స్పోర్ట్, క్యాప్, ఎస్‌సీసీ అభ్యర్థులకూ నేడే
విజయవాడ (హెల్త్‌యూనివర్సిటీ): ఏపీలో ఏయూ, ఎస్వీయూ పరిధిలోని కళాశాలల్లో ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు శనివారం రెండో విడత మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. సుమారు 500 ఎంబీబీఎస్, 450 బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆర్మీ (క్యాప్), ఎన్‌సీసీ అభ్యర్థులు కూడా శనివారమే ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.
తొలి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు కూడా కోర్సు, కళాశాలలు మార్చుకునేందుకు ఆప్షన్లు పెట్టుకోవచ్చు. హెచ్‌టీటీపీ://ఎంఈడీఏడీఎం.ఏపీఎస్‌సీహెచ్‌ఈ.ఏసీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల్లోగా నమోదు చేసుకోవాలి. సీట్లు పొందిన అభ్యర్థులు నిర్దేశించిన విధంగా ఆన్‌లైన్‌లో యూనివర్సిటీ ఫీజు చెల్లించిన అనంతరం సీటు ఖరారు అవుతుంది. సీట్ల ఖాళీల వివరాలు వెబ్ ఆప్షన్లు నమోదుచేయాల్సిన వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
నేడు ఏపీ రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్
Published Sat, Sep 24 2016 2:28 AM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
Advertisement
Advertisement