( ఫైల్ ఫోటో )
విజయవాడ: వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పీజీ మెడికల్ సీట్ల కౌన్సిలింగ్ రద్దయ్యింది. మెడికల్ కళాశాలల సీట్ల భర్తీలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అవతవకలు పాల్పడ్డాయి. ఈ విషయాన్ని గుర్తించిన (నేషనల్ మెడికల్ కమిషన్) ఎన్‌ఎంసీ.. కౌన్సిలింగ్ ప్రక్రియను నిలిపివేసింది. ఎన్‌ఎంసీ నుంచి సీట్ల పెంపుదలపై ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు నకిలీ ఆదేశాలు వచ్చాయి. ఈ అవతవకల విషయం వెలుగులోకి రావడంతో తిరిగి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీకి ఆదేశాలు జారీ చేసింది ఎన్‌ఎంసీ.
నంద్యాల శాంతి రామ్ మెడికల్ కాలేజీలో 7 ఎండి జనరల్ మెడిసిన్ సీట్లకు బదులుగా, 24 సీట్లను భర్తీ చేశారని గుర్తించిన ఎన్‌ఎంసీ.. రాజమహేంద్రవరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లో 24 సీట్లుండగా 40 జనరల్ మెడిసిన్ సీట్లను భర్తి చేసినట్లు పసిగట్టింది. విజయనగరం మహారాజా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎక్కువ సీట్లు భర్తీ చేసినట్లు గుర్తించారు.
ప్రైవేట్ మెడికల్ కళాశాలలకి ఎన్‌ఎంసీ పేరుతో ఫేక్ ఆర్డర్స్ వచ్చినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో కొందరి ఉద్యోగుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి దొంగలను గుర్తించే పనిలో నిమగ్నమైంది ఎన్‌ఎంసీ. మూడు మెడికల్ కళాశాలలపై చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కౌన్సిలింగ్ ప్రక్రియ రద్దు కావడంతో విద్యార్ధులు ఇబ్బంధి పడకుండా యూనివర్సిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment