుగ్గి అయిపోయాయని, కొబ్బరిచెట్లు మొత్తం కాలిపోయాయని, ఇళ్లు ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయని, అయినా ఎవరూ ఆదుకోలేదని అన్నారు. దాంతో మురళీమోహన్‌కు ఎక్కడలేని కోపం వచ్చింది. ''అన్నీ చేస్తున్నా.. ఏమీ ఇవ్వట్లేదని ఎందుకు అంటారు? డబ్బులు ఇచ్చాం కదా.. ఏ ప్రభుత్వానివైనా డబ్బులు డబ్బులే'' అన్నారు. అంతేకాదు, మీడియా ముందు మాట్లాడొద్దని.. అన్ని విషయాలు లోపలకు వెళ్లి మాట్లాడుకుందామని అన్నారు. ఇంకా ఏదో అడగబోతుంటే.. మీడియా ఉండబట్టే కదా మీరింతగా రెచ్చిపోతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలువ నీడ కూడా లేకుండా పోయిన తమవాళ్లను ఎవరూ పట్టించుకోవట్లేదని, కనీస సాయం కూడా అందించలేదని మరికొందరు మహిళలు ఆయన దృష్టికి తీసుకురాగా, అందరినీ సొంతమనుషుల్లా అనుకుని వాళ్లను కూడా మీరే చూసుకోవాలని చెప్పారు. -
'మీడియా ఉండబట్టే కదా రెచ్చిపోతున్నారు'
-
మురళీమోహన్ను వివరణ కోరిన రిటర్నింగ్ అధికారి
రాజమండ్రి: రాజమండ్రి లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా మురళీమోహన్ దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్‌పై వైఎస్ఆర్ సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తన భార్య ఆస్తుల వివరాలు మురళీమోహన్ తప్పుగా చూపించారని ఆ పార్టీ ఆరోపించింది. వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన ఫిర్యాదుపై అఫిడవిట్‌ను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి మురళీమోహన్ను వివరణ కోరుతున్నారు. -
సీనియర్ జర్నలిస్టు మురళీమోహన్‌కు అంత్యక్రియలు
చిలకలూరిపేట, న్యూస్‌లైన్: సాక్షి దినపత్రికలో చీఫ్ సబ్ఎడిటర్గా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు పులిపాక మురళీమోహనరావు(57) అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో సోమవారం సాయంత్రం అశృనయనాలనడుమ సాగింది. ఈయన గుండెపోటుతో ఆదివారం హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో మృతిచెందిన విషయం విదితమే. ఈయనకు భార్య సువర్చల, కుమారులు రామలక్ష్మణులు, కుమార్తె విజయలక్ష్మి ఉన్నారు. భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో సోమవారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకువచ్చారు. గ్రామంలోని హిందు శ్మశాన వాటికలో అంతక్రియలు నిర్వహించారు. భౌతికకాయాన్ని గుంటూరు సాక్షి దినపత్రిక బ్రాంచి మేనేజర్ ఆర్.రామచంద్రరెడ్డి, ఏపీయూడబ్యూజే జిల్లా అధ్యక్షుడు పి భక్తవత్సలరావు, తదితరులు సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.