
రెండు దశబ్ధాల కల నెరవేరింది
రాజమండ్రి: నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబి) నిర్మాణానికి ప్రతిపాదనలను ఆమోదం లభించినట్లు విజయవాడ రైల్వే డివిజినల్ డీఎంఆర్‌ఓ ప్రదిప్ కుమార్ అగర్వాల్ చెప్పారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎంపి మురళీమోహన్ మాట్లాడుతూ నిడదవోలు ప్రజల రెండు దశబ్ధాల కల నెరవేరిందన్నారు.
చాలా కాలం నుంచి నిడదవోలులో రైల్వేగేటు వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ గేటు వద్ద బ్రిడ్జి మంజూరైనా నిర్మాణ డిజైన్ ఆమోదం పొందలేదు. పేరుకు రైల్వే జంక్షన్ ప్రాంతమైనా బ్రిడ్జి నిర్మాణం జరగలేదు. ఇప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణానికి అడ్డంకులు అన్నీ తొలగిపోయినట్లు అగర్వాల్ తెలిపారు.