విజయవాడ: రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్‌లో ఆదివారం కౌన్సెలింగ్ ముగిసే సమయానికి 4,648 ఎంబీబీఎస్, 1,102 బీడీఎస్ సీట్లు భర్తీ అయినట్లు హెల్త్ వర్సిటీ క్యాంప్ ఆఫీసర్ మురళీమోహన్ తెలిపారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొంది నప్పటికీ మెరుగైన కళాశాలల్లో సీట్లకోసం 406 మంది స్లైడింగ్ కాగా, తాజాగా 73 మంది అభ్యర్థులు సీట్లు పొందినట్లు చెప్పా రు. హైదరాబాద్ జేఎన్‌టీయూ కేంద్రంలో 462 మంది, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 320 మంది, విశాఖ ఆంధ్ర వర్సిటీలో 174, తిరుపతి ఎస్‌వీయూలో 245 మంది, వరంగల్ కాకతీయలో 142 మంది కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సోమవారం కౌన్సెలింగ్‌కు 6,001 నుంచి 10 వేల ర్యాంకుల వరకు అభ్యర్థులను పిలిచారు.