YSR Health University
-
పలువురు వీసీల రాజీనామా
ఉన్నత విద్యకు పట్టుగొమ్మలుగా విలసిల్లుతున్న విశ్వవిద్యాలయాలను టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వదిలిపెట్టడం లేదు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న వర్సిటీలను తమ రాజకీయ విషక్రీడలకు బలిచేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ (వీసీ), రిజిస్ట్రార్లను రాజీనామాలు చేసి వెళ్లిపోవాలంటూ కూటమి నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ప్రభుత్వ పెద్దలు అధికారుల ద్వారా వీసీలందరికీ ఫోన్లు చేయిస్తూ ఒత్తిడి తెస్తున్నారు. రాజీనామాలు చేసి వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే అనేక మంది వీసీలు రాజీనామాలు చేసి తప్పుకున్నారు. ఈ క్రమంలో మరికొందరు కూటమి నేతలు, అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక సోమవారం తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు.సాక్షి, అమరావతి/కర్నూలు కల్చరల్/ఏఎఫ్‌యూ/తిరుపతి సిటీ/ఏఎన్‌యూ/బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కె.బాబ్జీ రాజీనామా చేశారు. గవర్నర్, వర్సిటీ చాన్సలర్ అయిన అబ్దుల్ నజీర్‌కు మెయిల్ ద్వారా తన రాజీనామా లేఖను పంపారు. బాబ్జీ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సీనియర్ వైద్యుడు. గతంలో వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ)గా పనిచేసిన బాబ్జీ గతేడాది ఫిబ్రవరిలో వీసీగా నియమితులయ్యారు. 2026 ఫిబ్రవరి వరకూ ఆయన పదవీకాలం ఉన్నప్పటికీ వైద్య శాఖ ఉన్నతాధికారి ఒకరు ఫోన్ చేసి రాజీనామా చేయాలని ఆదేశించడంతో తన పదవి నుంచి వైదొలిగారు.తప్పుకున్న రాయలసీమ వర్సిటీ వీసీ..కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇన్చార్జి చైర్మన్, డిప్యూటీ సెక్రటరీ ఫోన్ చేసి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో సుధీర్ ప్రేమ్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పంపారు. హైదరాబాద్ జేఎన్టీయూ మెకానికల్ విభాగం ప్రొఫెసర్ అయిన బి.సుధీర్ ప్రేమ్ కుమార్ ఈ ఏడాది జనవరి 17న వీసీగా బా«ధ్యతలు స్వీకరించారు. పద్మావతి మహిళా వర్సిటీ వీసీ రాజీనామాతిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ వీసీ డి.భారతి పదవి నుంచి వైదొలిగారు. ఆమె గతేడాది జూన్ 15న వీసీగా బాధ్యతలు చేపట్టారు. ఆమె పదవీ కాలం మరో రెండేళ్లు ఉన్నప్పటికీ అధికారుల ఒత్తిడితో రాజీనామా చేశారు.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ వీసీ కూడా..కడపలో 2020లో ఏర్పాటైన డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ తొలి వీసీ ఆచార్య బానోతు ఆంజనేయప్రసాద్ కూడా తన పదవీకాలం పూర్తవకుండానే ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో రాజీనామా సమర్పించారు. జేఎన్టీయూ హైదరాబాద్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా ఉన్న ఆయనను గతేడాది ఫిబ్రవరి 9న ఏఎఫ్‌యూ వీసీగా నియమించారు.కాగా ఇప్పటికే వైఎస్సార్ జిల్లాకు చెందిన యోగి వేమన వర్సిటీ (వైవీయూ) వీసీ ఆచార్య చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకట సుబ్బయ్య, ఏఎఫ్‌యూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సి. సురేంద్రనాథ్‌రెడ్డి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి రాజకీయ నేపథ్యం, వివాదం లేని గిరిజన ఆచార్యుడైన బానోతు ఆంజనేయప్రసాద్‌ను సైతం రాజీనామా సమర్పించాలని కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో వీసీ పదవి నుంచి వైదొలిగారు. 2026 ఫిబ్రవరి 8 వరకు పదవీకాలం ఉన్నా తప్పుకున్నారు.వైదొలిగిన జేఎన్టీయూకే వీసీజేఎన్టీయూ–కాకినాడ వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు తన పదవికి రాజీనామా చేశారు. 2021 అక్టోబర్ 29న వీసీగా నియమితులైన ఆయన మరో నాలుగు నెలల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేయాల్సి వచ్చింది.ఏఎన్‌యూ వీసీ, ఉన్నతాధికారులు..గుంటూరు జిల్లా నంబూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య బి.కరుణ, పలువురు కో–ఆరి్డనేటర్లు, డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. -
వైద్యవిద్య పీజీ ప్రవేశాల వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: 2023–24 విద్యాసంవత్సరానికి రాష్ట్ర కోటా పీజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల నమోదుకు శుక్రవారం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీచేసింది. ఇన్ సర్వీస్, నాన్ సర్వీస్ అభ్యర్థులు https:// pgcq.ysruhs.com వెబ్సైట్లో ఆదివారం ఉదయం 10 గంటలలోపు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. ఆప్షన్ల నమో దు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే 7416563063, 7416253073, 9063400829 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని వీసీ డాక్టర్ బాబ్జీ సూచించారు. పలు కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలపై ఎన్ఎంసీ పేరిట ఫేక్/ఫోర్జరీ అనుమతి పత్రాలు వెలుగులోకి రావడంతో తొలిదశ కౌన్సెలింగ్‌ను రద్దుచేసినట్లు తెలిపారు. ఎన్ఎంసీ నుంచి స్పష్టత తీసుకుని రివైజ్డ్ సీట్ మ్యాట్రిక్స్‌ను వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు మళ్లీ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. తొలిదశలో కేటాయించిన సీట్లు రద్దుచేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు. జీఎస్ఎల్, మహారాజాల్లోను ఫేక్ అనుమతులు శాంతీరామ్ వైద్యకళాశాలలో ఫేక్ అనుమతుల వ్యవహారం బయటపడటంతో అప్రమత్తమైన విశ్వవిద్యాలయం అధికారులు మిగిలిన కళాశాలల్లో సీట్లను పరిశీలించారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని జీఎస్ఎల్, విజయనగరం జిల్లాలోని మహారాజా ప్రైవేట్ వైద్యకళాశాలల్లోని పీజీ సీట్లకు, ఎన్ఎంసీ వెబ్సైట్లో చూపిస్తున్న సీట్లకు మధ్య వ్యత్యాసం గుర్తించారు. దీంతో ఎన్ఎంసీకి ఈ వ్యవహారంపై లేఖ రాశారు. ఆయా కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలకు తాము అనుమతులు ఇవ్వలేదని ఎన్ఎంసీ శుక్రవారం స్పష్టం చేసింది. సీట్లు పెంచుతూ వెలువడిన అనుమతులు ఫేక్/ఫోర్జరీవని తెలిపింది. మరోవైపు 2023–24 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా అన్ని రాష్ట్రాల డీఎంఈలు ఎన్ఎంసీ వెబ్సైట్లో ఉన్న సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. సాధారణ ప్రజలు సైతం ఇతర మాధ్యమాల్లో పొందుపరిచే సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది. -
వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పీజీ మెడికల్ సీట్ల కౌన్సెలింగ్ రద్దు
విజయవాడ: వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పీజీ మెడికల్ సీట్ల కౌన్సిలింగ్ రద్దయ్యింది. మెడికల్ కళాశాలల సీట్ల భర్తీలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అవతవకలు పాల్పడ్డాయి. ఈ విషయాన్ని గుర్తించిన (నేషనల్ మెడికల్ కమిషన్) ఎన్ఎంసీ.. కౌన్సిలింగ్ ప్రక్రియను నిలిపివేసింది. ఎన్ఎంసీ నుంచి సీట్ల పెంపుదలపై ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు నకిలీ ఆదేశాలు వచ్చాయి. ఈ అవతవకల విషయం వెలుగులోకి రావడంతో తిరిగి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీకి ఆదేశాలు జారీ చేసింది ఎన్ఎంసీ. నంద్యాల శాంతి రామ్ మెడికల్ కాలేజీలో 7 ఎండి జనరల్ మెడిసిన్ సీట్లకు బదులుగా, 24 సీట్లను భర్తీ చేశారని గుర్తించిన ఎన్ఎంసీ.. రాజమహేంద్రవరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లో 24 సీట్లుండగా 40 జనరల్ మెడిసిన్ సీట్లను భర్తి చేసినట్లు పసిగట్టింది. విజయనగరం మహారాజా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎక్కువ సీట్లు భర్తీ చేసినట్లు గుర్తించారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలలకి ఎన్ఎంసీ పేరుతో ఫేక్ ఆర్డర్స్ వచ్చినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో కొందరి ఉద్యోగుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి దొంగలను గుర్తించే పనిలో నిమగ్నమైంది ఎన్ఎంసీ. మూడు మెడికల్ కళాశాలలపై చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కౌన్సిలింగ్ ప్రక్రియ రద్దు కావడంతో విద్యార్ధులు ఇబ్బంధి పడకుండా యూనివర్సిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. -
పారదర్శకంగా వైద్యవిద్య అడ్మిషన్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలో 2023–24 సంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్లు పారదర్శకంగా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వీసీ డాక్టర్ కోరుకొండ బాబ్జి తెలిపారు. అందుకు సంబంధించి అడ్మిషన్స్ విభాగం వారితో కలిసి మూడుసార్లు మాక్ ట్రయల్ నిర్వహించామన్నారు. యూనివర్సిటీ పరిధిలోని సీట్లు, అడ్మిషన్ల ప్రక్రియ వంటి అంశాలను గురువారం ఆయన ‘సాక్షి’కి వివరించారు. తెలంగాణ జీవోపై నిర్ణయం.. 2014 జూన్ రెండు తర్వాత తెలంగాణలో కొత్తగా వచ్చిన వైద్య కళాశాలల్లోని యూజీ సీట్లలో 15 శాతం అన్ రిజర్వుడ్ కోటాలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఇచ్చేది లేదని అక్కడి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య కళాశాలల్లో మంజూరైన ఎంబీబీఎస్ సీట్లతో పాటు, పీజీ సీట్లు కూడా అన్ రిజర్వుడ్ కోటాలో తెలంగాణ విద్యార్థులకు నిలిపివేసే విషయంలో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల వైద్య కళాశాలల్లో 750 సీట్లు పెరిగాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,109 సీట్లు ఉన్నట్లు తెలిపారు. వాటిలో 15 శాతం ఆలిండియా కోటాలో పోగా, మిగిలిన సీట్లకు ఇక్కడ అడ్మిషన్లు జరుపుతామన్నారు. 18 ప్రైవేటు వైద్య కళాశాలల్లో 3,000 ఎంబీబీఎస్ సీట్లున్నాయని, వాటిలో 50 శాతం.. 1,500 సీట్లను ఏ కేటగిరిలో భర్తీ చేస్తామని వీసీ తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకేసారి డైనమిక్ కౌన్సెలింగ్ నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చిందని వీసీ తెలిపారు. ఏపీ, తెలంగాణలకు విభజన ఇబ్బందులు ఉన్న దృష్ట్యా ఈ ఏడాదికి పాత పద్ధతిలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, వచ్చే ఏడాది నుంచి నూతన విధానాన్ని అనుసరిస్తామని కేంద్రానికి చెప్పినట్టు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పీజీ, యూజీ అడ్మిషన్లు నిర్వహిస్తామని వివరించారు. -
ఏపీలో త్వరలోనే అందుబాటులోకి 4 వైద్య కళాశాలలు
గుంటూరు మెడికల్: ఆర్థోపెడిక్ వైద్య విభాగంలో పీజీ సీటు తీసుకునేందుకు ఒకప్పుడు వెనకడుగు వేసేవారని నేడు ఆర్థోపెడిక్‌కి డిమాండ్ పెరుగుతోందని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ కోరుకొండ బాబ్జి చెప్పారు. గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో శుక్రవారం ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 52వ వార్షిక సదస్సు ప్రారంభమైంది. ఈ నెల 26 వరకు ఈ సదస్సు జరగనుంది. డాక్టర్ బాబ్జి ముఖ్య అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నేడు కొత్తగా 5 వైద్య కళాశాలలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల కాలంలో విజయనగరం వైద్య కళాశాల ప్రారంభించామని, త్వరలోనే మిగతా 4 వైద్య కళాశాలలు ప్రారంభమవుతాయన్నారు. వీసీగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా గుంటూరు సదస్సుకు విచ్చేసిన డాక్టర్ బాబ్జిని సదస్సు నిర్వాహకులు సన్మానించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి మాట్లాడుతూ నొప్పి నివారణలో ఆర్థోపెడిక్ వైద్యుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ జాతీయ జనరల్ సెక్రటరీ డాక్టర్ నవీన్ ఠక్కర్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ కోసం ఏపీ నుంచి 134 మంది యువ వైద్యులు దరఖాస్తు చేసుకోవడం సంతోషకరమన్నారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చాగంటి పద్మావతి దేవి, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీలు డాక్టర్ సూరత్ అమర్నా«ధ్, డాక్టర్ యశశ్వి రమణ తదితరులు ప్రసంగించారు. -
డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్సిటీ వీసీ నియామకానికి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ (వీసీ) నియామకం కోసం సోమవారం రిజిస్ట్రార్ (ఎఫ్ఏసీ) డాక్టర్ సీహెచ్.శ్రీనివాసరావు నోటిఫికేషన్ విడుదల చేశారు. విశ్వవిద్యాలయం వెబ్సైట్లో దరఖాస్తు ఫారాన్ని అందుబాటులో ఉంచారు. అర్హులైన వైద్యులు దరఖాస్తు ఫారాలను డౌన్లోడ్ చేసుకుని పూర్తిచేసి, అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి సమర్పించాలి. ఈ నెల 31వ తేదీ సాయంత్రం ఐదుగంటల వరకు దరఖాస్తులు అందజేయవచ్చు. వీసీ ఎంపికకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ ఏర్పాటు చేసింది. గవర్నర్ నామినేట్ చేసిన విశ్వభారతి వైద్య కళాశాల డైరెక్టర్ డాక్టర్ గజ్జల వీరాంజిరెడ్డి, విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కమిటీ నామినేట్ చేసిన శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్, వీసీ డాక్టర్ వెంగమాంబ, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ 45 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుత వీసీ డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ పదవీకాలం ఈ నెల 12వ తేదీతో ముగియనుంది. ఇదీ చదవండి: AP: ఫ్యామిలీ డాక్టర్.. సరికొత్త ‘జీవన శైలి’ -
ఎంబీబీఎస్ ప్రవేశాల్లో ఎన్సీసీ రిజర్వేషన్‌కు పిల్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో ఎన్సీసీ విద్యార్థులకు 1 శాతం రిజర్వేషన్‌ను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, డాక్టర్ వైఎస్సార్ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, వైఎస్సార్ వైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్, ఎన్సీసీ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022–23 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో ఎన్సీసీ సర్టిఫికెట్లను అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఫెడరేషన్ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసయ్య నర్సింహ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం ఎన్సీసీ విద్యార్థులకు 1 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కవిత గొట్టిపాటి వాదనలు వినిపిస్తూ.. ఎన్సీసీ కోటా విషయంలో అధికారులు ప్రభుత్వ జీవో ప్రకారం నడుచుకోవడం లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. బాధిత విద్యార్థులు వస్తే ఈ వ్యవహారంపై తగిన విధంగా స్పందిస్తామని తెలిపింది. ఇది సర్వీసు వివాదమని, ఇలాంటి వ్యవహారంలో పిల్ దాఖలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. అయినా కూడా ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపింది. కవిత జోక్యం చేసుకుంటూ.. ప్రవేశాలు జరుగుతున్నాయని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. పిటిషన్‌ను కొట్టేయకుండా ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపింది. నోటీసులు జారీ చేస్తే సమస్య పరిష్కారమవుతుందన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నామని పేర్కొంది. -
ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: 2022–23 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ యాజమాన్య కోటా (బీ కేటగిరీ) సీట్ల భర్తీకి తొలి దశ కౌన్సెలింగ్‌లో విద్యార్థులకు సీట్ల కేటాయింపు పూర్తయింది. సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం విడుదల చేసింది. యాజమాన్య కోటా ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న 3,021 మందితో తుది మెరిట్ జాబితా విడుదల చేయగా ఇందులో 1,042 మందికి సీట్లు కేటాయించారు. తొలి దశలోనే బీ కేటగిరీ సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ఇందులో 233 సీట్లలో ఏపీతో పాటు, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అవకాశం కల్పించారు. మిగిలిన 809 సీట్లలో కేవలం ఏపీ విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు లభించాయి. బీఎస్సీ నర్సింగ్‌లో నేటి నుంచి వెబ్ ఆప్షన్లు పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులో రాష్ట్ర కోటా సీట్ల భర్తీకి రెండో దశ వెబ్ కౌన్సెలింగ్‌కు బుధవారం నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 4 గంటల్లోగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. https://ugpostbasic.ntruhs admi ssions.com వెబ్సైట్లో తుది జాబితాలో పేర్లు న్న విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఇదిలా ఉండగా నంద్యాల జిల్లాలో ఓ ప్రైవేట్ కళాశాలలో అడ్మిషన్లకు అనుమతులు లభించాయి. రిపోర్ట్ చేయని వారు 208 మంది.. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు తొలి దశ కౌన్సెలింగ్‌లో 3,289 మందికి సీట్లు కేటాయించారు. వీరిలో 208 మంది విద్యార్థులు నిర్ణీత సమయంలోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయలేదు. వీరి వివరాలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం ప్రకటించింది. -
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, అమరావతి: 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రారంభించింది. ఈ క్రమంలో ఎంబీబీఎస్ సీట్ల వివరాలను ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం అదనంగా 300 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది బాగా తగ్గింది. గత ఏడాది 14 వేల మంది వరకూ దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది ఆ సంఖ్య 11 వేల లోపునకే పరిమితమైంది. 10,782 మంది విద్యార్థులు విశ్వవిద్యాలయం విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలో ఉన్నారు. రాష్ట్ర కోటాలో 1,865 సీట్లు.. రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 16 ప్రైవేట్, రెండు మైనారిటీ, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలు ఉన్నాయి. 