
రాజమండ్రిలో తప్ప ఎక్కడా భూములు లేవు: మురళీమోహన్
రాజమండ్రిలో 300 గజాల స్థలం తప్ప తనకు ఎక్కడా భూములు లేవని టీడీపీ ఎంపీ, సినీనటుడు మురళీమెహన్ తెలిపారు.
గుంటూరు : రాజమండ్రిలో 300 గజాల స్థలం తప్ప తనకు ఎక్కడా భూములు లేవని టీడీపీ ఎంపీ, సినీనటుడు మురళీమెహన్ తెలిపారు. ఆయన శుక్రవారం గుంటూరులో విలేకర్లతో మాట్లాడుతూ తాను రియల్ ఎస్టేట్ వ్యాపారినే అయినా... వైట్ మనీతోనే భూములు కొంటానన్నారు. తన దగ్గర బ్లాక్ మనీ పైసా కూడా లేదని మురళీమోహన్ స్పష్టం చేశారు. తనకు బినామీ స్థలాలు ఉన్నాయని నిరూపిస్తే ఆ భూములను పేదలకు రాసిస్తానని ఆయన సవాల్ విసిరారు.