Heavy fire accident
-
అనంతలో భారీ అగ్నిప్రమాదం
పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని కియా కార్ల తయారీ పరిశ్రమ అనుబంధ స్క్రాప్ కేంద్రంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐదు వాహనాలు కాలిపోయి భారీ ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదాన్ని అదుపు చేసే సమయంలో తీవ్ర టెన్షన్‌కు గురై కియా ఫైర్‌స్టేషన్ మేనేజర్ పరంధామ (45) మృతి చెందాడు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆవరణలోని ట్రాన్స్ఫార్మర్ పేలడంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అక్కడి వాహన యజమానులు, కొందరు కూలీలు, గ్రామస్తులు రెండు వాహనాలను బయటకు తరలించగా మిగిలిన ఐదూ దగ్ధమయ్యాయి. సమీపంలోని రైతుల గడ్డివాములు కూడా కాలిపోయాయి. ప్రమాదంలో స్క్రాప్ కేంద్రంలో రూ.కోటికి పైగా నష్టం వాటిల్లుంటుందని అంచనా. ట్రాన్స్‌కోకు రూ.3లక్షలు నష్టం జరిగిందని ఏఈ పరమేశ్వరరెడ్డి తెలిపారు. విషయం తెలుసుకున్న మంత్రి శంకరనారాయణ పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. -
భారీ అగ్గి.. కోట్లు బుగ్గి
కుషాయిగూడ: చర్లపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో ఎగిసిపడ్డ మంటలు పక్కనే ఉన్న మరోకంపెనీకి కూడా వ్యాపించడంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. బుధవారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. చర్లపల్లి పారిశ్రామికవాడ లోని ఓ శీతల గిడ్డంగిని తల్లూరి సతీశ్ అనేవ్యక్తి లీజుకు తీసుకుని సన్సేషనల్ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తయారీ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ఫ్లాంట్‌లోని లేబుల్స్, ప్యాకింగ్ అట్టలు భద్రపరిచిన గదిలో షాట్‌సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. అవి ఫర్టిలైజర్స్‌లో కెమికల్స్‌కు బదులుగా వినియోగించే ఆయిల్ డబ్బా ల వరకూ వ్యాపించడంతో భారీగా పేలుడు సంభవించింది. దీంతో మంటల ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి కంపెనీ క్వార్టర్స్‌లో ఉన్న నలుగురు కార్మికులు కేకలు వేస్తు భయంతో పరుగులు తీశారు. స్థానిక ఫైర్‌స్టేషన్‌కు అగ్ని ప్రమాదం సమాచారాన్ని ఇవ్వగా అగ్నిమాపకదళం అక్కడకు చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే మంటలు పక్కనే ఉన్న బోర్డ్రిల్స్ ఫ్యాక్టరీ బెన్వర్ట్రాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది శ్రమించి ఆ మంటల్ని సాయంత్రం ఐదు గంటలకు అదుపులోకి తీసుకురాగలిగారు. ఈ ప్రమాదంలో ఆర్గానిక్ ఫ్యాక్టరీకి చెందిన సుమారు రూ. 25 కోట్ల విలువైన ముడి సరుకు మంటల్లో కాలి బూడిదైపోయింది. ఈమేరకు కంపెనీ యజమాని సతీశ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక బోర్వెల్ డ్రిల్స్ కంపెనీకి రూ. కోటికి పైగానే ఆస్తినష్టం వాటిల్లిందని నిర్వాహకుడు నవీన్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్లాంట్ యజమానికి నోటీసులు ఆర్గానిక్ ప్లాంట్ నిర్వహణకు యజమాని తమనుంచి ఎలాంటి అనుమతులు పొందలేని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జంగయ్య తెలిపారు. దీంతో ప్లాంట్ యజమానికి నోటీసులు జారీ చేయడంతో పాటుగా ఈ ఘటనను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అగ్నిప్రమాదం విషయం తెలిసిన కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగలు వ్యాపించడంతో ఆ మార్గంలో రోడ్డును మూసివేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. -
ముంబై ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం
సాక్షి ముంబై: తూర్పు అంధేరిలోని ఈఎస్ఐసీ ఆస్పత్రిలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించగా 141 మందికి గాయాలయ్యాయి. ఎంఐడీసీ సమీపంలో ఉన్న ఈఎస్ఐసీ ఆస్పత్రి భవనం చివరి నాలుగో అంతస్తులో సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు యత్నించారు. మంటల కారణంగా దట్టమైన పొగ అలుముకోవడంతో రోగులు శ్వాసించేందుకు ఇబ్బంది పడ్డారు. అప్పటికే కొందరు సమయస్ఫూర్తితో వ్యవహరించి పలువురిని సురక్షితంగా బయటికి తీయగలిగారు. అగ్నిమాపక సిబ్బంది నిచ్చెనల సాయంతో రోగులను, వారి సంబంధీకులను, సిబ్బందిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. రాత్రి ఎనిమిది గంటల వరకు అందిన సమాచారం మేరకు ఆరుగురు మరణించారు. వీరిలో ఒక రోగి ప్రాణభయంతో పైనుంచి దూకి ప్రాణాలు కోల్పోగా మరొకరు ఊపిరాడక మృతి చెందినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన నలుగురు ఆస్పత్రిలో చనిపోయారు. క్షతగాత్రులైన 141 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రాత్రి వరకు మంటలు అదుపులోకి వచ్చాయి. -
చైనాలో అగ్నిప్రమాదం
బీజింగ్: చైనాలోని ఓ హోటల్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. హైలాంగ్జియాంగ్ ప్రావిన్సులోని హర్బిన్ పట్టణంలో ఉన్న ‘బైలాంగ్ హాట్ స్ప్రింగ్ లీజర్ హోటల్’లో శనివారం ఉదయం 4.36కు మంటలు చెలరేగాయి. ఈ మంటలు హోటల్కంతా వ్యాపించడంతో 19 మంది దుర్మరణం చెందగా, మరో 23 మంది గాయపడ్డారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న 100 మంది అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో దాదాపు మూడున్నర గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంటల కారణంగా హోటల్లో చిక్కుకున్న 20 మందిని అధికారులు కాపాడగలిగారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. -
గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం ముగ్గురు మృతి
-
ముంబైలో భారీ అగ్నిప్రమాదం.
-
శంషాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
- గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రి దగ్ధం - సురక్షితంగా బయటపడిన 30 మంది శంషాబాద్ (రాజేంద్రనగర్): రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ఆరంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 30 మంది ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.దాదాపు రూ.కోటి కి పైగా ఆస్తి నష్టం జరి గిందని అంచనా. ఇక్కడి మధురానగర్ కాలనీలో ఫిరంగి నాలాను ఆనుకొని ఈ భవనం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఈఎస్ఐ ఆస్పత్రి ఉండగా, ఒకటో అంతస్తు నుంచి ఐదో అంతస్తు వరకు అనుపమ లాడ్జిని నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున ఐదున్నర ప్రాంతంలో కాలనీలోని 11 కేవీ వైరు.. ఎల్టీ వైరుపై పడటంతో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో ఈఎస్ఐ ఆస్పత్రిలో వైర్లు దగ్ధమై పొగలు రావడంతో యజమాని, సెక్యూరిటీ గార్డు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. మొదటి అంతస్తులోని లాడ్జి రిసెప్షన్ గది కూడా పూర్తిగా దగ్ధమైంది. ఈఎస్ఐ ఆస్పత్రిలో ఉన్న మందులతో పాటు ఇతర సామగ్రి, రికార్డులు, ఫర్నిచర్ కాలి బూడిదయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్లో చెలరేగిన మంటల సెగలు పైకి ఎగబాకుతుండడంతో లాడ్జి గదు ల్లో ఉన్న సుమారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. నాలుగు ఫైరింజన్లు చేరుకొని మంటలను అదుపులోకి తేవడంతో వారంతా బయటకు వెళ్లారు. -
శేషాచలంలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, తిరుమల: తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీవారి ఆలయానికి పడమర దిశలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం జరిగిన అగ్నిప్రమాదం కూడా అలాంటిదే. తిరుపతి కల్యాణి డ్యామ్ మీదుగా ఛామలా రేంజ్లో చెలరేగిన మంటల్ని అదుపు చేయకపోవడంతో ధర్మగిరికి విస్తరించాయి. కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీగంథం వనం సమీపంలోకి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో టీటీడీ డీఎఫ్‌వో శివరామ్‌ప్రసాద్.. సుమారు 100 మంది సిబ్బంది, మరో 40 మంది విజిలెన్స్ సిబ్బంది, ఫైర్ విభాగానికి సంబంధించిన 20 మందితో ఘటన స్థలికి చేరుకున్నారు. మంటల్ని సిబ్బంది సమన్వయంతో అదుపు చేశారు. -
కడప జిల్లాలో పదిళ్లు దగ్ధం
-
ప్రమాదానికి బాధ్యతగా ప్రధాని రాజీనామా
బుకారెస్ట్(రుమేనియా): దేశ చరిత్రలో ఎన్నడూలేనంతటి ఘోర అగ్నిప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రుమేనియా దేశ ప్రధాని విక్టర్ పొంటా(43) బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. గత నెల ఆరో తేదీన బుకారెస్ట్‌లోని నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 32 మంది సజీవదహనమయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాదాపు వంద మంది క్షతగాత్రుల పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉంది. దాంతో ఆగ్రహించిన 20,000 మంది స్థానికులు సోమవారం సిటీలోని ప్రఖ్యాత విక్టరీ స్క్వేర్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రధాని గద్దెదిగాలని నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీంతో తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు పొంటా ప్రకటించారు. తన రాజీనామా, వీధుల్లోకి వచ్చిన ప్రజలను సంతృప్తి పరుస్తుందని భావిస్తున్నానన్నారు. రుమేనియాకు పోంటా 2012 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు. -
ఏసీ బస్సులో మంటలు: 5గురు సజీవదహనం
మహారాష్ట్ర నాగపూర్ వద్ద ఏసీ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సజీవ దహనమైయ్యారు. మరో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తలేగాం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. నాగ్‌పూర్ నుంచి అమరావతి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఆ ప్రమాదం చోటు చేసుకుంది. నాగపూర్ సమీపంలోని తలేగాం వద్దకు చేరుకోగానే ఆ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్పిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం
గణపవరం(నాదెండ్ల) న్యూస్‌లైన్: స్పిన్నింగ్ మిల్లులో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగి రూ.కోటికి పైగా ఆస్తినష్టం సంభవించింది. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో ఈ ప్రమాదంలో చోటుచేసుకుంది. మిల్లు చైర్మన్ యర్రం శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వైఎస్సార్ స్పిన్సింగ్ మిల్లులోని స్టాక్‌గోడౌన్‌లో మధ్యాహ్నం 2.45 గంటలకు భారీఎత్తున మంటలు చెలరేగాయి. కార్మికులు గమనించి యాజమాన్యానికి, అగ్నిమాపకదళ అధికారులకు సమాచారం ఇచ్చారు. గోడౌన్లో ఉన్న 700 లకు పైగా పత్తి బేళ్లు, వీటిని ఆనుకొని ఉన్న 100 యార్న్ బండిల్స్ దగ్ధమయ్యాయి. మరో 100 యార్న్ బండిళ్ళను కార్మికులు సురక్షితంగా బయటకు తేగలిగారు. విద్యుత్ షార్ట్ సర్య్కూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. చిలకలూరిపేట ఫైర్ ఆఫీసర్ భాస్కరరావు సిబ్బందితో వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలను ఆర్పేందుకు ఐసీఎం, కల్పతరువు, ధనలక్ష్మి, ఎంఎల్ గ్రూపు, తిరుమలకంపెనీలకు చెందిన వాటర్‌ట్యాంకర్లను కూడా ఉపయోగించారు. అర్బన్ సీఐ గొట్టిపాటి చెంచుబాబు, ఎస్సై సాంబశివరావు, పలువురు పారిశ్రామికవేత్తలు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.