అమెరికాలో కాల్పులు.. భారతీయ విద్యార్థి మృతి | Indian student killed in shooting inside US | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పులు.. భారతీయ విద్యార్థి మృతి

Published Sat, Nov 30 2019 5:32 AM | Last Updated on Sat, Nov 30 2019 5:32 AM

Indian student killed in shooting inside US - Sakshi

మైసూరు : ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన మైసూరు యువకుడు ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. గురువారం జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మైసూరులోని కువెంపు నగర్‌కు చెందిన అభిషేక్‌ సుధేశ్‌ భట్‌ (25)  ఇంజనీరింగ్‌ పూర్తిచేసి ఏడాదిన్నర క్రితం ఎంఎస్‌ చేసేందుకు అమెరికా వెళ్లాడు. శాన్‌ బెర్నార్డియాలోని కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చేస్తూ ఓ హోటల్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం హోటల్‌కు వచ్చిన ఓ దుండగుడు అభిషేక్‌తో గొడవపడి, తుపాకితో కాల్పులు జరిపి పారిపోయాడు. తీవ్ర గాయాలతో అభిషేక్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement