ఆందోళనలో ‘విదేశీ’ వైద్య విద్యార్థులు | Foreign Medical Students Protest: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఆందోళనలో ‘విదేశీ’ వైద్య విద్యార్థులు

Published Mon, Dec 16 2024 4:35 AM | Last Updated on Mon, Dec 16 2024 4:35 AM

Foreign Medical Students Protest: Andhra pradesh

మెడికల్‌ కౌన్సిల్‌లో పర్మినెంట్‌ 

రిజిస్ట్రేషన్‌కు అడ్డంకులు

ప్రభుత్వాలు స్పందించాలని వినతి

లబ్బీపేట (విజయవాడతూర్పు): విదేశాల్లో వైద్య విద్యనభ్యసించిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారి సర్టిఫికెట్స్‌ పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ నుంచి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. నేషనల్‌ మెడిక­ల్‌ కమిషన్‌ ఆదేశాలు పాటిస్తున్నట్లు మెడికల్‌ కౌన్సి­ల్‌ అధికారులు చెబుతుండగా, రిజిస్ట్రేషన్లను జాప్య­ం చేయడం వలన తమ కాలం వృధా అవుతుందని విదేశీ వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్‌ ఏమిటో అర్ధం కావడం లేదంటూ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఎదుట ఇటీవల ఆందోళనకు దిగారు. తమ పీఆర్‌ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.   

అసలేం జరిగిందంటే..  
ఇటీవల తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల్లో విదేశాల్లో విద్యనభ్యసించామంటూ రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌కు వచ్చిన వారి సర్టిఫికెట్స్‌ నకిలీవనీ నిర్ధారణ అయింది. ఈ విషయంపై నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) స్పందించింది. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన వారు రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌కు వస్తే, వారు చదువుకున్న యూనివర్సిటీల నుంచి జెన్యునిటీ నిర్ధారణ ఉంటేనే రిజిస్ట్రేషన్‌ చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌కు రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన సుమారు 400 మంది విద్యార్థుల సర్టీఫికెట్స్‌ను ధ్రువీకరణ కోసం ఆయా దేశాల ఎంబసీకి పంపించారు. ఇప్పటి వరకూ వాటి విషయంలో ఎలాంటి ధ్రువీకరణ  రాలేదు.  

ర్యాంకులొచ్చినా పీజీ చేయలేం.. 
విదేశాల్లో వైద్య విద్యనభ్యసించి, ఇక్కడ ఎన్‌ఎంసీ నిర్వహించే నీట్‌లో మెరిట్‌ ర్యాంకులు వచ్చినా రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో పీజీలు చేయలేక పోతున్నట్లు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  2025–26 విద్యా సంవత్సరం అడ్మిషన్లకు నీట్‌ నోటిఫికేట్‌ వచ్చిందని, తమ పరిస్థితి ఏమిటో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్‌ఎంసీ ఆదేశాల మేరకే..
విదేశాల్లో వైద్య విద్య చదివిన వారి సర్టీఫికెట్లను జన్యునిటీ నిర్ధారణ జరిగిన తర్వాత మాత్రమే పీఆర్‌ ఇవ్వాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ఆదేశాలు ఇచ్చింది. వారి సూచనల మేరకు తమ వద్దకు రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన వారి సర్టీఫికెట్స్‌ను ఆయా దేశాల ఎంబసీకి పంపిస్తున్నాం. యూనివర్సిటీల నుంచి జెన్యూన్‌ అని నిర్ధారిస్తే వెంటనే రిజిస్ట్రేషన్‌ చేస్తాం. ఇప్పటి వరకూ 400 సర్టీఫికెట్స్‌ను అలా పంపించాం.  – డాక్టర్‌ ఐ.రమేష్, రిజి్రస్టార్, ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement