ఆరోగ్య విశ్వవిద్యాలయానికి హైకోర్టు కీలక ఆదేశాలు
ప్రతిభ ఆధారంగానే సీట్లు భర్తీ చేయండి
76 సీట్లకే స్పెషల్ స్ట్రే కౌన్సెలింగ్.. ఆ తరువాత బీడీఎస్ సీట్ల భర్తీ
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ స్పెషల్ స్ట్రే వేకెన్సీ సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కర్నూలులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆ జిల్లాలోని విశ్వభారతి, అమలాపురంలోని కోనసీమ మెడికల్ కాలేజీల్లో కన్వీ నర్ కోటా కింద 76 సీట్లు పెరిగిన నేపథ్యంలో వాటి భర్తీకి స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కింద కౌన్సెలింగ్ నిర్వహించాలని డాక్టర్ ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు గురువారం ఆదేశించింది. ప్రతిభ ఆధారంగానే ఈ సీట్ల భర్తీని చేపట్టాలని తేల్చి చెప్పింది. మొదటి మూడు రౌండ్లలో కన్వీనర్, యాజమాన్య, ఎన్‌ఆర్‌ఐ కోటా కింద ఏ కాలేజీల్లో సీట్లు రాని అభ్యర్థులందరి నుంచి ఆప్ష న్లు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు 76 సీట్లకే పరిమితమని స్పష్టం చేసింది.
ఈ సీట్ల భర్తీ వల్ల ఖాళీ అయ్యే బీడీఎస్ సీట్ల భర్తీకి కన్వీనర్ కోటా కింద తిరిగి స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని చెప్పింది. కౌన్సెలింగ్‌లో విశ్వవిద్యాలయం వ్యక్తం చేసిన వాస్తవ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ స్ట్రే వేకెన్సీ కౌన్సెలింగ్‌కు నీట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులందరినీ అనుమతించాలంటూ 25న ఇచ్చిన ఉత్తర్వుల ను కొంత మేర సవరిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఇప్పటివరకు జరిగిన కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారికి పెరిగిన సీట్ల భర్తీలో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా, తరువాతి ర్యాంకుల్లో ఉన్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించడం వల్ల తాము నష్టపోతా మంటూ నలుగురు విద్యార్థినులు హైకోర్టులో పి టిషన్లు దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. నీట్‌లో అర్హత సాధించిన అందరినీ స్పెషల్ స్ట్రే కౌన్సెలింగ్‌కు అనుమతించాలంటూ ఈ నెల 25న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా.. నీట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులందరినీ అనుమతిస్తే ఎన్‌ఎంసీ గడువైన డిసెంబర్ 6 లోగా కౌన్సెలింగ్‌ను పూర్తి చేయడం చాలా కష్టమ ని ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, జా యింట్ రిజిస్ట్రార్ (ప్రవేశాలు)తో పాటు యూనివర్సిటీ తరపున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీని వాస్ ధర్మాసనానికి వివరించారు. పిటిషనర్ల తర ఫున న్యాయవాది ఠాగూర్ యాదవ్ వాదించారు. ఇరుపక్షాల అభిప్రాయాలను తీసుకున్న అనంతరం ధర్మాసనం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment