Medical Counseling
-
వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పీజీ మెడికల్ సీట్ల కౌన్సెలింగ్ రద్దు
విజయవాడ: వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పీజీ మెడికల్ సీట్ల కౌన్సిలింగ్ రద్దయ్యింది. మెడికల్ కళాశాలల సీట్ల భర్తీలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అవతవకలు పాల్పడ్డాయి. ఈ విషయాన్ని గుర్తించిన (నేషనల్ మెడికల్ కమిషన్) ఎన్ఎంసీ.. కౌన్సిలింగ్ ప్రక్రియను నిలిపివేసింది. ఎన్ఎంసీ నుంచి సీట్ల పెంపుదలపై ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు నకిలీ ఆదేశాలు వచ్చాయి. ఈ అవతవకల విషయం వెలుగులోకి రావడంతో తిరిగి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీకి ఆదేశాలు జారీ చేసింది ఎన్ఎంసీ. నంద్యాల శాంతి రామ్ మెడికల్ కాలేజీలో 7 ఎండి జనరల్ మెడిసిన్ సీట్లకు బదులుగా, 24 సీట్లను భర్తీ చేశారని గుర్తించిన ఎన్ఎంసీ.. రాజమహేంద్రవరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లో 24 సీట్లుండగా 40 జనరల్ మెడిసిన్ సీట్లను భర్తి చేసినట్లు పసిగట్టింది. విజయనగరం మహారాజా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎక్కువ సీట్లు భర్తీ చేసినట్లు గుర్తించారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలలకి ఎన్ఎంసీ పేరుతో ఫేక్ ఆర్డర్స్ వచ్చినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో కొందరి ఉద్యోగుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి దొంగలను గుర్తించే పనిలో నిమగ్నమైంది ఎన్ఎంసీ. మూడు మెడికల్ కళాశాలలపై చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కౌన్సిలింగ్ ప్రక్రియ రద్దు కావడంతో విద్యార్ధులు ఇబ్బంధి పడకుండా యూనివర్సిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. -
నీట్–పీజీ ప్రత్యేక కౌన్సిలింగ్ వద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: అఖిల భారత కోటాలో మిగిలిపోయిన 1,456 నీట్–పీజీ–2021 సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సిలింగ్ చేపట్టాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వైద్య విద్య ప్రయోజనాల దృష్ట్యా వాటిని భర్తీ చేయరాదన్న కేంద్రం, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (ఎంసీసీ) నిర్ణయాన్ని సమర్థించింది. వైద్య విద్యతోపాటు ప్రజారోగ్యంతో సంబంధమున్న ఈ అంశంలో ఎలాంటి రాజీ ఉండరాదని స్పష్టం చేసింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల వెకేషన్ బెంచ్ శుక్రవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ‘‘విద్యా సంవత్సరం మొదలై ఏడాదవుతోంది. 9 వరకు రౌండ్ల కౌన్సిలింగ్ పూర్తయింది. జూలై నుంచి నీట్–పీజీ–2022 కౌన్సిలింగ్ కూడా మొదలు కానుంది. ఇలాంటప్పుడు విద్యార్థులు ఖాళీల భర్తీ కోరడం సరికాదు’’ అని సూచించింది. -
నీట్ పీజీ కటాఫ్‌లో...15 పర్సంటైల్ తగ్గింపు
న్యూఢిల్లీ: పీజీ మెడికల్ సీట్ల ఖాళీల భర్తీకి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2021 నీట్–పీజీలో అన్ని కేటగిరీల్లోనూ కటాఫ్‌ను 15 పర్సంటైల్ మేరకు తగ్గించాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌ను ఆదేశించింది. ఎన్బీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మినూ బాజ్‌పాయ్‌కి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) సభ్య కార్యదర్శి బి.శ్రీనివాస్ ఈ మేరకు లేఖ రాశారు. అన్ని అంశాలనూ చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఆ మేరకు క్వాలిఫయింగ్ కటాఫ్ జనరల్ కేటగిరీకి 35వ పర్సెంటైల్‌కు, ఫిజికలీ హాండీక్యాప్డ్ (జనరల్)కు 30కి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వుడ్ కేటగిరీలకు 25 పర్సెంటైల్‌కు తగ్గించాలని పేర్కొన్నారు. ఆలిండియా, రాష్ట్రాల కోటాల్లో రెండేసి రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత కూడా దాదాపు 8,000 సీట్లు మిగిలిపోనున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నేషనల్ మెడికల్ కమిషన్‌తో విస్తృతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ‘‘దీనివల్ల సీట్ల వృథాకు అడ్డుకట్ట పడుతుంది. తాజా నిర్ణయం వల్ల కనీసం మరో 25 వేల మంది అభ్యర్థులు ప్రస్తుత కౌన్సెలింగ్‌లో మాప్ రౌండ్లో పాల్గొనగలరు’’ అని చెప్పారు. (చదవండి: భారత్‌లో చదువుతామంటూ...‘ఉక్రెయిన్’ విద్యార్థుల పిటిషన్) -
మెడికల్ కౌన్సిల్’ కేసులో ముగ్గురి అరెస్ట్
సాక్షి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) డేటాబేస్ ట్యాంపరింగ్ చేసి, అనర్హులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేసిన వ్యవహారంలో సీనియర్ అసిస్టెంట్ కందుకూరి అనంతకుమార్ సూత్రధారిగా తేలింది. చైనాలో మెడిసిన్ పూర్తి చేసిన వారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) పరీక్ష పాస్ అయితేనే రిజిస్ట్రేషన్‌కు ఆస్కారం ఉంటుందని, పాస్ కాని వారి నుంచి రూ.9 లక్షల చొప్పున వసూలు చేసిన కుమార్ సర్టిఫికెట్లు జారీ చేశాడని అదనపు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. జేసీపీ డాక్టర్ గజరావ్ భూపాల్, ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులతో కలిసి గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇబ్రహీంపట్నానికి చెందిన కసరమోని శివానంద్, కర్మన్‌ఘాట్ వాసి తోట దిలీప్ కుమార్ స్నేహితులు. వీరు చైనాలో ఎంబీబీఎస్ చదివారు. 2012లో సర్టిఫికెట్ పొంది తిరిగి వచ్చారు. ఇలా విదేశాల్లో వైద్య విద్యనభ్యసించిన వారు ఇక్కడ ప్రాక్టీసు చేయాలంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) ఉత్తీర్ణులు కావాలి. అత్యంత కఠినంగా ఉండే ఈ పరీక్షను ఎంసీఐ ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తుంది. ఈ ద్వయం 2012–14 మధ్య రెండుసార్లు పరీక్షకు హాజరైనా ఉత్తీర్ణులు కాలేదు. పాస్ అయితే కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగదు. దీంతో వీళ్లిద్దరూ ‘ప్రత్యామ్నాయ మార్గాలు’ అన్వేషించారు. వీరికి ఓ స్నేహితుడు (ప్రస్తుతం దుబాయ్‌లో) ద్వారా టీఎస్‌ఎంసీలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న అనంతకుమార్‌తో పరిచయమైంది. 2017లో అతడిని కలిసి తమ అవసరాన్ని చెప్పారు. దీంతో ఒక్కొక్కరి నుంచి రూ.9 లక్షల చొప్పున వసూలు చేసిన అనంతకుమార్ 2016లో రిజిస్టర్ చేసుకున్న వైద్యుల రిజిస్ట్రేషన్ నంబర్లు వీరికి కేటాయించాడు. ఈ మేరకు టీఎస్ఎంసీ డేటాబేస్‌లో మార్పుచేర్పులు చేసి, వీరిద్దరికీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందించాడు. ఇటీవల అసలు వైద్యులు రెన్యువల్, అర్హతలు అప్డేట్ కోసం టీఎస్ఎంసీకి రావడంతో విషయం తెలిసింది. టీఎస్ఎంసీ ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుల కోసం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలోని టీమ్ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకుంది. వీరి వద్ద నకిలీ టీఎస్ఎంసీ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ... ఎంసీఐ సర్వర్‌లో మాత్రం ఎంటర్ కాలేదు. దీంతో అందులో అసలు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలే కనిపిస్తున్నాయి. చిక్కుతామని భయపడిన వీరు ప్రాక్టీసు చేయకుండా వైద్య సంబంధ ఉద్యోగాలు చేస్తున్నారు. అనంతకుమార్ వీరిద్దరితో పాటు శ్రీనివాస్, నాగమణిలకు ఈ తరహాలో సహకరించినట్లు అనుమానాలున్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్న వారి వివరాలు ఆరా తీస్తున్నామన్నారు. శివానందం 2012–16 మధ్య, దిలీప్ 2016 –18 మధ్య సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో డ్యూ టీ డాక్టర్లుగా పని చేశారు. టీఎస్ఎంసీ సర్టిఫికెట్ లేని శివానందంకు ఉద్యోగం ఎలా వచ్చిందనేది ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం వీరిలో ఒకరు మెడికల్ కంపెనీలో, మరొకరు వైద్యులకు అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. (చదవండి: తమ్ముడి ఇంట్లో తుపాకీ పెట్టాడు!) -
గడువులోగా మెడికల్ కౌన్సెలింగ్ పూర్తి
లబ్బీపేట(విజయవాడతూర్పు): మెడికల్ అడ్మిషన్స్లో ఈ ఏడాది సాంకేతిక, న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో వాటిని పరిష్కరిస్తూ ప్రక్రియను కొనసాగిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం వీసీ డాక్టర్ పి.శ్యామ్‌ప్రసాద్ చెప్పారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ణయించిన సమయానికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. యూనివర్సిటీ యూజీ, పీజీ అడ్మిషన్ల ప్రక్రియను ఆయన గురువారం మీడియాకు వివరించారు. యూనివర్సిటీ అడ్మిషన్లకు సంబంధించి పదేళ్లుగా ఒకే సాఫ్ట్వేర్ సంస్థను వినియోగిస్తుండటంతో ఆడిట్ అభ్యంతరాలు తలెత్తాయని, దీంతో టెండర్లు పిలవగా.. హైదరాబాద్‌కు చెందిన సంస్థ టెండర్ దక్కించుకుందని తెలిపారు. అపోహలకు తావులేదు.. యూనివర్సిటీ పరిధిలోని వైద్య కళాశాలల్లో మొత్తం 2,342 పీజీ/డిప్లమో సీట్లుండగా, వాటిలో 50 శాతం నేషనల్ పూల్‌కు పోను, రాష్ట్ర కోటాగా 38 స్పెషాలిటీల్లో 1,171 సీట్లకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యూనివర్సిటీ పీజీ, డిప్లమో సీట్ల భర్తీకి నవంబర్ 3న నోటిఫికేషన్ ఇచ్చినట్టు వీసీ తెలిపారు. వెబ్సైట్లో కొన్ని సాంకేతిక పరమైన చిక్కులతో డిసెంబర్ 23న రీ నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. మెరిట్ లిస్టును జనవరి 19న ప్రకటించి, నాన్ సర్వీసు కోటాకు సంబంధించి ఫిబ్రవరి 1న సీట్ల అలాట్మెంట్ చేశామన్నారు. కొన్ని లోపాలు తలెత్తినట్టు నిపుణుల కమిటీ గుర్తించి, వాటిని రద్దు చేసి, ఫిబ్రవరి 2న రీ నోటిఫికేషన్ ఇచ్చినట్టు చెప్పారు. ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో 7న సీట్లు అలాట్ చేసి, 14లోపు జాయిన్ అవ్వాలని ఆదేశాలిచ్చామన్నారు. సర్వీసు కోటాకు సంబంధించి తెలంగాణ వారికీ సీట్లు కేటాయించాలని కోర్టు ఉత్తర్వుల మేరకు వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఈ నెల 13న నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. సర్వీస్ కోటాలో మిగిలిన సీట్లు నాన్ సర్వీస్ కోటాలో భర్తీ చేస్తామని తెలిపారు. మార్చి 7 నాటికి పీజీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేస్తామని, ఇందుకోసం యూనివర్సిటీ సిబ్బంది పబ్లిక్ హాలిడేస్, ఆదివారాల్లో సైతం పనిచేస్తున్నారని, ఎలాంటి అపోహలకు తావులేదని వీసీ వివరించారు. యూజీకి 14 వేల దరఖాస్తులు.. ఎంబీబీఎస్, ఎండీఎస్ అడ్మిషన్ల కోసం జనవరి 28న నోటిఫికేషన్ ఇచ్చినట్టు తెలిపారు. నోటిఫికేషన్ గడువు ఫిబ్రవరి 8తో ముగిసిందని, ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన జరుగుతోందన్నారు. ఈ నెల 25తో పరిశీలన పూర్తి చేసి, 28న ఫైనల్ మెరిట్ లిస్టు ప్రకటిస్తామని వీసీ వివరించారు. మార్చి మొదటి వారంలో మొదటి దశ, రెండో వారంలో రెండో దశ, మూడో వారంలో మూడో ఫేస్ యూజీ కౌన్సెలింగ్ నిర్వహించి మార్చి 19 నాటికి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. -
25 నుంచి నీట్ పీజీ–2021 కౌన్సెలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) పీజీ–2021 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ(ఎంసీసీ) శుక్రవారం విడుదల చేసింది. మొదటి రౌండ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈనెల 25 నుంచి 29 వరకు జరుగనుంది. రెండో రౌండ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ నవంబర్ 15 నుంచి 19 వరకు ఉంటుంది. మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ నవంబర్ 1, 2 తేదీల్లో జరుగుతుంది. ఈ ప్రక్రియ ఫలితాలు నవంబర్ 3న విడుదలవుతాయి.రాష్ట్ర నీట్ పీజీ కోటా సీట్ల కోసం కౌన్సెలింగ్‌ను సంబంధిత రాష్ట్ర వైద్య కౌన్సెలింగ్ కమిటీలు నిర్వహిస్తాయని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ప్రకటించింది. 50 శాతం ఆల్ ఇండియా కోటా, డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీలు, ఏఎఫ్ఎంఎస్ (ఎండీ/ఎంఎస్/డిపొ్లమా/పీజీ డీఎన్బీ) సీట్ల భర్తీకి నీట్ పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహించనుంది. కాగా డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీ సీట్లు, పీజీ డీఎన్బీ సీట్ల ప్రవేశానికి అదనపు మోప్–అప్ రౌండ్ నిర్వహించనున్నారు. ఆఖరున మిగిలిన సీట్ల కోసం ప్రత్యేకంగా మరో రౌండ్ కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. -
రిజర్వేషన్లు పాటించకుంటే యూనివర్సిటీ ముట్టడి: జాజుల
సాక్షి,హైదరాబాద్: మెడికల్ కౌన్సెలింగ్‌లో రిజర్వేషన్లు పాటించకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మెడికల్ సీట్లు దక్కకుండా చేశారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు, వీసీ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించకపోతే ఈనెల 17న కాళోజీ యూనివర్సిటీని ముట్టడిస్తామని జాజుల హెచ్చరించారు. 550 జీవోను అమలు చేయకుండా, యూనివర్సిటీ అధికారులకు వక్ర భాష్యం చెబుతూ ఉన్నతాధికారులను, సంబంధిత మంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. జరిగిన రెండో కౌన్సెలింగ్‌ను రద్దు చేసి, మూడో కౌన్సెలింగ్‌లో రిజర్వేషన్లు పూర్తిగా అమలయ్యేలా చూడాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. -
నేషనల్ పూల్‌లో మిగిలిన ఎంబీబీఎస్ సీట్లు 67
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల నుంచి నేషనల్ పూల్‌కి ఇచ్చిన 15% కోటా ఎంబీబీఎస్ సీట్లలో కొన్ని మిగిలిపోయాయి. దీంతో వాటిని తిరిగి రాష్ట్రానికి కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో మెడికల్ కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులకు ప్రభుత్వ సీట్లు దక్కనున్నాయి. నేషనల్ పూల్‌కు రాష్ట్రం నుంచి 225 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించగా, జాతీయ స్థాయిలో వాటికి 2 కౌన్సెలింగ్‌లు నిర్వహించారు. వాటిలో 158 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 67 సీట్లు మిగిలినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ తెలిపింది. జాతీయ స్థాయిలో 2 కౌన్సెలింగ్‌లు నిర్వహించాక మిగిలిపోయే సీట్లను ఆయా రాష్ట్రాలకు తిరిగి కేటాయించాలన్న నిబంధన ఉంది. ఆ ప్రకారం 2 కౌన్సెలింగ్‌లు పూర్తవడంతో మిగిలిన సీట్లను కేంద్రం తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో రాష్ట్రస్థాయిలో నిర్వహించే మూడో విడత కౌన్సెలింగ్‌లో మరికొందరు విద్యార్థులకు ఈ సీట్లను కేటాయించే అవకాశం ఏర్పడింది. కన్వీనర్ కోటా సీట్లకు రాష్ట్రంలో మూడో విడత కౌన్సెలింగ్ వచ్చే నెల 1న ప్రారంభం కానుంది. -
వైద్య విద్య కౌన్సెలింగ్‌లో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత కోటా సీట్లకు జరుగుతున్న నీట్–2019 కౌన్సెలింగ్‌లో గందర గోళం నెలకొంది. మొదటి కౌన్సెలింగ్‌లో సీట్లు సాధించిన విద్యార్థుల మెరిట్ జాబితాను ఉప సంహరించుకోవడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎట్టకేలకు సవరించిన జాబితాను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) మంగళవారం రాత్రి విడుదల చేసింది. అయితే ఎందుకు రద్దు చేశారన్న దానిపై స్పష్టతివ్వలేదు. దీనిపై తెలంగాణలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వర్గాలూ ఏమీ చెప్పడం లేదు. సవరించిన జాబితాను వెబ్సైట్ ఝఛిఛి.nజీఛి.జీnలో చూడ వచ్చు. మొదటి మెరిట్ జాబితా ఉపసంహరించుకోవటానికి గల కారణం స్పష్టం చేయకపోవడంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం నుంచి సవరించిన జాబితాలో పేరున్న అభ్యర్థులు తమ కేటాయింపు లేఖను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. టాప్–20లో 18 మంది అక్కడే.. నీట్లో టాప్–20 ర్యాంకులు సాధించిన వారిలో 18 మంది ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీని ఎంచుకున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. మహిళల్లో జాతీయ ఫస్ట్ ర్యాంకు సాధించిన మాధురీరెడ్డి జాతీయస్థాయిలో ప్రముఖ మెడికల్ కాలేజీనే ఎంచుకున్నట్లు వర్సిటీ వర్గాలు చెబుతున్నా యి. అఖిల భారత కోటా కింద తెలంగాణలో ఏ కాలేజీని.. ఎవరెవరు ఎంచుకున్నారన్న సమాచారం తమ వద్ద లేదని వారంటున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాపై అస్పష్టత.. రాష్ట్రంలోనూ వైద్య విద్య కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే కన్వీనర్, మేనేజ్మెంట్ కోటా సీట్లకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. కన్వీనర్ కోటా సీట్లకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయింది. అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లకు మాత్రం అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్)కు రిజర్వేషన్లను అమలు చేసేందుకు 190 సీట్లను అదనంగా కేంద్రం కేటాయించిన సంగతి తెలిసిందే. అందులో ఎవరికీ సందేహాలు లేవు. కానీ ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్లలోనూ ఈడబ్ల్యూఎస్‌ను అమలు చేస్తామని కేంద్రం తెలిపింది. అందుకోసం దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆ మేరకు గత నెల 28వ తేదీ వరకు గడువు విధించింది. అందుకోసం రాష్ట్రంలోని 10 ప్రైవేటు మెడికల్ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. కానీ ఇప్పటివరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) సీట్ల పెంపుపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే కన్వీనర్ కోటా సీట్లకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయింది. అంటే ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్లకు మరి ఎప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు కేటాయిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. సకాలంలో సీట్లు కేటాయించకుంటే పరిస్థితి ఏంటనేది కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్న కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీని, అలాగే అదనపు సీట్ల కోసం ఎదురుచూస్తున్న ఆ 10 ప్రైవేటు మెడికల్ కాలేజీలను వేధిస్తుంది. -
పాత పద్ధతిలోనే మెడికల్ కౌన్సెలింగ్..
సాక్షి, న్యూఢిల్లీ: పాతపద్ధతిలోనే మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 550కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైద్య ఆరోగ్యశాఖ సుప్రీంలో అప్పీలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం.. హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ పాత పద్దతి ప్రకారమే మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించింది. అంతేకాకుండా జీవో 550లో మార్పులు చేయాలని కూడా పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన విద్యార్థి ఎవరైనా ఒక మెడికల్ కాలేజీలో ఓపెన్ కేటగిరీలో సీటు పొంది చేరాక, అతనికి మరో మంచి కాలేజీలో రిజర్వేషన్ కేటగిరీలో సీటు వస్తే అక్కడ చేరుతున్న పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఖాళీ చేసిన ఓపెన్ కేటగిరీ సీటును అదే రిజర్వేషన్ విద్యార్థికి కేటాయించేలా గతంలో ప్రభుత్వం జీవో నంబర్ 550 తీసుకొచ్చింది. ఈ జీవోపై ఇటీవల స్టే ఇచ్చిన హైకోర్టు, తర్వాత ఆ స్టేను సమర్థ్ధిస్తూ తీర్పునిచ్చింది. మరోవైపు ఆగస్టు 31లోపు దేశ వ్యాప్తంగా మెడికల్ కౌన్సెలింగ్‌లు పూర్తి చేయాలి. ఇప్పటికే జాతీయస్థాయి కౌన్సెలింగ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో సీట్ల భర్తీ ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. -
‘మెడికల్’ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించండి
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించి ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవో నం.550 నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలంటూ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. జీవో అమలు చేయడంలో ఎదురైన ఇబ్బందులపై చంద్రబాబు శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైకోర్టు ఉత్తర్వుల వల్ల నష్టపోతున్నామని రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంబీబీఎస్ సీట్ల భర్తీ 2001లో జారీచేసిన జీవో నం.550 ప్రకారం జరుగుతోంది. ఈ జీవో ప్రకారం రిజర్వు కేటగిరీ అభ్యర్థి ఓపెన్ కేటగిరీలో సీటు తీసుకుని, ఆ తర్వాత దానిని వదులుకుంటే.. ఆ సీటును మళ్లీ అదే రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థితో భర్తీ చేయాలి. అయితే దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాల్సిన సీట్లను ఓపెన్ కేటగిరీలో వదులుకున్న రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేయడం సరికాదని, దీనిపై న్యాయం చేయాలని అభ్యర్థించారు. స్పందించిన హైకోర్టు గతేడాది మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీడీపీ సర్కార్‌కు సూచించింది. కానీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చెయ్యలేదు. గత ఏడాది హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులనే ఈ ఏడాది కౌన్సెలింగ్‌కు కూడా అమలు చేయడంతో రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం ఈ ఏడాది హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన హైకోర్టు.. ప్రతిభకు నష్టం జరుగుతుందని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్ 50 శాతాన్ని మించుతోందని పేర్కొంటూ జీవో నం.550ని నిలిపివేసింది. ఇప్పటి వరకూ దీనిని పట్టించుకోని సర్కార్.. రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్ కూడా చివరి దశకు వచ్చిన తరుణంలో సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామనడం వల్ల ఉపయోగమేమిటని పలువురు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ప్రభుత్వం తరఫున వేర్వేరుగా రెండు పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. 23న ఏయూలో ‘జ్ఞానభేరి’ ఈనెల 23న విశాఖ జిల్లా ఆంధ్ర యూనివర్సిటీలో జ్ఞానభేరి కార్యక్రమం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇటీవల శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీలు, ఉన్నత విద్యామండలికి చెందిన రూ.కోట్ల నిధులు ఖర్చు చేసి జ్ఞానభేరి పేరిట ప్రభుత్వ ప్రచార కార్యక్రమం నిర్వహించడమేమిటని విద్యార్థి, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. అయినా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఏయూలో అయిపోయిన తర్వాత.. కాకినాడ జేఎన్టీయూ లేదా అనంతపురం జేఎన్టీయూలో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. కాగా, ఉండవల్లిలోని తన నివాసం నుంచి గ్రామ వికాసం కార్యక్రమంపై టీడీపీ నాయకులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని గ్రామాలు, వార్డుల్లో పర్యటించి ప్రజల్ని చైతన్యపరచాలని సూచించారు. కేరళ ముఖ్యమంత్రికి చంద్రబాబు ఫోన్ కేరళలో వరద పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ను సీఎం చంద్రబాబు ఆరా తీశారు. శనివారం ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. సాయమందించడానికి సిద్ధంగా ఉన్నామని, నిధుల సమీకరణకు సహాయపడతామని హామీ ఇచ్చారు. -
రెండో విడత కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో మిగిలిన సీట్లకు, అఖిల భారత కోటాలో మిగిలిన సీట్లకు ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు ఈ కౌన్సెలింగ్ జరగనుంది. అందుకోసం విద్యార్థులు శనివారం ఉదయం 8 నుంచి ఈ నెల 20 మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. అన్ని కేటగిరీ సీట్లకూ కౌన్సెలింగ్ జరుపుతారు. ఇక మొదటి విడతలో సీటు పొంది చేరనివారు ఈసారి అదే కోర్సుకు వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి అనుమతించరు. వాస్తవంగా రెండోవిడత కౌన్సెలింగ్ ఈ నెల 12వ తేదీ నాటికే పూర్తికావాలి. జీవో నంబర్ 550కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో రెండో విడత కౌన్సెలింగ్‌పై ఇప్పటివరకు అనిశ్చితి నెలకొంది. చివరకు రెండో విడత కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. 444 ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు కౌన్సెలింగ్ అఖిల భారత కోటా సీట్లలో చేరాక తిరిగి రాష్ట్రానికి కేటాయించిన 63 మిగులు సీట్లతో కలుపుకొని మొత్తం 444 ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లున్నాయి. అందులో ఎంబీబీఎస్ 194, బీడీఎస్ 250 సీట్లున్నాయి. వాటిల్లో చేరేందుకు విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. వాటికి రెండోవిడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ప్రైవేటు కాలేజీల్లోని ఎన్ఆర్ఐ సీట్లు ఇంకా మిగిలే ఉన్నాయి. చాలామంది విద్యార్థులు సమీప రాష్ట్రాల్లోని డీమ్డ్ వర్సిటీల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అక్కడ ఫీజు తక్కువుండటంతో విద్యార్థులు అటువైపు మొగ్గుచూపుతున్నారు. పైగా మరో రెండు కౌన్సెలింగ్‌లు డీమ్డ్ వర్సిటీల్లో ఉండటంతో అటువైపు వెళ్తున్నట్లు అంచనా. -
‘మెడికల్’ రెండో విడత మరింత ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహణ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జీవో నంబర్ 550కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. దీంతో రెండో విడత కౌన్సెలింగ్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన విద్యార్థి ఎవరైనా ఒక మెడికల్ కాలేజీలో ఓపెన్ కేటగిరీలో సీటు పొంది చేరాక, అతనికి మరో మంచి కాలేజీలో రిజర్వేషన్ కేటగిరీలో సీటు వస్తే అక్కడ చేరుతున్న పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఖాళీ చేసిన ఓపెన్ కేటగిరీ సీటును అదే రిజర్వేషన్ విద్యార్థికి కేటాయించేలా గతంలో ప్రభుత్వం జీవో నంబర్ 550 తీసుకొచ్చింది. ఈ జీవోపై ఇటీవల స్టే ఇచ్చిన హైకోర్టు, తర్వాత తానిచ్చిన స్టేను సమర్థ్ధిస్తూ తాజాగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఢిల్లీకి వెళ్లారు. ఇదిలా ఉండగా రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహించేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి చేసుకొని సీట్లు పొందిన విద్యార్థులు మెడికల్ కాలేజీల్లో తరగతులకు హాజరవుతున్నారు. రెండో విడత కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. జీవో నంబర్ 550పై హైకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నందున కౌన్సెలింగ్ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చాకే కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయని కొందరు అంటున్నారు. అయితే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ప్రకారం ఈ నెలాఖరులోగా మెడికల్ కౌన్సెలింగ్ పూర్తి చేసి అడ్మిషన్ల ప్రక్రియను ముగించాలి. అప్పటిలోగా కౌన్సెలింగ్ నిర్వహించలేని పరిస్థితుల్లో ఎంసీఐ అనుమతి ఇవ్వాలి. కానీ అంత సులువుగా ఎంసీఐ అనుమతి ఇచ్చే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో ఏం చేయాలన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. రెండో విడతలో 444 ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది. -
రెండో విడత కౌన్సెలింగ్‌పై తొలగని అనిశ్చితి
సాక్షి, హైదరాబాద్: రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహణపై రాష్ట్రంలో అనిశ్చితి కొనసాగుతోంది. మొన్నటివరకు అఖిల భారత కోటా సీట్ల రెండో విడత కౌన్సెలింగ్ ఫలితాలు వెల్లడి కాకపోవడంతో రాష్ట్రంలో సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ నిలిపివేశారు. తాజాగా రెండో విడత కౌన్సెలింగ్ ఫలితాలు వెల్లడయ్యాయి. కానీ జీవో నంబర్ 550పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలో రెండో విడత కౌన్సెలింగ్‌పై ప్రభుత్వం సందిగ్ధంలో పడిపోయింది. మొదటి విడత కౌన్సెలింగ్ సమయంలోనూ ఈ జీవోపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇప్పుడు అదే పద్ధతిలో వెళ్లాలా లేదా అన్న విషయంపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహించాలన్నది ఇంకా నిర్ణయిం చలేదని, సోమవారం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని కలిశాక ఏం చేయా లన్న దానిపై ఒక అంచనాకు వస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన విద్యార్థి ఎవరైనా ఒక మెడికల్ కాలేజీలో ఓపెన్ కేటగిరీలో సీటు పొంది చేరాక, అతనికి మరో కాలేజీలో రిజర్వేష న్ కేటగిరీలో సీటు వస్తే అక్కడ చేరుతున్న పరి స్థితి నెలకొంటోంది. అలాంటి పరిస్థితుల్లో ఖాళీ చేసిన ఓపెన్ కేటగిరీ సీటును అదే రిజర్వేషన్ విద్యార్థికి కేటాయించేలా గతంలో ప్రభుత్వం జీవో నంబర్ 550 తీసుకొచ్చింది. ఎక్కువ మార్కులు వచ్చి ఓపెన్ కేటగిరీలో సీటు దక్కించుకునే అభ్యర్థులను రిజర్వేషన్ కింద లెక్కించకూడదని, ఇది రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంటూ ఇటీవల హైకోర్టు తీర్పునిచ్చింది. కాగా, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లాలని పలు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘా లు డిమాండ్ చేస్తున్నాయి. 444 సీట్లకు జరగాల్సిన కౌన్సెలింగ్ అఖిల భారత కోటా సీట్లలో చేరాక మిగిలిన వాటిని తిరిగి రాష్ట్రానికి కేటాయించిన 63 సీట్ల తో కలుపుకొని మొత్తం 444 ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లు మిగిలాయి. ఈ నెల 12కి రెండో విడత కౌన్సెలింగ్ అయిపోవాల్సి ఉంది. కానీ పై కార ణాలతో కౌన్సెలింగ్ వాయిదా పడుతోంది. -
‘రెండో విడత’పై అయోమయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్ నిలిచిపోయింది. అఖిల భారత కోటా సీట్లకు జరిగిన రెండో విడత కౌన్సెలింగ్ ఫలితాలు ప్రకటించకపోవడంతో ఆ ప్రభావం ఇక్కడి కౌన్సెలింగ్‌పై పడింది. రెండో విడత కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారో అయోమయం నెలకొనడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. బుధవారం నుంచే ఎంబీబీఎస్, బీడీఎస్ తరగతులు ప్రారంభం కానుండటంతో అందరిలోనూ టెన్షన్ మొదలైంది. పెరిగిన అవకాశాలు ‘నీట్’ప్రవేశ పరీక్ష ఆధారంగానే దేశవ్యాప్తంగా వైద్య ప్రవేశాలకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. అలాగే నేషనల్ పూల్‌లో 15 శాతం ప్రభుత్వ సీట్లు వచ్చి చేరా యి. మరోవైపు డీమ్డ్ వర్సిటీలకూ ఒకే దరఖాస్తు కావ డంతో విద్యార్థులకు అవకాశాలు పెరిగాయి. అఖిల భారత కోటా రెండో విడత కౌన్సెలింగ్‌పై కొందరు కోర్టుకు వెళ్లడంతో వాటి ఫలితాలు నిలిచిపోయాయి. దీంతో తెలంగాణలో రెండో విడతకు అడ్డంకులు ఏర్పడ్డాయి. అఖిల భారత సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్ మాత్రమే ఉంటుంది. తర్వాత కౌన్సెలింగ్‌లు నిర్వహించరు. కాబట్టి ఆ తర్వాత రాష్ట్రంలో కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తే ఎక్కడికక్కడ విద్యార్థులు చేరిపోతారు. ఈ నేపథ్యంలో అక్కడ రెండో విడత కౌన్సెలింగ్ ఫలితాలు వచ్చాకే రాష్ట్రంలో రెండో విడత నిర్వహించనున్నారు. కాగా, అఖిల భారత సీట్ల రెండో విడత ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారో తమకు తెలియదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. నేటి నుంచి ఎంబీబీఎస్ తరగతులు ఎంబీబీఎస్, బీడీఎస్ మొదటి సంవత్సరం తరగతులు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో సిద్దిపేట మెడికల్ కాలేజీ ఈ ఏడాది నుంచి ఉనికిలోకి వచ్చింది. ప్రైవేటుకు సంబంధించి అయాన్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సు ప్రారంభమైంది. ఇప్పటివరకు అన్ని కేటగిరీల తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేతృత్వంలో కన్వీనర్ కోటాలోని 1,800 ఎంబీబీఎస్.. 590 బీడీఎస్ సీట్ల భర్తీ పూర్తయింది. అక్కడక్కడ కొన్ని సీట్లు మిగిలాయి. 15 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2,100 ఎంబీబీఎస్ సీట్లుండగా వాటిలో బీ కేటగిరీ 676, సీ కేటగిరీ సీట్లు 319 ఉన్నాయి. వీటికి తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. బీ కేటగిరీ సీట్లలో దాదాపుగా అందరూ చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. సీ కేటగిరీలో ఇంకా 120 సీట్లు భర్తీ కాలేదు. దీంతో ఆ సీట్లు భర్తీ అవుతాయో లేదోనని కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. 90 శాతం చేరికలు ఇప్పటివరకు 90 శాతం సీట్లలో విద్యార్థులు చేరారని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ మొదటి ఏడాది తరగతులను ఏటా ఆగస్టు ఒకటి నుంచి ప్రారంభించాలి. అప్పుడే వైద్య విద్యా సంవత్సరం సక్రమంగా జరుగుతుంది. ఈసారి అనేక మంది తెలంగాణ విద్యార్థులు దేశంలోని ప్రముఖ మెడికల్ కాలేజీల్లో సీట్లు సంపాదించినట్లు చెబుతున్నారు. -
‘అఖిల భారత కోటా’తో అవకాశాలు మెండు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్లు పొందేందుకు తెలంగాణ విద్యార్థులకు భారీగా అవకాశాలు పెరిగాయి. నీట్ ద్వారా ప్రవేశాలు కల్పించడం, అఖిల భారత కోటాలో పోటీ పడేందుకు వీలు కలగడంతో సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్లలో పాగా వేసేందుకు మార్గం ఏర్పడిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 150 సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్లే ఉన్నాయి. కాగా దేశవ్యాప్తంగా చూస్తే వెయ్యికి పైగా సీట్లున్నాయి. గతంలో తెలంగాణలో ఉన్న విద్యార్థులు రాష్ట్రంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ సీట్లకే దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉండేది. అయితే గతేడాది నుంచి నీట్ ద్వారా ప్రవేశాలు కల్పించడంతో పరిస్థితి మారింది. అంతేకాదు రాష్ట్రంలోని సీట్లు కూడా అఖిల భారత కోటాలోకి వెళ్లాయి. ఎంబీబీఎస్ సీట్లలో కేవలం 15 శాతమే అఖిల భారత కోటాలోకి ప్రభుత్వ సీట్లు వెళ్లగా, సూపర్ స్పెషాలిటీ సీట్లు నూటికి నూరు శాతం వెళ్లడం గమనార్హం. పైగా ప్రైవేటు కాలేజీల సీట్లు కూడా అఖిల భారత కోటాలోకి వెళ్లాయి. అంటే దేశంలోని సూపర్ స్పెషాలిటీ సీట్లన్నీ కూడా దేశవ్యాప్తంగా జరిగే కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. రిజర్వేషన్లు కూడా ఉండవు. రాష్ట్ర కోటా కూడా లేదు. అంటే దేశంలోని అన్ని సీట్లల్లోనూ రాష్ట్ర విద్యార్థులు పోటీ పడటానికి వీలు కలిగిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల ఒకటి నుంచి వెబ్ కౌన్సెలింగ్.. సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్ల కోసం నీట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. వాటి ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఆయా కోర్సుల్లో చేరేందుకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వెబ్ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు తమకు కేటాయించిన సీట్లను లాక్ చేసుకునేందుకు ఐదో తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. ఆరో తేదీన సీటు కేటాయింపు జరుగుతుంది. వాటి ఫలితాలను ఏడో తేదీన ప్రకటిస్తారు. సీటు పొందిన విద్యార్థులు అదే నెల 8 నుంచి 13 వరకు కేటాయించిన కాలేజీల్లో చేరడానికి గడువు విధించారు. ఇక రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ వచ్చే నెల 16 నుంచి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. విద్యార్థులు తమకు వచ్చిన సీటును 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్ చేసుకోవాలి. 20వ తేదీన సీటు కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది. 21వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. 22 నుంచి 27వ తేదీ వరకు తమకు కేటాయించిన కాలేజీల్లో చేరేందుకు గడువు విధించారు. ఇదిలావుండగా గతేడాది దేశవ్యాప్తంగా అనేక కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ సీట్లు మిగిలిపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. గతేడాది రెండు సార్లు మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించారు. సీట్లు మిగిలిపోవడంతో వాటిని తిరిగి భర్తీ చేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వలేదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు. ఈసారి ఎలా ఉంటుందో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. -
కస్టోడియన్ సర్టిఫికెట్ సరిపోతుంది!
బీ నుంచి ఏ-కేటగిరీకి మారి కాలేజీలో చేరడంపై హెల్త్ వర్సిటీ వీసీ విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): బీ-కేటగిరీ మెడికల్ సీట్లు పొందిన అభ్యర్థులు రెండో విడత కన్వీనర్ కోటా కౌన్సెలింగ్‌లో ఏ-కేటగిరీ సీటు పొందితే ఆయా కళాశాలల్లో అడ్మిట్ అయ్యేందుకు, అభ్యర్థుల వద్ద (ధ్రువపత్రాల) కస్టోడియన్ సర్టిఫికెట్, సీటు అలాట్మెంట్ లెటర్ ఉంటేసరిపోతుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి .రవిరాజు తెలిపారు. ఈ మేరకు అన్ని ప్రైవేటు మెడికల్ కళాశాలలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. బీ నుంచి ఏ-కేటగిరీ సీట్లు పొందిన అభ్యర్థులు సర్టిఫికెట్ల కోసం ఏపీ ప్రైవేటు మెడికల్ కళాశాల అసోసియేషన్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు ఇప్పటికే అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారమిచ్చినట్లు తెలిపారు. నిర్దేశించిన మేరకు ఈనెల 27న మధ్యాహ్నం 2గంటల్లోగా అభ్యర్థులు ఆయా కళాశాలల్లో అడ్మిట్ కావాలని సూచించారు. 28న మూడో విడత మెడికల్ కౌన్సెలింగ్ ఏపీలో ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఈనెల 28న మూడో, తుది విడత మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డా.ఎస్.అప్పలనాయుడు తెలిపారు. ఈమేరకు వర్సిటీ సోమవారం నోటిఫికేషన్ విడుదల చే సింది. అభ్యర్థులు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల్లోగా వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోవాలన్నారు. మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులు కూడా తుదివిడతకౌన్సెలింగ్లో పాల్గొనవచ్చని తెలిపారు. 29న రెండో విడత బీ-కేటగిరీ సీట్ల మెడికల్ కౌన్సెలింగ్ ఏపీలో ప్రైవేటు మెడికల్/డెంటల్ కళాశాలల్లోని బీ-కేటగిరీ సీట్ల భ ర్తీకి ఈనెల 29న డా.ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కౌన్సెలింగ్ కన్వీనర్ డా.జయరమేశ్ తెలిపారు. ఈమేరకు సోమవారం ఏపీ ప్రైవేటు మెడికల్ కళాశాలల అసోసియేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. -
రేపు రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్
- ప్రభుత్వ, కన్వీనర్ కోటా సీట్లకు.. - 27వ తేదీ మధ్యాహ్నం సీట్ల కేటాయింపు..అదే రోజు చేరికకు గడువు - ముగిసిన ప్రైవేటు బీ కేటగిరీ కౌన్సెలింగ్..ఎంబీబీఎస్ సీట్లన్నీ భర్తీ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ సోమవారం జరగనుంది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ ఆధ్వర్యంలో ఈ కౌన్సెలింగ్ జరగనుంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఆన్లైన్లో ఆప్షన్లను ఎంపిక చేసుకోవాల్సుంది. మొదటి కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో చేరడానికి గడువు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో మిగిలిన సీట్ల లెక్క తేలుతుంది. ఈ మిగిలిన సీట్లకే రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులకు 27 మధ్యాహ్నంలోగా సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు. అదే రోజు కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలస్యమైతే 28 మధ్యాహ్నం వరకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఎన్సీసీ, ఆర్మీ కోటా సీట్లకు 26వ తేదీనే వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, ప్రత్యేక కేటగిరీ విద్యార్థులు అదేరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఆప్షన్లు ఇవ్వాలని వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. మొదటి కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ముగిసిన బీ కేటగిరీ సీట్ల కౌన్సెలింగ్ ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న బీ కేటగిరీ సీట్ల కౌన్సెలింగ్ శనివారంతో ముగిసింది. సాయంత్రానికి ఎంబీబీఎస్ సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ఆ తర్వాత మిగిలిన బీడీఎస్ సీట్లకు కౌన్సెలింగ్ జరిగింది. రాష్ట్రంలో 14 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 713 బీ కేటగిరీలో శుక్రవారం 384 ఎంబీబీఎస్ సీట్లు, ఏడు బీడీఎస్ సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన 329 ఎంబీబీఎస్ సీట్లు రెండో రోజు జరిగిన కౌన్సెలింగ్‌లో భర్తీ అయ్యాయని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి.వి.రావు ‘సాక్షి’కి తెలిపారు. ‘నీట్’లో 1,12,390వ ర్యాంకు విద్యార్థి చివరి ఎంబీబీఎస్ సీటు పొందాడు. సీటు పొందిన వారు ఈనెల 27 కల్లా కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. అదేరోజు ఏడాది గ్యారంటీ సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. సీటును వదులుకోవాలనుకుంటే చెల్లించిన ఫీజులో 10% మినహాయించుకొని మిగతా సొమ్మును కాలేజీ యాజమాన్యాలు వెనక్కు ఇస్తాయి. ఎవరైనా బీ కేటగిరీ సీట్లల్లో చేరకుంటే వాటికి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ఈ మేరకు కాలేజీలకు మెమో జారీ చేస్తామని వైద్య మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
నేడు ఏపీ రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్
స్పోర్ట్, క్యాప్, ఎస్సీసీ అభ్యర్థులకూ నేడే విజయవాడ (హెల్త్యూనివర్సిటీ): ఏపీలో ఏయూ, ఎస్వీయూ పరిధిలోని కళాశాలల్లో ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు శనివారం రెండో విడత మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. సుమారు 500 ఎంబీబీఎస్, 450 బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆర్మీ (క్యాప్), ఎన్సీసీ అభ్యర్థులు కూడా శనివారమే ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. తొలి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు కూడా కోర్సు, కళాశాలలు మార్చుకునేందుకు ఆప్షన్లు పెట్టుకోవచ్చు. హెచ్‌టీటీపీ://ఎంఈడీఏడీఎం.ఏపీఎస్సీహెచ్ఈ.ఏసీ.ఇన్ వెబ్సైట్ ద్వారా ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల్లోగా నమోదు చేసుకోవాలి. సీట్లు పొందిన అభ్యర్థులు నిర్దేశించిన విధంగా ఆన్లైన్లో యూనివర్సిటీ ఫీజు చెల్లించిన అనంతరం సీటు ఖరారు అవుతుంది. సీట్ల ఖాళీల వివరాలు వెబ్ ఆప్షన్లు నమోదుచేయాల్సిన వెబ్సైట్లో పొందుపరిచారు. -
‘ప్రైవేటు’ ఆధ్వర్యంలోనే మెడికల్ కౌన్సెలింగ్
- ‘నీట్’ ర్యాంకులతోనే బీ కేటగిరీ, ఎన్నారై సీట్ల భర్తీ - బీ కేటగిరీకి ఒకే కౌన్సెలింగ్.. ఎన్నారై సీట్లకు కాలేజీల వారీగా..మైనారిటీ సీట్లకు మరో కౌన్సెలింగ్ - మార్గదర్శకాలను ఖరారు చేసిన వైద్యశాఖ సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీని ఈ ఏడాది కూడా ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలోనే చేపట్టనున్నారు. నోటిఫికేషన్ నుంచి కౌన్సెలింగ్ నిర్వహణ, సీట్ల భర్తీ ప్రక్రియ దాకా ఆ సంఘమే నిర్వహించనుంది. బీ కేటగిరీ (35%)తోపాటు ఎన్నారై కోటా (15%) సీట్లన్నింటినీ కూడా ‘నీట్’ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని యాజమాన్య కోటా సీట్ల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలను వైద్య ఆరోగ్య శాఖ ఖరారు చేసింది. జాతీయ స్థాయిలో మెడికల్ ప్రవేశాలకోసం చేపట్టిన ‘నీట్’ పరీక్షను ఈసారి యాజమాన్య కోటా (50%) సీట్లకు నిర్వహించిన సంగతి తెలిసిందే. నీట్-1, నీట్-2 ఫలితాలు ఇటీవలే వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో యాజమాన్య కోటాలో బీ కేటగిరీ, ఎన్నారై కోటా సీట్ల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఇక మైనారిటీ కాలేజీల్లోని 25% బీ కేటగిరీ, 15 % ఎన్నారై కోటా సీట్ల భర్తీకీ నీట్ ర్యాంకులనే పరిగణనలోకి తీసుకోనున్నారు. యాజమాన్య కోటా సీట్లకే ‘నీట్’ నిర్వహించినందున రాష్ట్రానికి ప్రత్యేకంగా ర్యాంకులు ప్రకటించరు. దేశంలో ఎవరైనా ఈ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు, ఇతర రాష్ట్రాల్లోని మేనేజ్మెంట సీట్లకు రాష్ట్ర విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు ► ‘నీట్’లో అర్హత సాధించిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఘం నోటిఫికేషన్ జారీచేస్తుంది. సంఘం వెబ్సైట్లో నోటిఫికేషన్ వివరాలను పొందుపరుస్తారు ► దరఖాస్తు చేసుకున్న వారి ‘నీట్’ ర్యాంకుల ఆధారంగా మెరిట్ లిస్టును తయారుచేస్తారు ► తర్వాత కౌన్సెలింగ్ కోసం మరో నోటిఫికేషన్ జారీచేస్తారు ► ఎంపిక కమిటీలో కాళోజీ ఆరోగ్య వర్సిటీ, ఉన్నత విద్యా మండలి, వైద్య ఆరోగ్యశాఖ సభ్యులను ప్రైవేటు యాజమాన్యాల కమిటీనే నియమిస్తుంది ► సీట్ల భర్తీలో రిజర్వేషన్లు ఉండవు. స్థానికత పాటించరు ► ఎంపికైన విద్యార్థులు వర్సిటీ, ట్యూషన్ ఫీజులను చెల్లించాలి ► ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. కస్టోడియన్ సర్టిఫికెట్లను అనుమతించరు ►బీ కేటగిరీ సీట్ల భర్తీకీ అన్ని కాలేజీలకు కలిపి ఒకే కౌన్సెలింగ్ నిర్వహిస్తారు ► ఎన్నారై కోటా సీట్లకు మాత్రం ఏ కాలేజీకి ఆ కాలేజీయే సొంతంగా కౌన్సెలింగ్ నిర్వహించుకోవచ్చు ► మైనారిటీ కాలేజీల్లోని సీట్ల భర్తీ మైనారిటీ కాలేజీ యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలోనే వేరుగా నోటిఫికేషన్ ఉంటుంది. పైన పేర్కొన్న నిబంధనలే వీటికీ వర్తిస్తాయి. -
తిరుపతి మెడికల్ కౌన్సెలింగ్‌లో గందరగోళం
-
మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభం
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ) : రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా ఏపీకి ప్రత్యేకంగా నిర్వహించిన మెడికల్ కౌన్సెలింగ్ బుధవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. బీ-కేటగిరీ భర్తీలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు కొద్దిసేపు ఆందోళన మినహా తొలిరోజు ప్రశాంతంగానే కౌన్సెలింగ్ జరిగింది. ఉదయం ఎనిమిదిన్నర గంటలకే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు యూనివర్సిటీకి చేరుకున్నారు. కౌన్సెలింగ్‌కు వచ్చినవారి కోసం యూనివర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేశారు. మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ హెల్త్ యూనివర్సిటీలోని కౌన్సెలింగ్ కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పలకరించారు. హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ కేంద్రంలో తొలి సీటును గుంటూరుకు చెందిన 16వ ర్యాంకర్ కె.గీతాశ్రీ తీసుకోగా, ఆమెకు మంత్రి అడ్మిషన్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గీతాశ్రీ విలేకరులతో మాట్లాడుతూ న్యూరాలజిస్ట్‌ను కావాలన్నదే తన లక్ష్యమన్నారు. ఏబీవీపీ విద్యార్థి సంఘ నేతలు అరెస్ట్ యాజమాన్య కోటా సీట్ల భర్తీలో అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టాలని అఖిలభారత విద్యార్థి సంఘ పరిషత్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘ నేతలు హెల్త్ యూనివర్సిటీలో ఆందోళనకు దిగారు. తొలుత వర్సిటీ ప్రధాన గేటు వద్ద ధర్నా చేసిన అనంతరం ఒక్కసారిగా గేటును తోసుకుని లోపలికి వచ్చారు. మాచవరం సీఐ ఉమామహేశ్వరరావు నేతృత్వంలోని పోలీసులు విద్యార్థి సంఘ నేతలను అరెస్ట్‌చేసి స్టేషన్‌కు తరలించారు. అవకతవలకు పాల్పడుతున్న ప్రైవేటు మెడికల్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కామినేనికి విద్యార్థులు వినతిపత్రం అందజేశారు. -
ఎడ్‌సెట్‌లో 99 శాతం అర్హులు
ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. పాపిరెడ్డి సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చిన రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఎడ్‌సెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇందులో 99.04 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ఫలితాలను విడుదల చేసిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 25 వేల సీట్ల భర్తీ కోసం ఈ పరీక్షను నిర్వహించినట్లు చెప్పారు. ఈనెల 6న జరిగిన ఈ పరీక్షకు 64,297 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 57,775 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 57,220 మంది (99.04 శాతం) అర్హత సాధించారు. వీటికి సంబంధించిన ప్రవేశాల షెడ్యూలును త్వరలోనే జారీ చేస్తామని పాపిరెడ్డి వివరించారు. 150 మార్కులకు నిర్వహించిన పరీక్షలో అర్హత నిర్ధారణకు 25 శాతం మార్కులను పరిగణనలోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎడ్‌సెట్‌కు హాజరవుతున్న వారిలో ఎక్కువ శాతం బలహీన వర్గాల వారే ఉంటున్నందున ఎస్సీ, ఎస్టీలకు కనీస అర్హత మార్కులేమీ పెట్టలేదన్నారు. అలాగే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుల్లో మహిళలు పరీక్ష రాస్తే వారి మార్కులను బట్టి ర్యాంకు ఇచ్చామన్నారు. ఈ సబ్జెక్టుల్లో మహిళలకు కనీస అర్హత మార్కులను పెట్టలేదన్నారు. మెడికల్ కౌన్సెలింగ్‌కు 4 కేంద్రాలు ఇంజనీరింగ్ ప్రవేశాల షెడ్యూలును త్వరలోనే జారీ చేస్తామని పాపిరెడ్డి తెలిపారు. కాలేజీల్లోని సీట్ల సంఖ్యపై ఈనెల 28న స్పష్టత వస్తుందన్నారు. మెడికల్ కౌన్సెలింగ్ కోసం హైదరాబాద్‌లో రెండు, వరంగల్, విజయవాడలలో ఒక్కో కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఈ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తుందని వివరించారు. -
మలిన శుద్ధితో మంచి ఆరోగ్యం
42 ఏళ్ల భూషణ్ ఎనిమిదేళ్లుగా తిన్నది సరిగా అరగక, గ్యాస్ సమస్యతో బాధపడుతున్నాడు. మలబద్ధకం తీవ్ర స్థాయిలో బాధపెడుతున్నది. ఎవరికైనా ఏమని చెప్పుకొంటాడు..! అతను ఏ పని చేస్తున్నా అతని ఆలోచన మాత్రం ఈ సమస్యల చుట్టూనే తిరుగుతున్నది. అలాంటి పరిస్థితిలో తన అనారోగ్యాలను తీసేసే మంత్రదండం గురించి తెలిసిందతనికి. అదే కోలన్ హైడ్రో థెరపీ. వెంటనే మా దగ్గర మెడికల్ కౌన్సెలింగ్ తీసుకున్నాడు. ఈ కొత్త థెరపీ గురించి వివరంగా తెలుసుకున్నాడు. తన సమస్యలన్నీ డాక్టర్‌కు తెలిపిన తరువాత 5 సిట్టింగ్‌ల ప్యాకేజీతో చికిత్స చేయించుకున్నాడు. భూషణ్ ఇప్పుడు శారీరకంగా, మానసికంగా నూతనోత్తేజంతో ఉల్లాసంగా ఉంటున్నాడు. మంచి ఆహారం తీసుకోవడం, అది సక్రమంగా జీర్ణం కావడం, వ్యర్థాలు బయటకు వెళ్లిపోవడం... ఇవన్నీ సరైన రీతిలో జరిగితే 90 శాతం జబ్బులను నివారించవచ్చంటే అతిశయోక్తి కాదు. దురదృష్టవశాత్తు ఆధునిక జీవనశైలి వీటిని పక్కదారి పట్టిస్తోంది. ఫలితంగా మలబద్ధకం లాంటివి అనేక రకాల అనారోగ్యాలకు దారి తీస్తున్నాయి. మలబద్ధకం ఎందుకు..? తగినన్ని నీళ్లు తాగకపోయినా, జీర్ణక్రియ సరిగా లేకపోయినా, ఆహారంలో తగినంత పీచు పదార్థాలు లేకపోయినా.. పేగుల్లో కదలికలు సరిపడినంత ఉండవు. అలాంటి సందర్భాల్లో మలబద్ధకం ఏర్పడుతుంది. కొంతమంది పేగుల్లో కదలికలు కలిగి విసర్జించాల్సిన అవసరం ఉన్నప్పుడు విసర్జించకుండా పదే పదే ఆపుకోవడం వల్ల నాడీ వ్యవస్థకు చేరే సంకేతాల తీరు మారుతుంది. అందువల్ల కూడా మలబద్ధకం ఏర్పడుతుంది. స్మోకింగ్ ఇందుకు దారి తీస్తుంది. రోజులో కనీసం ఒక్కసారైనా పేగులలో కదలికలు లేకపోతే మలబద్ధకం అని భావించవచ్చంటున్నారు మెడికల్ డెరైక్టర్ డాక్టర్ ప్రసాద్. కోలన్ హైడ్రోథెరపీ మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ సమస్యలకు పేగులు శుభ్రపడి వాటి కదలికలు సాఫీగా ఉండటమే పరిష్కారం. ఇందుకోసం కోలన్ హైడ్రోథెరపీ మేలు చేస్తుందంటున్నారు శుద్ధ్ కోలన్ డెరైక్టర్ రాజగోపాల్. స్వచ్ఛమైన గోరువెచ్చని నీటిని మలద్వారం ద్వారా పెద్ద పేగు లోపలికి పంపించి అక్కడ పేరుకున్న వ్యర్థాలను తొలగిస్తారు. ఆ నీరు పెద్ద పేగు మొత్తాన్ని పూర్తిగా కడిగివేస్తూ బయటకి వచ్చేస్తుంది. దీంతో శరీరంలో మిగిలి ఉన్న మాలి న్యాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ నీటిని పంపించడం కోసం ప్రతి పేషెంట్‌కి డిస్పోజబుల్ నాజిల్స్ వాడతారు కాబట్టి నాజిల్ కలుషితమయ్యే అవకాశం ఉండదు. ఈ ప్రక్రియకు 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. ‘సమస్య తీవ్రంగా ఉన్నవారికి దీన్ని ప్యాకేజీ చికిత్సగా కూడా ఇస్తారు. పూర్తి ప్యాకేజీ చికిత్స తీసుకుంటున్న వారు మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ప్యాకేజీ మొత్తంలో ఐదు సిట్టింగ్‌లు ఉంటాయి. ఈ ప్యాకేజీ నెలలో పూర్తి చేయబడుతుంది. అని వివరించారు శుద్ధ్ కోలన్ కేర్ డెరైక్టర్ రాజగోపాల్. ఈ ప్యాకే జీ పూర్తి అయ్యే నాటికి శరీరంలోని అన్ని వ్యవస్థలూ గాడిన పడతాయి. ఇవీ ప్రయోజనాలు - గ్యాస్ సమస్యల పరిష్కారం - మలబద్ధకం నుంచి ఉపశమనం - ఒత్తిడి నుంచి విముక్తి - జీర్ణక్రియ మెరుగవుతుంది - పెద్దపేగులో కదలికలు మెరుగవుతాయి వీరికి పనికిరాదు గర్భవతులు, పెద్దపేగు మలద్వార క్యాన్సర్‌తో బాధపడేవారు, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అల్సరేటివ్ కొలిటీస్ బాధితులు, పైల్స్ ఉన్నవారికి కోలన్ హైడ్రో థెరపీ పనికిరాదు. -
‘నెట్’లో పడొద్దు
ఇంటర్నెట్లో విహారం శ్రుతిమించుతున్న వినియోగం సమాచార సిండ్రోమ్ బారిన యువతరం నిద్రలేమి, మానసిక ఇబ్బందులతో సతమతం సామాజిక వెబ్సైట్లతో సరికొత్త సమస్యలు వాట్సప్.. ఫేస్బుక్.. ట్విట్టర్.. వైబర్.. లైన్.. టాక్రే.. స్కైప్.. ఇవన్నీ యువతరం నిత్యం పఠిస్తున్న మంత్రాలు. టూజీ పాతబడిన తర్వాత.. త్రీజీ, ఫోర్జీ, ఆండ్రాయిడ్ల ఆగమనంతో అరచేతిలో ప్రపంచాన్ని చూసేస్తున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న సాంకేతిక పరిజ్ఞానం.. సామాజిక మాధ్యమాలతో ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయింది. పట్నం, పల్లె తేడా లేదు.. పదిహేనేళ్ల పిల్లాడి నుంచి పండు ముసలి దాకా అందరి చేతుల్లో సెల్‌ఫోన్ హల్చల్ చేస్తోంది. ఇక స్మార్ట్ఫోన్ల రాకతో ఇంటర్నెట్ వినియోగం మరింత విస్తృతమైంది. ఈ తరహా ఆధునిక విజ్ఞానం ఎంతటి మేలు చేస్తుందో.. అతిగా వాడితే అంతటి హానీ చేస్తోంది. యువతీయువకులు గంటల తరబడి సామాజిక మాధ్యమాల్లోనే గడిపేస్తున్నారు. దీంతో పలు మానసిక, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. జిల్లాకేంద్రానికి చెందిన 25ఏళ్ల ఓ యువకుడు నిత్యం 8గంటలు సామాజిక సంబంధాల సైట్స్, మొబైల్ చాటింగ్‌లో గడిపేవాడు. రాత్రి 2గంటలైనా కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్, మొబైల్‌తో గడిపేవాడు. దీంతో నిద్రలేమి, ఎసిడిటీ సమస్యలు ఎదుర్కొన్నాడు. తన ఫేస్బుక్ షేరింగ్‌లకు లైక్స్ ఎక్కువగా రాకపోవడం కూడా అతన్ని మానసికంగా కుంగదీసింది. అలా ఇంటర్నెట్ వలలో చిక్కి.. సమాచార సిండ్రోమ్ బారిన పడ్డాడు. తల్లిదండ్రులు గుర్తించి సరైన సమయంలో మెడికల్ కౌన్సెలింగ్ ఇప్పించడంతో కుదుటపడ్డాడు. ఇలాంటి సమస్యలను చాలామంది యువతీయువకులు ఎదుర్కొంటున్నారు. నేటియువతలో చాలామందిని ఇంటర్నెట్ ఫోబియా పట్టుకుందని.. దీంతో సమాచార సిండ్రోమ్ బారిన పడుతున్నారని మానసిన వైద్య నిపుణులు చెబుతున్నారు. అవసరం మేరకు వినియోగిస్తే పర్వాలేదు గానీ.. శ్రుతిమించితే ఏదైనా అనర్థమేనని హెచ్చరిస్తున్నారు. బోర్ కొట్టిందంటే చాలు ప్రస్తుతం సెల్‌ఫోన్ లేని వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ప్రతీ మనిషి ఒక రోజు కనీసం అర గంట నుంచి ఆరు గంటలపాటు సెల్ఫోన్లో మాట్లాడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడంతో దానిపై ఆధారపడక తప్పడం లేదు. ఇది కాస్త శ్రుతిమించడంతోనే అసలు సమస్య మొదలవుతుంది. కాస్త బోర్ కొట్టిందంటే చాలు సెల్‌ఫోన్ బయటకు తీసి ఇంటర్నెట్, ఫేస్బుక్, వాట్సప్‌లో గంటలు గడిపేస్తున్నారు. వినియోగానికి అనుగుణంగా నెట్వర్క్ కంపెనీలు కాల్ రేట్లు తగ్గిస్తూ.. తక్కువ నగదుకు ఇంటర్నెట్లో సేవలు అందిస్తున్నాయి. ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్ ఉన్నవారైతే వాటిని మురిపెంగా చూసుకుంటున్నారు. చిన్నపిల్లలు సైతం సెల్‌పోన్ వినియోగానికి అలవాటు పడుతున్నారు. నిద్రలేమి పెద్ద సమస్య మనిషి సగటున ఎనిమిది గంటలైనా నిద్రపోవాలనేది వైద్యులు చేప్పే మాట. కానీ నేడు యువత, ఉద్యోగులు ఎప్పుడు నిద్రపోతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు మెలకువగా ఉండేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేని రోజుల్లో సాయంత్రం ఆరు గంటలకు భోజనం చేసి 7 గంటలకు నిద్రపోయేవారు. తెల్లవారుజామున 5 గంటలకు నిద్రలేచి ఆ రోజు దినచర్యను ప్రారంభించేవారు. ప్రసుత్తం ఎక్కువ మంది ఉదయం పొద్దెక్కే వరకు నిద్రపోతున్నారు. దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి. రాత్రి 11-12 గంటల దాకా చాటింగ్ చేస్తున్నవారు చిన్న వయస్సులోనే మధుమేహం, రక్తహీనత బారిన పడుతున్నారని వైద్యుల అంచనా. తెల్లవారకముందే సందేశాలు త్రీజీ సేవలు అందుబాటులోకి రావడంతో వినియోగం మరింతగా పెరిగిపోయింది. తెల్లవారకముందే వాట్సప్, ఫేస్బుక్, ఇతర సామాజిక సైట్లలో గుడ్మార్నింగ్లు చెప్పేసుకుంటున్నారు. వారి అభిప్రాయాలు, అనుభూతులు, చిత్రాలు ఇతరులతో పంచుకుంటున్నారు. ఇంతవరకు పర్వాలేదు. కానీ.. అసలు సమస్య మొదలయ్యేది అక్కడే. గంటల కొద్దీ చాటింగ్ చేయడం, రాత్రివేళల్లో ఆలస్యంగా నిద్రపోవడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఏదైనా షేర్ చేయడమే ప్రస్తుతం కుర్రకారు తీరు పూర్తిగా మారి పోయింది. కొత్తగా జీన్ ప్యాంట్ కొన్నాను, కొత్త డిజైన్, బ్రాండెడ్ ఐటం బాగుందా.. అంటూ తాము కొన్న వాటిని ఫొటో తీసి వెంటనే సామాజిక వెబ్సైట్లలో షేర్ చేస్తున్నారు. అలాగే ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, ప్రయాణం చేస్తున్నా, పని చేస్తున్నా సెల్ఫీలు తీసుకుని షేర్ చేస్తున్నారు. కేవలం లైక్‌ల కోసమే పోస్టింగ్‌లు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. తర్వాత తన షేరింగ్‌కు ఎన్ని లైకులు వచ్చాయో చూసుకుంటున్నారు. అనుకున్నంత స్పందన రాకపోయినా, తమను స్నేహితులుగా అంగీకరించక పోయినా బాధపడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ‘సమాచార సిండ్రోమ్’ వ్యాధి బారిన పడే పరిస్థితులు నెలకొంటాయని మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియో గేమ్స్ పిల్లలు, పెద్దలకు వీడియో గేమ్స్ ప్రియంగా మారాయి. నిద్ర, చదువులను మానుకుని మరి.. గేమ్స్ ఆడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం వేలాది వేలాది గేమ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్లో కూడా సరికొత్త గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ మంది పగలు పాఠశాలలకు వెళ్లడంతో చిన్నారులకు సమయం దొరకడం లేదు. దీంతో రాత్రిళ్లు ఎక్కువ సమయం గేమ్స్ ఆడడానికే కేటాయిస్తున్నారు. దీంతో అనారోగ్యానికి గురవుతున్నారు. పెద్దలూ గేమ్స్ మాయలో పడుతున్నారు. ఇటీవల క్యాండీక్రస్ పేరుతో ఓ గేమ్ అందరిలోనూ ‘సెగ’ పుట్టిస్తోంది. రిక్వెస్ట్‌లు, లాక్‌లు, స్టేజీ సతమతం చేస్తున్నాయి. అవసరం ఉన్నంత మేరకే యువతతోపాటు పెద్దలూ సరదా కోసమంటూ చాటింగ్‌లో ఊబిలోకి దిగుతున్నారు. ఫేస్బుక్లో అవసరం ఉన్నా.. లేకపోయినా వచ్చిన ప్రతి లైక్‌కు రిప్లయిలిస్తూ.. 60 శాతం అనవసర పరిచయాలు పెంచుకుంటున్నారు. ఇక్కడి నుంచే అసలు సమస్యలు ప్రారంభమవుతాయి. ఆదిలోనే వీటిని అరికడితే మంచిది. తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం కేటాయించి వారి సమస్యలు పరిష్కరించాలి. స్వీయ నియంత్రణ ఉండాలి ఫేస్బుక్ ఉపయోగించడం తప్పుకాదు. ట్విట్టర్స్‌ను ఫాలో అవడం నేరం కాదు. కానీ దాన్ని ఉపయోగించే తీరే యువతను ప్రభావితం చేస్తోంది. రోజు మొత్తంలో కాసేపైతే పర్వాలేదు కానీ.. అదే జీవితమైతే మాత్రం అనర్థం పొంచి ఉన్నట్లే. ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటిస్తే మంచిది. దీంతో సమస్యలను అరికట్టవచ్చు. సరదా.. వ్యసనంగా మారిన తర్వాత ప్రమాదాలకు దారి తీస్తాయని గుర్తించాలి. తల్లిదండ్రులకు సూచనలు పిల్లలను తల్లిదండ్రులు ఎల్లప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. వారి సంతోషాలు, బాధలను గుర్తించాలి. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారంటే అప్రమత్తమై వారితో మాట్లాడి వారి సమస్య ఏమిటో గుర్తించి పరిష్కరించాలి. అధిక సమయం ఇంటర్నెట్, ఫేస్బుక్ చాటింగ్‌లో ఉన్నారని తెలిస్తే వారికి ప్రేమగా నచ్చజెప్పాలి. చిన్నపిల్లలను ఈ సాంకేతిక మాయాజాలంలోకి తీసుకరాకపోవడమే మంచిది. అవసరం మేరకే వినియోగించుకునేలా చూడాలి. మానసిక సమస్యలు సెల్‌ఫోన్, ఇంటర్నెట్లను అతిగా వినియోగించడం వల్ల నిద్రలేమి, ఎసిడిటీ, అనవసరంగా ఆందోళన పడటం తదితర శారీరక, మానసిక సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ ప్రభావం జీవన విధానంపై పడుతుంది. మనిషికి కనీసం రోజుకు ఎనిమిది గంటలు నిద్ర అవసరం. టీవీలు, చాటింగ్‌లు తగ్గించుకుని రాత్రిళ్లు త్వరగా నిద్రకు ఉపక్రమిస్తే మేలు. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి సలహాలు, సూచనలు పాటించడం మంచిది. - డాక్టర్ బి. కేశవులు, మానసిక వైద్యనిపుణుడు, నిజామాబాద్