ఏసీ బస్సులో మంటలు: 5గురు సజీవదహనం | 5 Killed Due to Heavy Fire Accident in AC Bus at Nagpur - Amravati Highway | Sakshi
Sakshi News home page

ఏసీ బస్సులో మంటలు: 5గురు సజీవదహనం

Published Thu, May 29 2014 10:45 AM | Last Updated on Fri, Oct 19 2018 7:37 PM

ఏసీ బస్సులో మంటలు: 5గురు సజీవదహనం - Sakshi

ఏసీ బస్సులో మంటలు: 5గురు సజీవదహనం

మహారాష్ట్ర నాగపూర్ వద్ద ఏసీ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సజీవ దహనమైయ్యారు. మరో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తలేగాం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

 

నాగ్పూర్ నుంచి అమరావతి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఆ ప్రమాదం చోటు చేసుకుంది. నాగపూర్ సమీపంలోని తలేగాం వద్దకు చేరుకోగానే  ఆ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement