
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా వెబ్‌సైట్‌ను మార్చడంతో పాటు, అన్నింట్లో మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే యూనివర్సిటీలోని అన్ని విభాగాల్లో పేర్లు మార్చారు. యూనివర్సిటీ భవనంపై ఉన్న పేర్లు సైతం మార్చేశారు.
యూనివర్సిటీ నిధులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, ఇతరత్రా పేర్లు సైతం మార్పు చేసేలా బుధవారం చర్యలు తీసుకున్నారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ముందస్తు చర్యలను యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి.శ్యామ్‌ప్రసాద్‌తో పాటు ఇతర అధికారులు సమీక్షిస్తున్నారు. విదేశాలకు వెళ్లే వైద్య విద్యార్థులకు సైతం ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సమగ్ర చర్యలు తీసుకుంటున్నారు. ఇక మీదట అన్ని కార్యకలాపాలు డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరుతోనే నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment