శేషాచలంలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, తిరుమల: తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీవారి ఆలయానికి పడమర దిశలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం జరిగిన అగ్నిప్రమాదం కూడా అలాంటిదే. తిరుపతి కల్యాణి డ్యామ్ మీదుగా ఛామలా రేంజ్‌లో చెలరేగిన మంటల్ని అదుపు చేయకపోవడంతో ధర్మగిరికి విస్తరించాయి. కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీగంథం వనం సమీపంలోకి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో టీటీడీ డీఎఫ్‌వో శివరామ్‌ప్రసాద్.. సుమారు 100 మంది సిబ్బంది, మరో 40 మంది విజిలెన్స్ సిబ్బంది, ఫైర్ విభాగానికి సంబంధించిన 20 మందితో ఘటన స్థలికి చేరుకున్నారు. మంటల్ని సిబ్బంది సమన్వయంతో అదుపు చేశారు.