
న్యూఢిల్లీ: అఖిల భారత కోటాలో మిగిలిపోయిన 1,456 నీట్–పీజీ–2021 సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సిలింగ్ చేపట్టాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వైద్య విద్య ప్రయోజనాల దృష్ట్యా వాటిని భర్తీ చేయరాదన్న కేంద్రం, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (ఎంసీసీ) నిర్ణయాన్ని సమర్థించింది.
వైద్య విద్యతోపాటు ప్రజారోగ్యంతో సంబంధమున్న ఈ అంశంలో ఎలాంటి రాజీ ఉండరాదని స్పష్టం చేసింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల వెకేషన్ బెంచ్ శుక్రవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ‘‘విద్యా సంవత్సరం మొదలై ఏడాదవుతోంది. 9 వరకు రౌండ్ల కౌన్సిలింగ్ పూర్తయింది. జూలై నుంచి నీట్–పీజీ–2022 కౌన్సిలింగ్ కూడా మొదలు కానుంది. ఇలాంటప్పుడు విద్యార్థులు ఖాళీల భర్తీ కోరడం సరికాదు’’ అని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment