
'మురళీమోహన్ ఆధ్వర్యంలో అవకతవకలు'
హైదరాబాద్: మురళీమోహన్ ఆధ్వర్యంలో ఎన్నో అవకతవకలు ఉన్నాయంటూ ఓ కల్యాణ్ మీడియా ముందుకు వచ్చారు. ఆర్థికపరమైన
అవకతవకలపై అసోసియేషన్కు ఎన్నో ఉత్తరాలు రాశానని, ఒక్క ఉత్తరానికీ సమాధానం లేదని కల్యాణ్ చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే మీ ముందుకు వచ్చానని.. రాజకీయ పార్టీల్లో కూడా ఇంత వ్యతిరేకత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
సీసీఎల్ క్రికెట్ వెనుక మురళీమోహన్ ఉన్నారు.
ఎలక్షన్స్ ఉన్నాయంటూ నోటీసుబోర్డులో పెట్టారు.
శివాజీ రాజీకే ఏమీ తెలియదు.
'మా' డబ్బును మురళీ మోహన్ రూ.5లక్షలు దేవాలయాలకు ఇచ్చారు.
నేనూ గుడి కట్టిస్తా.. మరి నాకూ అలాగే డబ్బులు ఇస్తారా ?
'మా' డబ్బును మురళీమోహన్ వేరే వాళ్లకు ఎందుకు ఇస్తారు.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు.