బీజింగ్: చైనాలోని ఓ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. హైలాంగ్జియాంగ్ ప్రావిన్సులోని హర్బిన్ పట్టణంలో ఉన్న ‘బైలాంగ్ హాట్ స్ప్రింగ్ లీజర్ హోటల్’లో శనివారం ఉదయం 4.36కు మంటలు చెలరేగాయి. ఈ మంటలు హోటల్‌కంతా వ్యాపించడంతో 19 మంది దుర్మరణం చెందగా, మరో 23 మంది గాయపడ్డారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న 100 మంది అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో దాదాపు మూడున్నర గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంటల కారణంగా హోటల్‌లో చిక్కుకున్న 20 మందిని అధికారులు కాపాడగలిగారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment