Special counseling
-
ఎంటెక్ విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 9 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనని అభ్యర్థులు 11వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 12వ తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొంది. ఈనెల 15న సీట్ల కేటాయింపు ఉంటుందని, 19లోగా సీట్లు వచ్చిన అభ్యర్థులు కాలేజీలో రిపోర్టింగ్ చేయాలని సూచించింది. కాగా, డిగ్రీలో ప్రవేశానికి (సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు) 9, 10 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ఒక ప్రకటనలో వెల్లడించింది. -
నీట్–పీజీ ప్రత్యేక కౌన్సిలింగ్ వద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: అఖిల భారత కోటాలో మిగిలిపోయిన 1,456 నీట్–పీజీ–2021 సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సిలింగ్ చేపట్టాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వైద్య విద్య ప్రయోజనాల దృష్ట్యా వాటిని భర్తీ చేయరాదన్న కేంద్రం, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (ఎంసీసీ) నిర్ణయాన్ని సమర్థించింది. వైద్య విద్యతోపాటు ప్రజారోగ్యంతో సంబంధమున్న ఈ అంశంలో ఎలాంటి రాజీ ఉండరాదని స్పష్టం చేసింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల వెకేషన్ బెంచ్ శుక్రవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ‘‘విద్యా సంవత్సరం మొదలై ఏడాదవుతోంది. 9 వరకు రౌండ్ల కౌన్సిలింగ్ పూర్తయింది. జూలై నుంచి నీట్–పీజీ–2022 కౌన్సిలింగ్ కూడా మొదలు కానుంది. ఇలాంటప్పుడు విద్యార్థులు ఖాళీల భర్తీ కోరడం సరికాదు’’ అని సూచించింది. -
నేటి నుంచి సీఎస్ఏబీ ‘స్పెషల్’ కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఈఎస్టీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), గవర్నమెంట్ ఫండెడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (జీఎఫ్‌టీఐ)ల్లో ఖాళీ సీట్ల భర్తీకి సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్ (సీఎస్ఏబీ) నిర్వహించే స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ ఈ రెండు విడతల స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌కు అర్హులు. అయితే ఈ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన అభ్యర్థి ఇంతకు ముందు సీటును పొంది ఉంటే దాన్ని కోల్పోతాడు. ఈ మేరకు ఇంతకు ముందు కేటాయించిన సీటును కోరబోమని కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులందరి నుంచి అఫిడవిట్ తీసుకోనున్నారు. ఈ ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్‌కు సీట్ల ఖాళీలను సోమవారం ప్రకటించనున్నారు. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌కు నమోదు చేసుకున్నవారు, సీట్లు పొంది రద్దు చేసుకున్నవారు, మధ్యలో విత్‌డ్రా అయినవారు, జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించి జోసా కౌన్సెలింగ్‌కు రిజిస్టర్ చేసుకోనివారంతా కొత్తగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులకు సూచనలు.. – అభ్యర్థులు ‘హెచ్‌టీటీపీఎస్://సీఎస్ఏబీ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. – రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు తమ అర్హతలు, జాతీయత, జెండర్, కేటగిరీ తదితర అంశాలను నమోదు చేయాలి. – అభ్యర్థులు చాయిస్‌లను ఫిల్ చేస్తూ ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూ ఉండాలి. సేవ్ చేయకపోతే అవి సర్వర్ నుంచి కనిపించకుండా పోయే ప్రమాదముంది. – నిర్ణీత సమయంలో అభ్యర్థులు తాము సేవ్ చేసిన వాటిని లాక్ చేయాలి. – చాయిస్ ఫిల్లింగ్ అనంతరం వాటిని సేవ్ చేయకపోతే సమయం ముగిశాక ఆ అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జరగదు. – చాయిస్ ఫిల్లింగ్ సేవ్, లాక్ చేశాక ప్రింటవుట్‌ను తీసుకోవాలి. – జోసా నిర్వహించిన కౌన్సెలింగ్‌లో పాల్గొని సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 9 నుంచి 13 లోపు పాక్షిక ఫీజు చెల్లించి ఉండకపోతే వారి సీటు రద్దు అవుతుంది. వారు స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. – జోసా కౌన్సెలింగ్‌లో సీటు వచ్చి పాక్షిక ఫీజు చెల్లించిన అభ్యర్థులు స్పెషల్ కౌన్సెలింగ్‌లో పాల్గొనని పక్షంలో ఈ నెల 16 నుంచి 21లోపు తమకు కేటాయించిన సంస్థల్లో చేరాల్సి ఉంటుంది. -
ప్రత్యేక కౌన్సెలింగ్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే సాంకేతిక విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) మిగిలిపోయిన సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు (సీఎస్ఏబీ) నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి రెండు విడతలుగా కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించేలా షెడ్యూల్ జారీ చేసింది. దేశంలోని జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్‌టీఐ ప్రవేశాలకు జాయిం ట్ సీట్ అలకేషనల్ అథారిటీ (జోసా) గత నెల 6 నుంచి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఆరు విడతల్లో నిర్వహించింది. ఆరో విడత సీట్ల కేటాయింపును ఈ నెల 7న ప్రకటించింది. సీట్లు పొందిన విద్యార్థులంతా సోమవారం నుంచి 13వ తేదీలోగా జోసా పోర్టల్ ద్వారా ప్రవేశాల ఫీజును కొంత మొత్తం చెల్లించి సీట్లు ఖరారు చేసుకోవాలని జోసా వెల్లడించింది. ఆ కౌన్సెలింగ్ తరువాత ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐలలో మిగిలిన సీట్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సీఎస్ఏబీ షెడ్యూల్ జారీ చేసింది. -
చూడాలా... చేరాలా?
- ఎన్ఐటీ సీటు కోసం చూడాలా.. ఎంసెట్ సీటుతో కాలేజీలో చేరాలా! - ఈ నెల 30న ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీకి స్పెషల్ కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్‌లో సీటొచ్చినందుకు సంతోషపడాలా? దాన్ని వదులుకొని ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐల్లో సీటు కోసం ఎదురుచూడాలా?.. ఎటూ తేల్చుకోలేక రాష్ట్రంలోని విద్యార్థులు సతమతమవుతున్నారు. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి జాతీయ స్థాయి సాంకేతిక విద్యా సంస్థ ల్లో సీటు కోసం ఈనెల 30న జరిగే స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు పాల్గొన వచ్చని సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు (సీఎస్ఏబీ) ఇటీవల ప్రకటించింది. మరోవైపు ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు లభించిన విద్యార్థులు ఈ నెల 29లోగా కాలేజీల్లో చేరాలని, ఒరిజినల్ సర్టిఫికెట్లు కాలేజీల్లో అందజేయాలని స్పష్టం చేసింది. కన్వీనర్ కోటా ప్రవేశాల కౌన్సెలింగ్ ముగిసినందున సర్టిఫికెట్లు ఇచ్చాక కాలేజీలు తిరిగి ఇవ్వవు. అవి లేకపోతే ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్‌టీల్లో చేరే అవకాశం ఉండదు. దీంతో 30న జరిగే స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌లో ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చినా వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏం చేయాలో పాలుపోక విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. 6,510 సీట్ల భర్తీకి చర్యలు జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న 6,510 సీట్లను భర్తీ చేయాలని సీఎస్ఏబీ (ఛిట్చb.nజీఛి.జీn) నినిర్ణయించింది. ఇందుకు స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌ను ఈనెల 30న నిర్వ హిస్తామని ప్రకటించింది. అందులో ఎన్ఐటీల్లో 400కు పైగా, ట్రిపుల్ఐటీల్లో 2 వేల వరకు సీట్లున్నాయి. మిగతా సీట్లు సెంట్రల్ గవర్న మెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్లో (జీఎఫ్‌టీఐ) ఉన్నట్లు వెల్లడించింది. వాటిల్లో చేరాలనుకునే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మంచి కాలేజీల్లో సీట్లు రాని విద్యార్థులు ఆ స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. అయితే రాష్ట్రంలో ఎంసెట్ చివరి దశ ప్రవేశాల్లో భాగంగా 22న సీట్ల కేటాయింపును ప్రకటించిన ప్రవేశాల కమిటీ.. 29లోగా విద్యార్థులు కాలేజీల్లో చేరాలని, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రకటించింది. దీంతో స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌లో సీటొస్తే.. పరిస్థితి ఏంటని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర కాలేజీల్లో చేరే గడువును ఈనెల 30 వరకు పొడిగించాలని కోరుతున్నారు. ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల షెడ్యూలు ఇదీ.. 29–7–2017 సాయంత్రం 4 గంటల వరకు ఫీజు చెల్లింపు 29–7–2017 రాత్రి 11:59 గంటల వరకు చాయిస్ ఫిల్లింగ్ (వెబ్ ఆప్షన్లు) 30–7–2017 మధ్యాహ్నం 2 గంటలకు సీట్ల కేటాయింపు 31–7–2017 నుంచి ఆగస్టు 2 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ -
చేరి సీటు వదులుకుంటే రూ.5 లక్షలు
ఎం-సెట్ టాప్ ర్యాంకర్లకు ప్రైవేటు వైద్య కాలేజీల గాలం సాక్షి, హైదరాబాద్: యాజమాన్య కోటా సీట్లను అమ్ముకుని కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి రాష్ట్రంలోని ప్రైవేటు వైద్యవిద్యా కళాశాలలు మరో మార్గం పట్టాయి. ప్రైవేటు ఎం-సెట్ పరీక్ష కారణంగా యాజమాన్య కోటా సీట్లను ఇష్టం వచ్చినట్లుగా అమ్ముకోవడానికి వీలులేకపోవడంతో.. ఈ పరీక్షలో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రలోభాలకు గురిచేస్తున్నాయి.ప్రత్యేక కౌన్సెలింగ్‌లో తమ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు తీసుకొని ఆ తర్వాత వాటిని వదిలేసుకుంటే రూ.5 లక్షలు ఇస్తామని ఎర వేస్తున్నాయి. అదే దంతవైద్య సీటుకు రూ.లక్ష వరకు ఇవ్వజూపుతున్నాయి. టాప్ ర్యాంకు సాధించినా.. యాజమాన్య కోటా సీట్ల ఫీజు చెల్లించే స్థాయిలేని వారిని లక్ష్యంగా చేసుకొని ప్రైవేటు వైద్య కాలేజీలు ఈ కుట్రకు వ్యూహం పన్నాయి. ఇలా వదిలేసిన సీట్లు ఎన్నారై కోటా కిందకు వెళ్లగానే.. ఒక్కో సీటును రూ.కోటిన్నర వరకు అమ్ముకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నాయి. ఈ మేరకు టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కాలేజీలు ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. తొలి నుంచీ అక్రమాలే.. ప్రైవేటు వైద్య కాలేజీల యాజమాన్యాలు మొదటి నుంచీ అక్రమాల ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు పక్కా ప్రణాళిక రచించాయి. 35 శాతం యాజమాన్య కోటా సీట్లకు జరిగిన ప్రత్యేక ఎం-సెట్ విషయంలో నోటిఫికేషన్ దగ్గర నుంచీ ప్రత్యేక ప్రవేశపరీక్ష వరకు అక్రమాలకు పాల్పడ్డాయి. అయినా పలువురు సాధారణ విద్యార్థులకు టాప్ ర్యాంకులు రావడంతో ‘ప్రలోభాల’ మార్గం పట్టాయి. అసలు గత నెలలో జరిగిన ప్రైవేటు ఎం-సెట్ పరీక్షకు 5,130 మంది హాజరుకాగా.. 2,266 మంది ర్యాంకులను ప్రకటించారు. అందులో పలువురు పేద విద్యార్థులు కూడా టాప్ ర్యాంకు సాధించారు. మరికొందరు వచ్చే ఏడాది ప్రభుత్వ సీటుకు ప్రయత్నాలు చేయాలని భావిస్తున్నారు. ఇలాంటివారిలో చాలా మందికి యాజమాన్య కోటా కింద ఏడాదికి రూ.9లక్షల చొప్పున చెల్లించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు అవకాశంగా తీసుకుని.. వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నాయి. ‘మీరు ఏడాదికి రూ.9 లక్షల చొప్పున సీటు కొనడం కష్టం. మీ విద్యార్థి ఈ ఏడాది లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటే వచ్చే ఏడాది ప్రభుత్వ సీటు సాధిస్తాడు. కాబట్టి వచ్చిన ఈ సీటులో చేరి... తర్వాత దాన్ని వదులుకోండి. మీకు రూ.5లక్షలు ఇస్తాం. ఆ డబ్బుతో లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇచ్చి చదివించండి..’ అంటూ ప్రలోభపెడుతున్నాయి. ఇందుకోసం ప్రతీ ప్రైవేటు మెడికల్ కాలేజీ ప్రత్యేకంగా ఒక సెల్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ఒక్కో సీటు రూ.కోటిన్నరకు.. టాప్ ర్యాంకులు సాధించిన కొందరు విద్యార్థులు యాజమాన్య కోటా సీటుకు ఫీజు చెల్లించలేక వాటిని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. అటువంటి వారితో ఇప్పటికే ప్రైవేటు యాజమాన్యాలు మంతనాలు జరుపుతున్నాయి. కౌన్సెలింగ్‌లో పాల్గొని సీటు పొంది, తర్వాత విద్యార్థి ఆ సీటు వదులుకుంటే నిబంధనల ప్రకారం అది ఎన్నారై కోటా కిందికి వెళుతుంది. దానిని ఏ ప్రవేశపరీక్ష రాయని డబ్బున్న విద్యార్థులకు కూడా రూ. కోట్లకు అమ్ముకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంబీబీఎస్ సీటును రూ.కోటిన్నరకు కూడా కొనేందుకు కొందరు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే డెంటల్ సీటును కూడా రూ.లక్షల్లో అమ్ముకునేందుకు కాలేజీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.