11 ప్రభుత్వ కళాశాలల్లో 2,185 సీట్లు ఉన్నాయి. వీటిలో 325 సీట్లు ఆలిండియా కోటాలో భర్తీ అవుతాయి. మిగిలిన 1,860 సీట్లు రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. మరోవైపు 16 ప్రైవేట్, రెండు మైనార్టీ కళాశాలల్లో 3 వేల సీట్లు ఉన్నాయి. వీటిలో 1,500 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ అవుతాయి. మిగిలిన సీట్లను బీ, సీ కేటగిరీల్లో భర్తీ చేస్తారు. మరోవైపు శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)లో 175 సీట్లు ఉండగా 126 రాష్ట్ర కోటాలో, 26 ఆల్ ఇండియా కోటాలో, 23 ఎన్నారై కోటా కింద భర్తీ అవుతాయి. ఇలా మొత్తంగా ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్, మైనార్టీ, ఇతర కళాశాలల్లో మొత్తం 5,360 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నోటిఫికేషన్ వివరాల కోసం https://ugcq.ntruhs admissions.com/ చూడొచ్చు. అన్ని కౌన్సెలింగ్లకు వన్‌టైమ్ ఆప్షన్ విధానం.. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి సంబంధించి తొలి దశ ఆన్లైన్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఆప్షన్ల నమోదుకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం అర్ధరాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యార్థులు మంగళవారం (నవంబర్ 8) రాత్రి ఏడు గంటల్లోగా ఆప్షన్లను నమోదు చేయాలి. ఒక్కసారి ఆప్షన్లు నమోదు చేస్తే చాలు.. వీటినే అన్ని విడతల కౌన్సెలింగ్‌కు పరిగణనలోకి తీసుకుంటారు. రీటెయిన్ విధానాన్ని ఈ ఏడాది విశ్వవిద్యాలయం అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం.. విద్యార్థి తనకు ఇష్టమైన కళాశాలలో తొలి దశలోనే సీటు వస్తే.. ఆ సీటుకే పరిమితం అవుతానని అంగీకారం తెలపొచ్చు. ఇలాంటి విద్యార్థులను తర్వాతి కౌన్సెలింగ్లకు పరిగణనలోకి తీసుకోరు. విద్యార్థుల మొగ్గు ఆంధ్రా వైద్య కళాశాలకే.. విద్యార్థుల మొగ్గు విశాఖపట్నంలోని ఆంధ్రా వైద్య కళాశాల వైపే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత స్థానాల్లో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల, కాకినాడ రంగరాయ, కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల ఉన్నాయి. గతేడాది ఆంధ్రా కళాశాలలో ఎస్టీ కేటగిరీలో 472 స్కోరుతో 1,10,270 ర్యాంక్ సాధించిన విద్యార్థికి చివరి సీటు వచ్చింది. ఇక ఎస్సీల్లో 79,876 ర్యాంక్, బీసీ కేటగిరీలో 32,693 ర్యాంక్, ఓసీల్లో 15,824 ర్యాంక్, ఈడబ్ల్యూఎస్‌లో 20,137 ర్యాంక్ తుది కటాఫ్ ర్యాంకులుగా నిలిచాయి. ఆప్షన్ల నమోదులో జాగ్రత్త.. విద్యార్థులు ప్రాధాన్యత క్రమంలో ఒకేసారి ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆప్షన్ల నమోదు విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి. సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది. అన్ని సీట్లు భర్తీ అయ్యేంత వరకూ మాప్–అప్ రౌండ్ కౌన్సెలింగ్‌లు చేపడతాం. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఏమైనా సందేహాలు ఉంటే విశ్వవిద్యాలయం ఇచ్చిన ఫోన్ నంబర్లను సంప్రదించొచ్చు. – డాక్టర్ శ్యామ్‌ప్రసాద్, వీసీ, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం -
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ప్రక్రియ పరిపూర్ణం
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా వెబ్‌సైట్‌ను మార్చడంతో పాటు, అన్నింట్లో మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే యూనివర్సిటీలోని అన్ని విభాగాల్లో పేర్లు మార్చారు. యూనివర్సిటీ భవనంపై ఉన్న పేర్లు సైతం మార్చేశారు. యూనివర్సిటీ నిధులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, ఇతరత్రా పేర్లు సైతం మార్పు చేసేలా బుధవారం చర్యలు తీసుకున్నారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ముందస్తు చర్యలను యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి.శ్యామ్‌ప్రసాద్‌తో పాటు ఇతర అధికారులు సమీక్షిస్తున్నారు. విదేశాలకు వెళ్లే వైద్య విద్యార్థులకు సైతం ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సమగ్ర చర్యలు తీసుకుంటున్నారు. ఇక మీదట అన్ని కార్యకలాపాలు డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరుతోనే నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. -
హెల్త్ వర్సిటీ వెబ్సైట్లో మార్పులు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ సోమవారం ఆదేశాలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక వర్సిటీ అధికారిక వెబ్సైట్లోనూ మార్పుల ప్రక్రియకు మంగళవారం శ్రీకారం చుట్టింది. అన్ని రకాల వెబ్సైట్లను డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మారుస్తున్నారు. ఇకపై అన్ని రకాల ఉత్తర ప్రత్యుత్తరాలతో పాటు, ఇతర కార్యకలాపాలు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుతోనే నిర్వహించనున్నారు. ఇందుకోసం అనుబంధ కళాశాలలకు, నేషనల్ మెడికల్ కమిషన్‌కు సమాచారం ఇవ్వనున్నారు. ఒకట్రెండు రోజుల్లో యూనివర్సిటీ భవనాలపై ఉన్న పేర్లు సైతం మార్పుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో రెండుసార్లు పేరు మార్పు విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడం ఇప్పుడు కొత్తేమీ కాదని సీనియర్ వైద్యులు అంటున్నారు. తొలుత యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (యూహెచ్ఎస్)గా ఉండేదని, ఆ తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా నామకరణ చేశారని గుర్తుచేశారు. ఆయన మరణానంతరం డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చారని పేర్కొన్నారు. అప్పట్లో వైద్య విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదని.. ఇప్పుడు కూడా ఏమీ ఉండవని వారంటున్నారు. వైఎస్సార్ సేవలకు గుర్తింపుగానే.. ఇక రాష్ట్రంలో వైద్య రంగానికి దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలకు గుర్తింపుగానే హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టారని యూనివర్సిటీ డెంటల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ మెహబూబ్ షేక్ తెలిపారు. ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి సేవలతో పాటు, కొత్తగా మూడు వైద్య కళాశాలలను ఏర్పాటుచేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా 17 వైద్య కళాశాలలు ఏర్పాటుచేస్తున్నారని, వర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడంతో తప్పులేదని, విద్యార్థులకూ ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన స్పష్టంచేశారు. -
వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ: చట్ట సవరణకు గవర్నర్ ఆమోదముద్ర
అమరావతి: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్శిటీగా మారుస్తూ చేసిన చట్ట సవరణకు ఆమోద ముద్ర పడింది. ఈ మేరకు అసెంబ్లీ చేసిన చట్ట సవరణను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ఆమోదించారు. గవర్నర్ ఆమోదంతో ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ్టి నుంచి సవరించిన చట్టాన్ని అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం చట్ట సవరణ చేసిన సంగతి తెలిసిందే. దీనికి తాజాగా గవర్నర్ ఆమోద ముద్ర వేయగా, ప్రభుత్వం ఉత్తర్తులు జారీ చేసింది. -
‘తేడా వస్తే దబిడిదిబిడే’.. బాలకృష్ణపై మంత్రుల ఫైర్
సాక్షి, అమరావతి: హెల్త్ వర్సిటీకి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టడాన్ని తప్పుపడుతూ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన విమర్శలపై పలువురు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణకు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. ‘చూడు బాలయ్య.... నీ కన్న తండ్రి ఎన్టీఆర్ గారి మీద వైశ్రాయ్ హోటల్ ముందు నీ బావ చంద్రుబాబు చెప్పుల వర్షం కురిపిస్తుంటే నువ్వు మందు తాగుతూ ఎంజాయ్ చేశావు. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది.. అదే ఎన్టీఆర్ పేరు కృష్ణా జిల్లాకు పెట్టిన చరిత్ర మా ప్రభుత్వానిది’ అని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. చూడయ్య బాలకృష్ణ.... నీ కన్న తండ్రి ఎన్టీఆర్ గారి మీద వైశ్రాయ్ హోటల్ ముందు నీ బావ చంద్రబాబు చెప్పుల వర్షం కురిపిస్తుంటే నువ్వు మందు తాగుతూ ఎంజాయ్ చేశావు. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది. అదే ఎన్టీఆర్ పేరు కృష్ణా జిల్లాకు పెట్టిన చరిత్ర మా ప్రభుత్వానిది. — Narayanaswamy Kalathuru (@NSwamy_Official) September 24, 2022 రీల్ సింహం కాదు రియల్ సింహం.. బాలకృష్ణ ట్వీట్‌కి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు కౌంటర్ ట్వీట్ చేశారు. ‘ బాలయ్యా.. ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్ ముందు కాదు.. అసెంబ్లీలో అంత క్లియర్‌గా చెప్పాకా కూడా వైలెన్స్ చేయాలి అనుకుంటే.. అక్కడ ఉన్నది రీల్ సింహం కాదు రియల్ సింహం జగన్... తేడా వస్తే మీ బావ, బామ్మర్దులకు దబిడిదిబిడే..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కారుమూరి. బాలయ్యా.. ప్లూటు బాబు ముందు ఊదు... జగన్ గారి ముందు కాదు... అసెంబ్లీ లో అంత క్లియర్ గా చెప్పాకా కూడా వైలెన్స్ చేయాలి అనుకుంటే... అక్కడ ఉన్నది రీల్ సింహం కాదు రియల్ సింహం జగన్... తేడా వస్తే మీ బావ, బామ్మర్దులకు దబిడిదిబిడే... — Karumuri Venkata Nageswara Rao (@karumurionline) September 24, 2022 ఇదీ చదవండి: బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు.. జగనన్న ముందు కాదు: మంత్రి రోజా కౌంటర్ -
‘బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు.. జగన్ అన్న ముందు కాదు’
సాక్షి, హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌పై చెప్పులేసిన వారు, వెన్నుపోటుదారులు ఆయన భక్తులమని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందని ఇప్పటికే పలువురు రాష్ట్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. హెల్త్ వర్సిటీకి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టడాన్ని తప్పు పట్టే నైతిక అర్హత వారికి లేదన్నారు. ఈ వ్యవహారంపై సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణకు పర్యాటక శాఖ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా మంత్రి రోజా.. ‘బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు... జగన్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ"గన్" అనే రియల్ సింహం.. తేడా వస్తే దబిడి దిబిడే..!!’ అంటూ కామెంట్స్ చేశారు. బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు... జగన్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ"గన్" అనే రియల్ సింహం 🦁 తేడా వస్తే దబిడి దిబిడే..!! — Roja Selvamani (@RojaSelvamaniRK) September 24, 2022 -
జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య ..!: అంబటి రాంబాబు
సాక్షి, విజయవాడ: తమ హయాంలో ఒక్క ప్రభుత్వ ఆస్పత్రి కూడా కట్టలేకపోయిన టీడీపీ నాయకులు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం పేరు మార్చగానే కొందరు గగ్గోలు పెట్టడాన్ని మంత్రులు మేరుగ నాగార్జున, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు ఖండించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన విమర్శలకు మంత్రులు ట్విటర్ వేదికగా స్పందించారు. బాలకృష్ణా... హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎప్పుడు పెట్టారు? ఆయనను మీరంతా కలిసి చంపేశాకే కదా? చేసిన పాపం పేరు పెడితే పోతుందా బాలకృష్ణా.? — Merugu Nagarjuna (@merugunag) September 24, 2022 బాలకృష్ణా... ఒక్క ప్రభుత్వ ఆస్పత్రి కూడా టీడీపీ హయాంలో కట్టకపోయినా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎలా పెట్టుకున్నారు.? — Merugu Nagarjuna (@merugunag) September 24, 2022 జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య ..! — Ambati Rambabu (@AmbatiRambabu) September 24, 2022 Both are not same… ఎన్టీఆర్ మీద బాబు చెప్పులు వేయిస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి పూలు వేయించారు జగన్ pic.twitter.com/zAiGZdvH9G — Gudivada Amarnath (@gudivadaamar) September 24, 2022 -
అందుకే హెల్త్ యూనివర్శిటికీ వైఎస్సార్ పేరు.. వాస్తవాలివిగో..
ఏపీలో ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం పేరు మార్చగానే కొందరు గగ్గోలు పెడుతున్నారు. బ్రహ్మండం బద్ధలయిందా అన్నట్టుగానే గావు కేకలు పెడుతున్నారు. డాక్టర్ వైఎస్సార్ పేరు ఎందుకు పెట్టారన్న విషయాన్ని మాత్రం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. నిజాలేంటో మీరే గమనించండి. వైద్య,ఆరోగ్య రంగంలో పెను విప్లవానికి శ్రీకారం చుట్టారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. పేదోడికి కార్పొరేట్ వైద్యాన్ని ఓ హక్కుగా మలుస్తూ ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన చేసి పకడ్బందీగా అమలు చేశారు. లక్షలాది మంది ఆ పథకంతో ప్రాణాలు నిలుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు భారతదేశంలో ఎక్కడికెళ్లినా సరే ఆరోగ్యశ్రీ అన్న పేరు వినపడితే చాలు ఎవ్వరికైనా గుర్తుకు వచ్చేది వైఎస్సార్ పేరే. 2003లో పాదయాత్ర సందర్బంగా ప్రజల కష్టసుఖాలు వారి నోటనే విన్న వైఎస్సార్ నిరుపేదలకు ఏ అనారోగ్యం కలిగినా ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి లేదని గమనించారు. అందుకే తాను అధికారంలోకి వస్తే ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలని దృఢ సంకల్పం తీసుకున్నారు. 