రాజమండ్రి: హైదరాబాద్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమండ్రి తరలించడానికి చర్యలు తీసుకుంటానని ఎంపీ మురళీమోహన్ చెప్పారు. రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులోని తెలుగు సాహిత్యపీఠంలో ‘బోయి భీమన్న పద్య, గేయ సాహిత్యం’పై రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది.ఈ సదస్సులో మురళీమోహన్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు మానసపుత్రిక అరుున ఈ విశ్వవిద్యాలయం తరలింపు విషయాన్ని సీఎం చంద్రబాబుతో మాట్లాడి, పుష్కరాలలోగా ప్రకటన వెలువడేందుకు కృషి చేస్తానని చెప్పారు.