గణపవరం(నాదెండ్ల) న్యూస్‌లైన్: స్పిన్నింగ్ మిల్లులో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగి రూ.కోటికి పైగా ఆస్తినష్టం సంభవించింది. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో ఈ ప్రమాదంలో చోటుచేసుకుంది. మిల్లు చైర్మన్ యర్రం శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వైఎస్సార్ స్పిన్సింగ్ మిల్లులోని స్టాక్‌గోడౌన్‌లో మధ్యాహ్నం 2.45 గంటలకు భారీఎత్తున మంటలు చెలరేగాయి. కార్మికులు గమనించి యాజమాన్యానికి, అగ్నిమాపకదళ అధికారులకు సమాచారం ఇచ్చారు.
గోడౌన్‌లో ఉన్న 700 లకు పైగా పత్తి బేళ్లు, వీటిని ఆనుకొని ఉన్న 100 యార్న్ బండిల్స్ దగ్ధమయ్యాయి. మరో 100 యార్న్ బండిళ్ళను కార్మికులు సురక్షితంగా బయటకు తేగలిగారు. విద్యుత్ షార్ట్ సర్య్కూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. చిలకలూరిపేట ఫైర్ ఆఫీసర్ భాస్కరరావు సిబ్బందితో వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలను ఆర్పేందుకు ఐసీఎం, కల్పతరువు, ధనలక్ష్మి, ఎంఎల్ గ్రూపు, తిరుమలకంపెనీలకు చెందిన వాటర్‌ట్యాంకర్లను కూడా ఉపయోగించారు. అర్బన్ సీఐ గొట్టిపాటి చెంచుబాబు, ఎస్సై సాంబశివరావు, పలువురు పారిశ్రామికవేత్తలు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
స్పిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం
Published Wed, Dec 25 2013 2:15 AM | Last Updated on Wed, Sep 5 2018 3:52 PM
Advertisement
Advertisement