2004లో వైఎస్సార్ అధికారంలోకి రాగానే ఎన్నికల హామీలకు సంబంధించిన కీలక ఫైళ్లపై సంతకాలు చేసిన తర్వాత మొదటి చూపు పేదల ఆరోగ్యంపైనే పెట్టారు. అలా ఆరోగ్య శ్రీ పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి వచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు ఆరోగ్యశ్రీని మెచ్చుకోవడమే కాకుండా తమ రాష్ట్రాల్లో దీని ఎలా అమలు చేయచ్చా అని అధ్యయనాలు చేశారు కూడా. ఈ పథకంతో నిరుపేద కుటుంబీకులు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో కోటీశ్వరులతో సమానంగా వైద్యం అందుకోగలిగారు. ఎన్నో గుండె ఆపరేషన్లు ఎందరి ప్రాణాలనో కాపాడాయి. వారి కుటుంబాల్లో సంతోషాలు నింపాయి. అందుకే 2009 ఎన్నికల్లోనూ వైఎస్సార్‌కు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య శ్రీ పథకం అంతంత మాత్రంగా అమలయ్యేది. ఇందులో భాగంగా ప్రవేశ పెట్టిన 108, 104వాహనాలు మూలన పడ్డాయి. వాటికి మరమ్మతులు చేయించకుండా కొత్త వాటిని కొనకుండా పథకాన్ని నీరుగార్చింది చంద్రబాబు నాయుడి ప్రభుత్వం. ప్రజల్లో మళ్లీ ఆరోగ్యంపై ఒక రకమైన బెంగ. ఈ క్రమంలోనే 2018లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు. యాత్ర పొడవునా గ్రామగ్రామాన నిరుపేద ప్రజలను కలుసుకున్న జగన్ వారి జీవన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో తాను అధికారంలోకి వస్తే వైద్య,ఆరోగ్య రంగంలో తన తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే తాను రెండడుగులు ముందుకు వేస్తానని భరోసా ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన జగన్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని ఎవరూ ఊహించని విధంగా విస్తరించారు. ►వెయ్యికి పైగా రుగ్మతలకు మాత్రమే ఆరోగ్యశ్రీలో చికిత్స అందేది. దాన్ని రెండు వేల నాలుగు వందలకు పెంచిన జగన్మోహన్ రెడ్డి వచ్చే అక్టోబరు 5నుండి ఏకంగా 3,118 వైద్య ప్రక్రియలను ఆరోగ్యశ్రీలో చేరుస్తున్నారు. ►90శాతం ప్రజలకు ఆరోగ్య శ్రీ వెన్నుదన్నుగా నిలిచింది. నాడు- నేడు పథకం కింద ఆసుపత్రుల రూపు రేఖలను మార్చేశారు. ►కార్పొరేట్ ఆసుపత్రులకు ఏ మాత్రం తీసిపోకుండానే కాదు కార్పొరేట్ ఆసుపత్రులను మించి ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరించారు. దానికి అనుగుణంగా ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతరత్రా సిబ్బంది నియామకాలు చేపట్టారు. ►వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి మన రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా లేదు. ఈ విషయం కరోనా వల్లనే బయట పడింది. వైరాలజీ ల్యాబ్‌లు కూడా లేవని వారు చెప్పడంతో అప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరాలజీ ల్యాబులను ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వాటికి నిధులు మంజూరు చేసి యుద్ద ప్రాతిపదికన వాటిని అందుబాటులోకి తెచ్చారు. ►కరోనా రెండో వేవ్‌లో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత సమస్య రావడంతో ఏపీలో అది పునరావృతం కాకుండా చూసేందుకు ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు వేగంగా నిధులు విడుదల చేసి చక్కటి విజన్ చాటుకున్నారు ►వాక్సినేషన్లో దేశానికే ఆదర్శంగా నిలిచారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే ఏ రాష్ట్రమైనా చురుగ్గా పనిచేయగలుగుతుంది. పనులు చురుగ్గా జరిగితేనే ప్రగతి రథ చక్రాలు వేగంగా ముందుకు కదులుతాయి. ఆ చక్రాలు వేగం అందుకుంటేనే అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఈ లక్ష్యంతోనే తన తండ్రి వైఎస్సార్ అడుగు జాడల్లో జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ వన్‌గా నిలపాలని కంకణం కట్టుకున్నారు. మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలతో పోటీపడేలా ఏపీని వైద్య రంగంలో తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ రెండు దశాబ్ధాల పాటు అధికారంలో ఉన్నా ఒక్కటంటే ఒక్క వైద్య కళాశాలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయలేదు. వైద్య రంగంపైనా ప్రజారోగ్యంపైనా టిడిపికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనడానికి ఇదే తిరుగులేని నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మూడేళ్ల వ్యవధిలోనే రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయడం రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త అధ్యాయం అంటున్నారు మేధావులు. స్వాతంత్ర్యం వచ్చిందగ్గర నుంచి 2019 వరకు 72 ఏళ్ల లో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు కావడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్థాపించారు. 1947 నుండి 2004 వరకు వీటిలో ఎనిమిది కాలేజీలు నెలకొల్పితే 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నారు. చిత్రం ఏంటంటే పార్టీ ఆవిర్బావం నుంచి రెండు దశాబ్ధాల నిడివి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా పెట్టలేదు. తండ్రిగా వైఎస్సార్, కొడుకుగా వైఎస్ జగన్.. ఆరోగ్య రంగానికి.. తద్వారా ప్రజలకు చేసిన సేవలు ఎప్పటికీ ఎవరూ మరిచిపోలేరు. అందుకే హెల్త్ యూనివర్సిటీకి పేరు పెట్టడానికి వైఎస్సార్ తప్ప మరో వ్యక్తి సమీప దూరంలో కనిపించరు.